15 వేల ఉద్యోగాలు.. నెలకు రూ.2లక్షల జీతం
యుద్ధం కారణంగా కార్మికుల కొరత ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్.. భారత్ నుంచి వేల సంఖ్యలో నియామకాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా మరోసారి వేల సంఖ్యలో కార్మికులను నియమించుకునేందుకు భారత్ను ఇటీవల సంప్రదించిందని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెల్లడించింది. 15వేల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ ఉద్యోగానికి నెలకు రూ.1.92 లక్షల జీతంతోపాటు బీమా, ఆహారం, వసతి కల్పిస్తారు.