shape

All News ChotaNews

IT కారిడార్‌లను కలుపుతూ MMTSలు

IT కారిడార్‌లను కలుపుతూ MMTSలు

HYD : MMTS రెండోదశ పూర్తయ్యింది. నగరానికి తూర్పు, పడమరలో ఉన్న IT కారిడార్‌లను కలుపుతూ లింగంపల్లి-ఘట్‌కేసర్‌ మధ్య MMTS పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్‌ను బైపాస్‌ చేస్తూ లింగంపల్లి-సనత్‌నగర్‌-మౌలాలి-చర్లపల్లి-ఘట్‌కేసర్‌ మార్గంలో ఈ రైళ్లు సాగనున్నాయి. మార్చి నాలుగైదు తేదీల్లో ఏదో ఒకరోజు ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. కాలుష్యం లేని, వేగవంతమైన ప్రజారవాణా నగర ప్రజలకు కేవలం రూ. 5ల టిక్కెట్‌ ధరతో దక్కనుంది.

తెలంగాణకి 2 పర్యాటక ప్రాజెక్టులు!

తెలంగాణకి 2 పర్యాటక ప్రాజెక్టులు!

TG : రాష్ట్రానికి కేంద్రం నుంచి రెండు పర్యాటక ప్రాజెక్టులు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి ఐదింటిని ప్రతిపాదించగా రెండుప్రాజెక్టులు తుది పరిశీలనలో ఉన్నాయి. వీటికి సూత్రప్రాయంగా ఆమోదం లభించిందని త్వరలోనే ప్రకటన వస్తుందని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ వర్గాలు తెలిపాయి. కల్చర్‌-హెరిటేజ్‌ గమ్యస్థానాల్లో నల్గొండజిల్లాలో నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం, ప్రకృతి పర్యాటకం గమ్యస్థానాల్లో కామారెడ్డిజిల్లా బాన్సువాడలోని కల్కి చెరువు షార్ట్‌లిస్టులో ఉన్నాయి.

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

భారీ అగ్నిప్రమాదం.. 44 మంది మృతి

భారీ అగ్నిప్రమాదం.. 44 మంది మృతి

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏడు అంతస్తుల రెస్టారంట్‌లో మంటలు చెలరేగి 44 మంది మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది 75 మందిని రక్షించారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్లే మంటలు చెలరేగినట్లు గుర్తించారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

గుంటూరు: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. మార్చి 18 - ఫస్ట్ లాంగ్వేజ్, 19న - సెకండ్ లాంగ్వేజ్, 21న - థర్డ్ లాంగ్వేజ్, 23న - గణితం, 26న - ఫిజిక్స్, 28న - బయాలజీ 30న - సోషల్ స్టడీస్ ఉంటుందన్నారు.

హైదరాబాద్‌లో అత్యధికం.. పెద్దపల్లిలో అతి తక్కువ

హైదరాబాద్‌లో అత్యధికం.. పెద్దపల్లిలో అతి తక్కువ

HYD : జిల్లాలవారీగా చూస్తే హైదరాబాద్‌లో అత్యధికంగా 878 DSC పోస్టులు భర్తీ చేయనున్నారు. అత్యల్పంగా పెద్దపల్లిలో 93 మాత్రమే ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు గరిష్ఠంగా ఖమ్మం జిల్లాలో 176 ఉండగా.. కనిష్ఠంగా మేడ్చల్‌లో 26 పోస్టులు ఉన్నాయి. ఇక SGT పోస్టుల విషయానికి వస్తే అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 537, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 21 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

నేటి నుంచి పెండింగ్‌ దరఖాస్తులపై స్పెషల్‌ డ్రైవ్‌

నేటి నుంచి పెండింగ్‌ దరఖాస్తులపై స్పెషల్‌ డ్రైవ్‌

HYD: ధరణిలోని అపరిష్కృత దరఖాస్తులకు మోక్షం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజనతోపాటు మండలస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం(మార్చి 1)నుంచి తొమ్మిదో తేదీలోపు పెండింగ్‌ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనుంది.అన్ని స్థాయుల్లో విచారణలు, దస్త్రాల పరిశీలన చేపట్టాలని, వాటి వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌(CCLA)నవీన్‌ మిత్తల్‌ ఆదేశించారు.

ట్రాక్టర్‌-కారు ఢీ.. ముగ్గురు మృతి

ట్రాక్టర్‌-కారు ఢీ.. ముగ్గురు మృతి

AP: గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉంది. మృతులంతా మంగళగిరికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ప్రత్తిపాటి శరత్‌కు 14 రోజుల రిమాండ్‌

ప్రత్తిపాటి శరత్‌కు 14 రోజుల రిమాండ్‌

AP: టీడీపీ మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. జీఎస్టీ ఎగవేత, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలపై శరత్‌ను పోలీసులు గురువారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. అనంతరం క్రీస్తు రాజపురంలోని ఒకటో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు జడ్జి ముందు హాజరుపరచగా.. శరత్‌కు 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్ విధించారు.

H1B రిజిస్ట్రేషన్‌కు కొత్త విధానం

H1B రిజిస్ట్రేషన్‌కు కొత్త విధానం

హెచ్‌1బీ రిజిస్ట్రేషన్స్‌, పిటిషన్స్‌కి సంబంధించి అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. మైయూఎస్‌సీఐఎస్‌ పేరిట ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా సంస్థలు, వారి ప్రతినిధులు వీసా దరఖాస్తు ప్రక్రియలో సమర్థంగా భాగస్వామ్యమయ్యేందుకు వీలవుతుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌1బీ పిటిషన్స్‌ దాఖలు చేసే సంస్థలు మైయూఎస్‌సీఐఎస్‌లో ఆర్గనైజేషనల్‌ ఖాతా క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

నేడు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పాలమూరు ప్రాజెక్టు సందర్శన

నేడు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పాలమూరు ప్రాజెక్టు సందర్శన

TG: ఓవైపు బీఆర్‌ఎస్‌ నేతలు మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్న క్రమంలో.. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సందర్శించబోతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చలో పాలమూరు రంగారెడ్డి పర్యటనకు కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు.

మేడారం జాతర.. ఆర్టీసీ బస్సుల్లో 20 లక్షల మంది ప్రయాణం

మేడారం జాతర.. ఆర్టీసీ బస్సుల్లో 20 లక్షల మంది ప్రయాణం

TG: మేడారం జాతర సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ దాదాపు 4 వేల ప్రత్యేక బస్సుల్ని నడిపించింది. సుమారు 20 లక్షల మంది భక్తులు వాటిలో ప్రయాణించారు. ప్రయాణికుల్ని సురక్షితంగా తీసుకెళ్లడంలో సిబ్బంది అందించిన సేవలకు నగదు అవార్డు ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. ఒక్కో డ్రైవర్‌, ఎస్‌డీఐకి రూ.1,000, కండక్టర్లు, మెకానిక్‌లు, శ్రామికులు, ఆర్జిజన్లు, క్లర్కులకు రూ.500 చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వనున్నారు.

నేడు మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ బృందం

నేడు మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ బృందం

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. అందులో భాగంగా బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల బృందం శుక్రవారం మేడిగడ్డను సందర్శించనుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200 మంది ప్రతినిధి బృందంతో బ్యారేజీని సందర్శించనుంది.

నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

AP: శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈనెల 11 వరకు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 8.10 గంటలకు ఆలయ ఛైర్మన్‌ చక్రపాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. శివదీక్షధారులకు ఈనెల 5 వరకు విడతల వారిగా స్వామి స్పర్శ దర్శనం కల్పించనున్నారు.

MYSTERY: నిర్మానుష్యంగా మారిన ఐలాండ్

MYSTERY: నిర్మానుష్యంగా మారిన ఐలాండ్

ఒకప్పుడు జపాన్‌లోని ఐలాండ్ ప్రాంతంలో అత్యధిక జనాభా ఉండేది. ఇప్పుడు ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. అందుకు గల కారణాలు పై వీడియో చూసి తెలుసుకోండి.

స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఉంటే.. ఇది మీ కోసమే!

స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఉంటే.. ఇది మీ కోసమే!

స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఉంటే.. ఇది మీ కోసమే!

చిన్నారులను ఎండ నుంచి కాపాడడం ఎలా..

చిన్నారులను ఎండ నుంచి కాపాడడం ఎలా..

చిన్నారులను ఎండ నుంచి కాపాడడం ఎలా..

నేటి నుంచి ఏపీలో ఇంటర్‌ పరీక్షలు

నేటి నుంచి ఏపీలో ఇంటర్‌ పరీక్షలు

ఏపీలో శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 4,73,058 మంది పరీక్షకు హాజరుకానున్నారు. ద్వితీయ సంవత్సరానికి చెందిన 4,88,881 మంది పరీక్ష రాయనున్నారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి రెండేళ్లకు కలిపి 90,282 మంది పరీక్షలకు హాజరుకానున్నారు.

నేడు విద్యాదీవెన నిధుల విడుదల

నేడు విద్యాదీవెన నిధుల విడుదల

AP: సీఎం జగన్ శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో పర్యటించనున్నారు. విద్యాదీవెన కింద అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 9.44 లక్షల మంది విద్యార్థులకు రూ.708.68కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌ నిధులను సీఎం జగన్‌ బటన్‌ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15,000, డిగ్రీ, మెడిసిన్ సహా ఇతర ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు రూ.20,000 సాయం అందిస్తోంది.

6న ఏపీ కేబినెట్ సమావేశం

6న ఏపీ కేబినెట్ సమావేశం

ఈనెల 6న ఏపీ కేబినెట్ భేటీ జరుగనుంది. సాధారణ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఇది కేబినెట్ చివరి భేటీగా భావిస్తున్నారు. అలాగే ఎన్నికల షెడ్యూలు వచ్చేలోగా మార్చి నెలకు సంబంధించిన వివిధ పథకాలకు కేబినెట్ ఆమోదం లభిస్తే వాటిని కొనసాగించేందుకు వీలు ఉంటుందనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

సాగర్‌ నుంచి ఏపీకి 3 టీఎంసీలు

సాగర్‌ నుంచి ఏపీకి 3 టీఎంసీలు

TG: నాగార్జునసాగర్‌ నుంచి ఏపీకి 3 TMCల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఉత్తర్వులు జారీచేసింది. శుక్రవారం ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో సాగర్ కుడికాలువ హెడ్‌రెగ్యులేటరీ ద్వారా ఏపీకి 3 TMCల నీటిని విడుదల చేయనున్నారు. మార్చి నెలకు సంబంధించి సాగర్‌ కుడికాలువ ద్వారా 3 TMCలు, ఏప్రిల్‌కు సంబంధించి 5 TMCలను విడుదల చేయాలని ఏపీ ఇప్పటికే బోర్డుకు లేఖ రాసింది.

నిజం తెలియాలనే అలా చేశా: హనుమ విహారి

నిజం తెలియాలనే అలా చేశా: హనుమ విహారి

ఏ తప్పు చేయకపోయినా తనను ఆంధ్రా జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించారని సీనియర్ క్రికెటర్ హనుమ విహారి ఆరోపించారు.‘‘టీమ్‌లో 17వ ప్లేయర్‌గా ఉన్న వ్యక్తి..రూల్స్ ప్రకారం డ్రెస్సింగ్ రూమ్‌కి రాకూడదు. కానీ అతడు వచ్చాడు. దీని గురించి వారించినందుకు అతడు, అతడి తండ్రి.. నేనే తప్పు చేసినట్లుగా చిత్రీకరించారు. ప్రజలకు నిజం తెలియాలనే దీనిపై పోస్ట్ పెట్టాను’’అని ఓ ఇంటర్వ్యూలో హనుమ చెప్పారు.

చేప కొంచెం.. కూత ఘనం

చేప కొంచెం.. కూత ఘనం

ప్రపంచంలోనే అత్యంత చిన్న చేప అయిన డానియనెల్లా సెరెబ్రం.. మయన్మార్‌ నీళ్లలో కనిపించే ఈ చేప కూత పెడితే చెవులు చిల్లులు పడాల్సిందే. శబ్దాల్ని చేయటంలో ఇది ప్రత్యేకతను కలిగి ఉందని బెర్లిన్‌కు చెందిన చారైట్‌ యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. ఈ చేపలు 140 డెసిబుల్స్‌ వరకు శబ్దం చేయగలవని, అంబులెన్స్‌ సైరన్‌, డ్రిల్లింగ్‌ మిషన్‌ శబ్దానికి ఇది సమానంగా ఉంటుందని చెప్పారు.

ఆయన యాక్టింగ్‌ చేయకుండానే హీరో అయ్యాడు: విశ్వక్‌ సేన్‌

ఆయన యాక్టింగ్‌ చేయకుండానే హీరో అయ్యాడు: విశ్వక్‌ సేన్‌

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ నటించిన లేటెస్ట్ మూవీ ‘గామి’. ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా మాట్లాడారు. ‘‘విభిన్న చిత్రాల్లో ‘గామి’ ఒకటి. ట్రైలర్‌ బాగుంది. సినిమా మంచి విజయం అందుకోవాలని ఆశిస్తున్నా’’ అని అన్నారు. యాక్టింగ్‌ చేయకుండానే హీరో అయిన వ్యక్తి సందీప్ వంగా అని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ సైనికుల అరాచకం

ఇజ్రాయెల్ సైనికుల అరాచకం

పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ ఆర్మీ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రపంచ దేశాల నుంచి పెద్దఎత్తున వచ్చిన నిత్యావసరాల పంపిణీ కోసం గాజాలో ఓ చోట ఏర్పాటుచేసిన సహాయక కేంద్రం వద్ద క్యూ కట్టిన ప్రజలపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 104 మంది సామాన్య పౌరులు చనిపోగా, 700 మందికిపైగా గాయపడ్డారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర గాజా ప్రాంతంలో చోటుచేసుకుంది.

మే 1 నుంచి రైళ్ల సర్వీసులను నిలిపివేస్తాం: రైల్వే సంఘాలు

మే 1 నుంచి రైళ్ల సర్వీసులను నిలిపివేస్తాం: రైల్వే సంఘాలు

అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మే 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తామని పలు రైల్వే సంఘాలు హెచ్చరించాయి. నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈనెల 19న కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖను కలిసి సమ్మె అంశంపై అధికారికంగా నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు.

ఉత్కంఠగా ‘వళరి’ ట్రైలర్‌..

ఉత్కంఠగా ‘వళరి’ ట్రైలర్‌..

‘గురు’ ఫేమ్ రితికా సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన హారర్‌ మూవీ ‘వ‌ళ‌రి’. అయితే, ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈనెల 6 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం ఉత్కంఠతో సాగిన ఆ ట్రైలర్‌ మీరూ చూసేయండి.

ఈసారి బీజేపీ గెలిస్తే సిలిండర్ ధర రూ.2 వేలు కావొచ్చు: మమత

ఈసారి బీజేపీ గెలిస్తే సిలిండర్ ధర రూ.2 వేలు కావొచ్చు: మమత

బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. వాళ్లు వంట గ్యాస్ సిలిండర్ ధరలను రూ.1,500 లేదా రూ.2,000కి పెంచవచ్చని వ్యాఖ్యానించారు. అప్పుడు మంటలు చేసుకునేందుకు కలపను సేకరించే పాత పద్ధతికే తిరిగి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. జర్‌గ్రామ్ జిల్లాలో నిర్వహించిన ఒక పబ్లిక్ ఈవెంట్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యర్థి నేతలకు శరద్‌ పవార్‌ ‘విందు’ ఆహ్వానం

ప్రత్యర్థి నేతలకు శరద్‌ పవార్‌ ‘విందు’ ఆహ్వానం

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శనివారం పుణె జిల్లాలోని బారామతిలో ఉద్యోగమేళా ప్రారంభోత్సవానికి సీఎం శిండే, డిప్యూటీ సీఎంలు ఫడ్నవీస్‌, అజిత్‌‌లు హాజరుకానున్నారు. శరద్‌‌పవార్‌ రాజ్యసభ ఎంపీ కాగా..బారామతి పార్లమెంటు స్థానం నుంచి ఆయన కుమార్తె సుప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమంలో తామిద్దరం భాగమవుతామని పవార్‌ తెలిపారు.ఈ క్రమంలో తన ఇంటికి విందుకు రావాల్సిందిగా ముగ్గురు నేతలను ఆహ్వానించారు.

ప్రధాని మోదీ పర్యటనకు బందోబస్తు: సీఎస్‌

ప్రధాని మోదీ పర్యటనకు బందోబస్తు: సీఎస్‌

తెలంగాణలో మార్చి 4, 5 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. బ్లూ బుక్‌ ప్రకారం ప్రధాని పర్యటనకు భద్రత, ట్రాఫిక్‌, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసుశాఖకు సూచించారు. విమానాశ్రయం, హెలిప్యాడ్‌లతో పాటు అన్ని వేదికల వద్ద అగ్నిమాపక వాహనాలు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

చైనా స్మార్ట్‌ కార్లతో జాగ్రత్త: బైడెన్‌

చైనా స్మార్ట్‌ కార్లతో జాగ్రత్త: బైడెన్‌

చైనా తయారుచేసిన కార్లపై దర్యాప్తు చేపట్టాలని బైడెన్‌ ప్రభుత్వం ఆదేశించింది. కార్ల సాయంతో అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని డ్రాగన్‌ సేకరించే ప్రమాదముందని బైడెన్‌ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఎలక్ట్రిక్‌ సహా ఇతర కార్లలోని డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీ వంటి ఫీచర్లను ఉపయోగించి అమెరికన్లపై గూఢచర్యం చేసేందుకు అవకాశముందని భావిస్తోంది. ఈ క్రమంలో అమెరికన్ల డేటాను రక్షించడానికి ఈ చర్యలు చేపట్టినట్లు బైడెన్‌ ప్రకటించారు.

మార్చి నెల సంక్షేమ పథకాల షెడ్యూల్ ఇదే

మార్చి నెల సంక్షేమ పథకాల షెడ్యూల్ ఇదే

AP: మార్చి నెలలో ప్రజలకు అందించే సంక్షేమ పథకాల అమలు షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.

బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ప్రారంభం

బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ప్రారంభం

ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. అర్థరాత్రి దాటే వరకు ఈ భేటీ కొనసాగనుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. తెలంగాణ సహా మొత్తం 9 రాష్ట్రాల్లో లోక్‌సభ అభ్యర్థులపై కమిటీ కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా 125కు పైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. రేపు ఉదయం తొలి జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

WPL: ఆర్సీబీ దూకుడుకు ఢిల్లీ బ్రేక్‌

WPL: ఆర్సీబీ దూకుడుకు ఢిల్లీ బ్రేక్‌

డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు దూకుడుకు బ్రేక్‌ పడింది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆర్సీబీ.. మూడో మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యచేధనలో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులే చేసింది. స్మృతి మంధాన (74), సోఫీ డివైన్‌ (23), సబ్బినేని మేఘన (36) దూకుడుగా ఆడినా మిగిలిన బ్యాటర్లు రాణించకపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.

ధనుశ్ సినిమా షూటింగ్‌కు రష్మిక బ్రేక్‌

ధనుశ్ సినిమా షూటింగ్‌కు రష్మిక బ్రేక్‌

శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో కన్నడ భామ రష్మిక ప్రస్తుతం హీరో ధనుశ్‌తో ఓ చిత్రం చేస్తుంది. కాగా హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో ధనుశ్‌తో కలిసి పాల్గొన్న రష్మిక మందన్నా ఆ తర్వాత ముంబై నుంచి టోక్యోకు పయనమైంది. టోక్యోలో జరుగనున్న Crunchyroll Anime Awards కార్యక్రమానికి హాజరుకానుంది. అయితే రష్మిక తిరిగి ఎప్పుడు షూట్‌లో జాయిన్ అవుతుందనేది తెలియాల్సి ఉంది.

ఏపీలో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ!

ఏపీలో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ!

ఏపీలో 2023-2024 వరకు ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీని మాఫీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఒకే విడత కింద వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. 2024 మార్చి 31 లోపు పన్ను ఒకేసారి లేదా వాయిదాల్లో చెల్లిస్తేనే వడ్డీ మాఫీ వర్తిస్తుందని పేర్కొంది. గతంలో వడ్డీ చెల్లించి ఉంటే పన్నులో సర్దుబాటు చేస్తామని స్పష్టం చేసింది.