shape

Andhra Pradesh ChotaNews

Blog Image

ఎస్సీ వర్గీకరణ కోసం కొట్లాడేది మల్లు రవి: సీఎం రేవంత్

ఎస్సీ వర్గీకరణ కోసం ఢిల్లీలో కొట్లాడేది మల్లు రవి మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చే అంశంపై సైతం సుప్రీంకోర్టులో కాంగ్రెస్ కొట్లాడుతుందని రేవంత్ వెల్లడించారు. ఈ పనులన్నీ జరగాలంటే నాగర్ కర్నూల్‌లో మల్లు రవిని, మహబూబ్‌నగర్‌లో వంశీచంద్ రెడ్డి గెలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వారిద్దరిని లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Blog Image

కాంగ్రెస్‌లో TRS విలీనం నిజమే: కేసీఆర్

కాంగ్రెస్‌లో TRS విలీనం చేస్తామన్న మాట నిజమేనని కేసీఆర్ అంగీకరించారు. అయితే ఏపీ, తెలంగాణ వేరు పడినా కూడా రెండు రాష్ట్రాలకు కలిపి ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ భావించిందని చెప్పారు. అందుకే విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని తెలిపారు. ఒంటరిగా వెళ్లి స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని వెల్లడించారు.

Blog Image

అదే నా జీవితలక్ష్యం: సీఎం రేవంత్

పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 70 ఏళ్ల తర్వాత పాలమూరుకు సువర్ణవకాశం లభించిందని, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా సరే.. ఈ జిల్లాలో నీటి సమస్యను తొలగిస్తామని వెల్లడించారు. ఈ జిల్లా ఇబ్బందులు తొలగించి.. ఈ గడ్డ రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు.

Blog Image

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

Blog Image

కాంగ్రెస్ గెలిస్తే ముస్లిం చట్టాలు తెస్తారు: సీఎం

సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే షరియా చట్టం తెచ్చేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. దేశంలో షరియా చట్టాన్ని అమలు చేయడం, ప్రజల సంపద వారికే తిరిగి పంచేయడం వంటివి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉద్దేశంగా కనిపిస్తోందని చెప్పారు.

Blog Image

సీఎం జగన్‌పై షర్మిల తీవ్ర విమర్శలు

ఐదేళ్లలో ఒక్క జాబ్‌ క్యాలెండర్‌ కూడా ఇవ్వలేని జగన్‌.. మళ్లీ ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధం అంటున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ప్రజల అవసరాలు పట్టించుకోని వైసీపీ ఎమ్మెల్యేలకు జనం ఎందుకు ఓట్లు వేయాలని ఆమె ప్రశ్నించారు. పులి పులి అని చెప్పుకొనే జగన్‌ .. పిల్లిలా మారి బీజేపీ కొంగు పట్టుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

Blog Image

వివాదాస్పద బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం

పెద్దఎత్తున అక్రమ వలసలతో సతమతమవుతోన్న బ్రిటన్‌.. వీటికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన వివాదాస్పద ‘రువాండా బిల్లు’కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీనిని సమర్థించుకున్న ప్రధానమంత్రి రిషి సునాక్‌.. అక్రమ వలసదారులను ఆఫ్రికా దేశానికి తరలించేందుకు ఏదీ అడ్డు కాదన్నారు. అంతర్జాతీయ వలసల నిర్వహణలో ఇదో మైలురాయని తెలిపారు. బ్రిటన్‌ రాజు చార్లెస్‌ III ఆమోదం తర్వాత ఇది చట్టరూపం దాల్చనుంది.

Blog Image

మమ్నల్ని ప్రజలు తిరస్కరించలేదు: కేసీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో తమను ప్రజలు తిరస్కరించలేదని బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఓ మీడియా ఇంటర్వ్యూలో అన్నారు. తమ పార్టీకి మూడోవంతు సీట్లు వచ్చాయని చెప్పారు. చిన్న మత కల్లోలం లేకుండా పదేళ్లు పాలన సాగించామని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చూడాలని కాంగ్రెస్ పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అజ్ఞానం, అహాంకారంతో ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Blog Image

ప్రవీణ్‌కుమార్‌ను డీజీపీగా చేసేవాళ్లం: సీఎం రేవంత్

ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్‌గానే కొనసాగి ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన్ను డీజీపీగా చేసేవాళ్లమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కానీ, ఆయన మాదిగలకు ద్రోహం చేసిన కేసీఆర్ చెంతన చేరడం బాధాకరమన్నారు. ఈ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్‌కు ఓటేస్తే.. అది కేసీఆర్‌కు పోతుందన్నారు. ప్రవీణ్‌కు ఓటేస్తే.. కేసీఆర్ వాటిని మోదీకి అమ్ముకుంటారని ఆరోపించారు. ఇలాంటి అమ్ముడుపోయే నేతలు పాలమూరుకు అవసరమా? అని రేవంత్ ప్రశ్నించారు.

Blog Image

‘చంద్రబాబుపై చర్యలు తీసుకోండి’

చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా సిఫార్సు చేశారు. బహిరంగ సభల్లో జగన్‌పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై చంద్రబాబు వివరణ ఇచ్చారు. ఆయన వివరణపై సంతృప్తి చెందని సీఈవో.. తదుపరి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. చంద్రబాబు మాట్లాడిన ప్రసంగాల క్లిప్పింగ్‌లను జత పరిచారు.

Blog Image

70 ఏళ్ల తర్వాత సీఎం పదవి పాలమూరుకు దక్కింది: రేవంత్‌

దేశానికే ఆదర్శవంతమైన నాయకులను ఇచ్చిన గడ్డ పాలమూరు అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 1951లో ఇక్కడి బిడ్డ బూర్గుల రామకృష్ణారావుకు ముఖ్యమంత్రి పదవి దక్కితే.. తిరిగి 70ఏళ్ల తర్వాత తనకు సీఎం అయ్యే అవకాశం దక్కిందన్నారు. కానీ.. బీజేపీకి చెందిన డీకే.అరుణ, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌లు ప్రత్యర్థుల చేతిలో కత్తులుగా మారి.. పాలమూరు అభివృద్ధి కాకుండా కాళ్లలో కట్టెలు పెడుతున్నారని మండిపడ్డారు.

Blog Image

షర్మిల అప్పుపై చంద్రబాబు ఏమన్నారంటే?

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన అన్న సీఎం జగన్ వద్ద రూ. 82 కోట్లు అప్పు తీసుకున్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తండ్రి మొత్తం ఆస్తిని కొట్టేసిన దుర్మార్గుడు జగన్ అని విమర్శించారు. ఆస్తిలో వాటా ఇవ్వకుండా అప్పు ఇచ్చాడని మండిపడ్డారు. చెల్లికే న్యాయం చేయలేని వాడు ప్రజలకు ఏం మంచి చేస్తాడని ప్రశ్నించారు.

Blog Image

స్వరాష్ట్రంలో పాలమూరుకు తీరని అన్యాయం: సీఎం రేవంత్

తెలంగాణ స్వరాష్ట్రంలో పాలమూరుకు తీరని అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కరీంనగర్‌లో ఓడిపోతానని భయపడి కేసీఆర్ పాలమూరుకు వస్తే.. ఇక్కడి ప్రజలు గెలిపించి పార్లమెంట్‌కు పంపించారన్నారు. తదనంతరం కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇస్తే.. తానే తెచ్చానని కేసీఆర్ చెప్పుకున్నారని విమర్శించారు. పదేళ్లు తెలంగాణకు సీఎంగా ఉన్న కేసీఆర్.. మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు.

Blog Image

నా ప్రసంగంతో కాంగ్రెస్‌లో భయం: మోదీ

కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఇటీవల రాజస్థాన్‌ వచ్చినప్పుడు కొన్ని సత్యాలను 90 సెకన్లలో దేశానికి తెలియజేశా. నా ప్రసంగానికి కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిలో భయాందోళనలు మొదలయ్యాయి. ప్రజల ఆస్తులను లాక్కొని వాటిని కొందరు వ్యక్తులకు పంపిణీ చేసేందుకు కుట్ర పన్నుతోంది’’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.

Blog Image

బర్రెలక్క నామినేషన్.. ఎక్కన్నుంచి అంటే

నాగర్‌కర్నూల్: నాగర్‌‌కర్నూల్ లోక్‌‌సభ నియోజకవర్గం నుంచి శిరీష అలియాస్ బర్రెలక్క స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్‌కు ఆమె నామినేషన్ పత్రాలను అందించారు. శిరీష గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమె పోటీ చేయడం అప్పుడు సంచలనంగా మారింది.

Blog Image

సీఎం రేవంత్ సభలో కూలిన టెంట్

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజీనపల్లి మండలంలో సమావేశం కోసం ఏర్పాటు చేసిన టెంట్ కూలిపోయింది. ఆ సమయంలో టెంటు కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నిర్వహణ లోపం కారణంగా ఇలా జరిగిందని సమాచారం.

Blog Image

100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేశాం: మల్లు రవి

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే తాము ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో 5 హామీలను అమలు చేశామని నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి తెలిపారు. ఇవన్నీ చూసి ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్, బీజేపీలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మే 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తంపై ఓటు వేయాలని ఆయన కోరారు.

Blog Image

సముద్రంలో ఈత కొడుతూ భారతీయుడు మృతి

శ్రీలంక నుంచి ఇండియాకు ఈత కొడుతున్న 78 ఏళ్ల వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందాడు. బెంగళూరుకు చెందిన గోపాల్‌రావు శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి తమిళనాడులోని ధనుష్కోడికి ఈత కొడుతుండగా గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. అర్ధరాత్రి కొంత మంది బృందం ఈత ఈవెంట్‌ను ప్రారంభించారు. శ్రీలంక నుంచి ఇండియాకు వస్తుండగా గోపాల్‌రావు గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు.

Blog Image

ఎన్డీయేకు అయినా ఓటు వేయండి.. ఆయనకు వద్దు: తేజస్వీ

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్ణియాలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ఇండియా కూటమి అభ్యర్థి భీమా భారతికి ఓటు వేయకపోతే.. ఎన్డీయేను ఎంచుకోండని వ్యాఖ్యానించారు. స్వతంత్ర అభ్యర్థి రాజేశ్‌రంజన్ అలియాస్ పప్పూయాదవ్‌కు మాత్రం ఓటు వేయద్దన్నారు. ఒకప్పుడు ఆర్జేడీ నేత అయిన పప్పు యాదవ్ 2015లో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.

Blog Image

టాస్ గెలిచిన LSG..

IPL: తమిళనాడులోని చిదంబరం స్టేడియం వేదికగా కాసేపట్లో చెన్నై, లక్నో మధ్య మ్యాచ్ ప్రారంభంకానుంది. దీంట్లో టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో రెండు టీమ్స్ 7 మ్యాచ్‌లు ఆడగా 4 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. దీంతో ఎనిమిదో మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Blog Image

భారీ విరాళం ప్రకటించిన ప్రముఖ హీరో

తమిళ ప్రముఖ హీరో శివకార్తికేయన్ రూ.50 లక్షలు విరాళం అందించారు. 'సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌' భవన నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నడిగర్‌ సంఘం నుంచి శివకార్తికేయన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖ రాశారు. నడిగర్‌ భవన నిర్మాణ కోసం ఇప్పటికే కోలీవుడ్‌ టాప్‌ హీరోలు తమ వంతుగా సాయం చేస్తూనే ఉన్నారు.

Blog Image

తెలంగాణ స్పీకర్‌పై ఈసీకి ఫిర్యాదు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేయాలని కోరారని తెలిపారు. అందుకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డ్స్‌ను సీఈవో వికాస్ రాజ్‌‌కు అందించారు.

Blog Image

ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. చిరు జల్లులతో నగరం తడిసి ముద్దైంది. చల్లని గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. దీంతో ఢిల్లీ ప్రజలు వేడి నుంచి ఉపశమనం పొందారు. గత కొద్ది రోజులుగా వేడి గాలులతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంగళవారం సాయంత్రం హఠాత్తుగా మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో పలు చోట్ల వర్షం కురిసింది.

Blog Image

రేవంత్ సీఎం కావడం పాలమూరు అదృష్టం: జూపల్లి

తెలంగాణకు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం పాలమూరు అదృష్టమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూల్ జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రేవంత్ మార్గదర్శనంలో పాలమూరు దశా-దిశా మారబోతోంది. మన ఉమ్మడిజిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి.. రాహుల్‌ను ప్రధానిగా చేయాలి. కేసీఆర్‌ను, ఆయన కుర్చీనే రేవంత్ పీకేశారు. ఇంకా ఏం చేయమంటావ్ కేసీఆర్’’ అని ప్రశ్నించారు.

Blog Image

ఎస్సీ వర్గీకరణపై ముందడుగు వేసింది కాంగ్రెస్సే: సంపత్

ఎస్సీల ఏ,బీ,సీ,డీ వర్గీకరణపై ముందడుగు వేసింది కాంగ్రెస్సేనని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ తెలిపారు. నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ.. నాడు మాదిగల వర్గీకరణపై ఉషా మెహ్రా కమిటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసిందని, కానీ తర్వాత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్.. మాదిగలను అణగదొక్కాయని మండిపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మల్లు రవిని నాగర్ కర్నూల్‌లో గెలిపించాలని కోరారు.

Blog Image

కాంగ్రెస్ గెలిచాకే రాష్ట్రంలో ప్రజాపాలన: ప్రొ.కోదండరాం

కాంగ్రెస్‌ గెలిచాక తెలంగాణలో ప్రజాపాలన వచ్చిందని ప్రొ. కోదండరాం అన్నారు. నాగర్‌కర్నూల్‌‌లోని బిజినేపల్లి జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే. మోదీ హయాంలో అదానీ, అంబానీ సంపద పెరిగింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులు వంచనకు గురయ్యారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో కొన్నింటిని అమలు చేశారని, మిగతావాటిని కూడా భవిష్యత్‌లో సమర్థవంతంగా అమలు చేస్తారు’’ అని తెలిపారు.

Blog Image

తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.155 కోట్లు స్వాధీనం

తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.155 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రూ.61.11 కోట్ల నగదు, రూ.19.16 కోట్ల నగలు పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రూ. 28.92 కోట్ల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్న వెల్లడించారు. అంతేకాకుండా రూ.23.87 కోట్ల డ్రగ్స్‌, రూ.22.77 కోట్ల విలువైన వస్తువులు సీజ్ చేసినట్లు ప్రకటించారు.

Blog Image

వైసీపీ ఎమ్మెల్యే భార్యకు చేదు అనుభవం

నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి భార్యకు చేదు అనుభవం ఎదురైంది. నూనెపల్లెలో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లగా నాగిని రెడ్డిని ఓ మహిళ ఆమెను అడ్డుకుంది. శిల్పా కుటుంబం తనకు అన్యాయం చేసిందని ఆరోపించింది. తన జీవితం నాశనం కావడానికి నాగిని రెడ్డి కారణమని వాదనకు దిగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

Blog Image

శివబాలకృష్ణ బినామీల అరెస్ట్

HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గొడవర్తి సత్యనారాయణమూర్తి, పెంట భరత్ కుమార్, పెంట భరణి కుమార్ అనే ముగ్గురు శివబాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించారని.. వీరి పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. వీరిని ఏసీబీ స్పెషల్ కోర్టు ఎదుట హాజరుపరిచామని.. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించినట్లు తెలిపారు.