shape

Business ChotaNews

125 మందితో నేడు BJP తొలి జాబితా?

125 మందితో నేడు BJP తొలి జాబితా?

దేశవ్యాప్తంగా 125 పైగా స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను BJP నేడు ప్రకటించే అవకాశం ఉంది. BJPకేంద్ర ఎన్నికల కమిటి సమావేశంలో తెలంగాణతో సహా మొత్తం 9రాష్ట్రాల్లో లోక్‌సభ అభ్యర్థులపై కసరత్తు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి నాలుగు సిటింగ్‌ ఎంపీ స్థానాలు ఉండగా.. ఆదిలాబాద్‌ మినహా మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించనున్నట్టు సమాచారం.

తల్లిని చంపిన కూతురు

తల్లిని చంపిన కూతురు

మహబూబ్‌నగర్: కన్న తల్లిపై కుమార్తె దాడి చేసి హతమార్చిన దారుణ ఘటన భూత్పూర్ మండలం కర్వెనలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటమ్మ(60) చిన్నకుమార్తె నారమ్మను భర్త వదిలేయడంతో ఇంటి వద్దే ఉంటోంది. వ్యసనాలకు బానిసైన నారమ్మ డబ్బుల ఇవ్వలేదని వెంకటమ్మపై కట్టెతో దాడిచేసింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.

అందరికీ వర్తిసుందా?

అందరికీ వర్తిసుందా?

ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను సెంట్రల్‌ కాంట్రాక్టుల నుంచి తప్పించడం ద్వారా దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేసే ఆటగాళ్లను ఉపేక్షించేది లేదని బీసీసీఐ గట్టి హెచ్చరికే జారీ చేసింది. అయితే టీమ్‌ఇండియాకు దూరంగా ఉన్నపుడు దేశవాళీల్లో ఆడాల్సిందే అన్న నిబంధనను స్టార్ క్రికెటర్లకు కూడా వర్తింపజేయాలని మాజీ ఆటగాడు కీర్తి ఆజాద్‌ బీసీసీఐను కోరాడు.

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

తగ్గిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

తగ్గిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

గత కొద్ది నెలలుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి 9 నెలల్లో (ఏప్రిల్‌–డిసెంబర్‌) 13% క్షీణించాయి. అంతర్గత వాణిజ్యం, పరిశ్రమల ప్రోత్సాహకశాఖ (డీపీఐఐటీ) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం ఎఫ్‌డీఐలు 32.03 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది (2022–23) ఏప్రిల్‌–డిసెంబర్‌లో ఇవి 36.74 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

శ్రీశైలం ఆలయానికి ప్రత్యేక ఏసీ బస్సు సర్వీసులు

శ్రీశైలం ఆలయానికి ప్రత్యేక ఏసీ బస్సు సర్వీసులు

HYD : శ్రీశైలం ఆలయానికి వెళ్లే భక్తులకు TSRTC తీపి కబురును అందించింది. మార్చి 2వ తేదీ నుంచి 10రాజధాని ప్రత్యేక AC బస్సులను ప్రారంభించనున్నది. ఈ బస్సు సర్వీసులు BHEL, జూబ్లీబస్‌‌స్టేషన్‌, MGBSల ద్వారా శ్రీశైలం చేరుకుంటాయని రంగారెడ్డి రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ శ్రీధర్‌ తెలిపారు. ఈ AC బస్సు సర్వీసులలో పెద్దలకు రూ. 650 ,పిల్లలకు రూ. 510 ఛార్జీలుంటాయని వివరించారు.

హైదరాబాద్‌లో చిన్నారులకు స్కార్లెట్‌ జ్వరం

హైదరాబాద్‌లో చిన్నారులకు స్కార్లెట్‌ జ్వరం

TG: హైదరాబాద్‌లోని పలు చిన్న పిల్లల ఆసుపత్రులకు స్కార్లెట్‌ జ్వర బాధితుల తాకిడి పెరుగుతోంది. స్కార్లెట్‌ జ్వరం లక్షణాలు ఇవి.

RTCలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

RTCలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

HYD : TSRTC ఆధ్వర్యంలో హైదరాబాద్‌ తార్నాకలో నిర్వహిస్తున్న నర్సింగ్‌ కళాశాలలో ఉన్న పలు ఖాళీల భర్తీకి RTCతాజాగా మరో నోటిఫికేషన్‌ జారీచేసింది. ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ట్యూటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రొఫెసర్‌1, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 3, ట్యూటర్‌ 2 ఖాళీలు ఉన్నాయి. ఎమ్మెస్సీ నర్సింగ్‌ చేసి, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అందుకే మనుషుల్లో తోకలు మాయం!

అందుకే మనుషుల్లో తోకలు మాయం!

మనిషి.. కోతి నుంచి పరిణామక్రమం చెందాడని చదువుకున్నాం. కోతులకు ఇప్పటికీ తోకలు ఉండి.. మనుషులకు లేకపోవడంపై అమెరికాలోని న్యూయార్క్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మనుషులు, గొరిల్లాలకు 2.5 కోట్ల ఏళ్లక్రితం తోకలు ఉండగా.. తర్వాత మాయమైపోయినట్లు గుర్తించారు. డీఎన్‌ఏలో కొత్తగా చేరిన ఏఎల్‌యూవై(జంపింగ్‌ జీన్స్‌) వల్ల తోకలు పెరగడం నిలిచిపోయిందని, ఆ జీన్స్ లేకపోవడంతో ఇతర జంతువుల్లో తోకలు పెరుగుతున్నట్లు వివరించారు.

ప్రాసెస్డ్‌ ఫుడ్‌తో 30కి పైగా రోగాలు!

ప్రాసెస్డ్‌ ఫుడ్‌తో 30కి పైగా రోగాలు!

తరచూ అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తీసుకొంటే క్యాన్సర్‌, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు 32 వ్యాధుల బారిన పడే ముప్పు ఉన్నదని బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం హెచ్చరించింది. అంతే కాకుండా దీని వల్ల మానసిక అనారోగ్యం, అకాల మరణ ముప్పు కూడా పెరిగే ప్రమాదం ఉన్నదని తెలిపింది.

‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ మూవీ రివ్యూ

‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ మూవీ రివ్యూ

వరుణ్‌‌తేజ్‌ హీరోగా దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ తెరకెక్కించిన ‘ఆపరేషన్ వాలెంటైన్‌’చిత్రం నేడు థియేటర్లలో విడుదలైంది.  2019లో ఉగ్ర‌వాదులు జ‌రిపిన పుల్వామా దాడులు మొద‌లుకొని, దానికి ప్ర‌తిగా భార‌త వైమానిక ద‌ళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్  వ‌ర‌కూ ప‌లు సంఘ‌ట‌న‌లు ఈ చిత్రంలో ప్ర‌తిబింబిస్తాయి. నిజ‌మైన ఫైట‌ర్ పైలెట్‌లా వ‌రుణ్‌తేజ్ పాత్ర‌లో ఒదిగిపోయారు.  ‘ఫైట‌ర్’క‌థ‌కి చాలా ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం ఈ సినిమా‌కు మైనస్.

స్టే ఆర్డర్‌ ఆటోమెటిక్‌గా రద్దు కాదు: సుప్రీంకోర్టు

స్టే ఆర్డర్‌ ఆటోమెటిక్‌గా రద్దు కాదు: సుప్రీంకోర్టు

సివిల్‌ లేదా క్రిమినల్‌ కేసుల్లో కింది కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసే స్టే ఉత్తర్వులు ఆరునెలలు ముగిసిన వెంటనే వాటంతట అవే రద్దు కాబోవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగ న్యాయస్థానాలు (సుప్రీంకోర్టు, హైకోర్టులు) సాధారణంగా కింది కోర్టుల్లో కేసుల విచారణకు సమయాన్ని నిర్ణయించడానికి దూరంగా ఉండాలని తెలిపింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.

మే 1 నుంచి ఉద్యోగుల దేశ వ్యాప్త సమ్మె!

మే 1 నుంచి ఉద్యోగుల దేశ వ్యాప్త సమ్మె!

కేంద్ర ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన కొత్త పెన్షన్‌ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్‌ రైల్వేతోపాటు పోస్టల్‌, టెలికం, ఇన్‌కమ్‌టాక్స్‌, డిఫెన్స్‌, డీఆర్‌డీవో వంటి శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ పాత పెన్షన్‌ విధానం కోరుతూ జాతీయస్థాయిలో సమ్మెకు దిగబోతున్నారు. ఈమేరకు మే 1 నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెలో దాదాపు 24 లక్షలమంది పాల్గొననున్నారు.

ఈ ఎన్నికలు మోదీపై యుద్ధమే! : రేవంత్ రెడ్డి

ఈ ఎన్నికలు మోదీపై యుద్ధమే! : రేవంత్ రెడ్డి

రాబోయే పార్లమెంటు ఎన్నికలను మోదీతో యుద్ధంలా భావించాలని, ఇందులో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉన్న 17సీట్లూ గెలుస్తామని, కేరళలోనూ 20సీట్లు గెలిపించి దేశంలో ఇండియా కూటమికి అధికారం కట్టబెట్టాలని కోరారు. కేరళ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన సమరాగ్ని ప్రజాందోళన యాత్ర సందర్భంగా తిరువనంతపురంలో గురువారం నిర్వహించిన సభలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.

ముందస్తు బెయిల్‌ కోసం క్రిష్‌ పిటిషన్‌

ముందస్తు బెయిల్‌ కోసం క్రిష్‌ పిటిషన్‌

డ్రగ్స్‌ కేసులో అనుమానితుడిగా ఉన్న డైరెక్టర్‌ క్రిష్‌ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న రఘుచరణ్‌ అట్లూరి, సందీప్‌ కూడా బెయిల్‌ పిటిషన్ వేశారు. కొకైన్‌ తీసుకున్నారన్న కేసులో మంజీరా గ్రూపు డైరెక్టర్‌ వివేకానందతోపాటు నిర్భర్, కేదార్, డ్రగ్‌ పెడ్లర్‌ అబ్బాస్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

3 నుంచి లోకేశ్‌ ‘శంఖారావం సభలు’

3 నుంచి లోకేశ్‌ ‘శంఖారావం సభలు’

AP: TDP ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 3నుంచి 11వ తేదీ వరకు వివిధ జిల్లాల్లో నిర్వహించనున్న శంఖారావం సభల్లో పాల్గొననున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 5రోజులపాటు లోకేశ్‌ పర్యటన సాగనుంది. ఈ నెల 3, 4న ఒంగోలు, 5, 6న నెల్లూరు పార్లమెంటు పరిధిల్లోని సభల్లో పాల్గొంటారు. అనంతరం7న తిరుపతి పార్లమెంటు పరిధిలో నిర్వహించే సభలకు లోకేశ్‌ హాజరుకానున్నారు.

నేడు, రేపు BJP ఆందోళనలకు పిలుపు

నేడు, రేపు BJP ఆందోళనలకు పిలుపు

AP: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని BJP రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి… తమ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘సందేశ్‌ఖాలీలో కొన్ని రోజులుగా మహిళలపై వరుస దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాంటి ఘాతుకాలకు గురైన బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేలా ప్రతి జిల్లా కేంద్రంలో ఆందోళనలు చేయాలి’ అని పురందేశ్వరి పేర్కొన్నారు.

శ్రీశైలానికి రాత్రిళ్లూ మార్గం సుగమం

శ్రీశైలానికి రాత్రిళ్లూ మార్గం సుగమం

AP : శ్రీశైలంలో నేటి నుంచి 11వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. వీటిని వీక్షించేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నల్లమలలో రాత్రి వేళ వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నట్లు దోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు. చోదకులు పరిమిత వేగంతో, వన్యప్రాణులకు ఎలాంటి హాని కలగకుండా వాహనాలను నడపాలని ఆయన సూచించారు.

ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం 1 మార్చి 24

ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం 1 మార్చి 24

ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం 1 మార్చి 24

ఐరోపా లగ్జరీ బ్రాండ్లను విక్రయించనున్న ఆల్టెరో

ఐరోపా లగ్జరీ బ్రాండ్లను విక్రయించనున్న ఆల్టెరో

ఐరోపా లగ్జరీ బ్రాండ్ల ఫర్నిచర్‌ విక్రయాలు ప్రారంభించినట్లు ఆల్టెరో అనే సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌లోని కావూరిహిల్స్‌లో 12,000 చదరపు అడుగుల భవనంలో తొలి స్టోర్‌ను ప్రారంభించామని, రూ.5 లక్షల నుంచి రూ.5 కోట్ల విలువైన ఇటలీ, స్పెయిన్‌, పోర్చుగల్‌, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌ వంటి ఐరోపాదేశాల ప్రముఖ బ్రాండ్ల ఫర్నిచర్‌ను ఆర్డరుపై అందిస్తామని ఎండీ వివరించారు. దేశంలోని ప్రధాన నగరాల్లో స్టోర్లు ఏర్పాటు చేస్తామన్నారు.

ఖరీఫ్‌లో రూ.24,420 కోట్ల రాయితీ

ఖరీఫ్‌లో రూ.24,420 కోట్ల రాయితీ

రాబోయే ఖరీఫ్‌ సీజన్‌(ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్ 30)లో ఎరువులపై రూ.24,420 కోట్ల రాయితీని భరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులు ఎప్పటిలాగే రూ.1,350 ధరకే 50 కిలోల DAPని పొందవచ్చని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎరువుల విభాగం చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అలాగే దేశంలో కొత్తగా మూడు సెమీ–కండక్టర్ల తయారీ యూనిట్ల స్థాపనకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

ఉద్యోగుల ప్రశంసా  దినోత్సవం 1 మార్చి 24

ఉద్యోగుల ప్రశంసా దినోత్సవం 1 మార్చి 24

ఉద్యోగుల ప్రశంసా దినోత్సవం 1 మార్చి 24

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి రూ.62,820గా ఉండగా.. అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర సైతం రూ.10 తగ్గి రూ.57,580గా నమోదైంది. ఇక వెండి ధ‌ర‌ మాత్రం రూ.100 పెరిగి కేజీ రూ.75,800గా పలుకుతోంది. ఇవే ధరలు హైదరాబాద్‌, విశాఖ, విజయవాడలోనూ కొనసాగుతున్నాయి.

నేటి నుంచి MSMEల సర్వే

నేటి నుంచి MSMEల సర్వే

AP : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) పనితీరును మెరుగుపరిచేలా ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో కేంద్ర ప్రభుత్వ ర్యాంప్‌ పథకం కింద శుక్రవారం నుంచి సర్వే నిర్వహించనున్నట్లు MSME డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ తెలిపింది. రాష్ట్రంలోని తయారీ, సేవ, వాణిజ్య రంగాల్లోని అన్ని MSMEలను ఈ సర్వే ద్వారా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకువచ్చి AP MSME వన్‌ పోర్టల్‌కు అనుసంధానిస్తామని పేర్కొంది.

APలో పెరిగిన చిరుతల సంఖ్య

APలో పెరిగిన చిరుతల సంఖ్య

దేశవ్యాప్తంగా 13,874 చిరుతలున్నట్లు కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ విడుదల చేసిన నివేదిక వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 569, తెలంగాణలో 297 చొప్పున ఉన్నాయి. 2018 లెక్కలతో పోలిస్తే APలో చిరుతల సంఖ్య 15.65శాతం పెరగ్గా, తెలంగాణలో 11.07శాతం తగ్గింది. APలోని నాగార్జునసాగర్‌- శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ (270), తెలంగాణలోని ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో 121లో చిరుత పులులు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి.

తిరుమలలో భక్తుల రద్దీ ఇలా..

తిరుమలలో భక్తుల రద్దీ ఇలా..

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. గురువారం స్వామి వారిని 57,338 మంది భక్తులు దర్శించుకోగా.. 19,852 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.4.67 కోట్లు ఆదాయం వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది.

వరసిద్ధుడికి విరాళంగా 6 కిలోల బంగారం

వరసిద్ధుడికి విరాళంగా 6 కిలోల బంగారం

AP : చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని అంతరాలయానికి సుమారు రూ.5కోట్ల విరాళంతో బంగారు వాకిలి ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. దానికి అవసరమైన ఆరు కిలోల బంగారాన్ని ఆలయ పునర్నిర్మాణ దాతలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్‌లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. గురువారం ఆ బంగారాన్ని స్వామివారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.

నేడు తిరుపతిలో కాంగ్రెస్ సభ

నేడు తిరుపతిలో కాంగ్రెస్ సభ

AP: నేడు తిరుపతిలోని తారాక రామ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సచిన్ పైలెట్ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ సభకు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో పాటు రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రధాని మోదీ ఇచ్చిన హామీని ఈ సభ నుంచి ప్రశ్నించనున్నారు.

వేదాంతా గ్రూప్‌ పిటిషన్‌ కొట్టివేత

వేదాంతా గ్రూప్‌ పిటిషన్‌ కొట్టివేత

తమిళనాడులోని తూత్తుకుడిలో తమ రాగి స్మెల్టింగ్‌ ప్లాంటును మూసివేయడాన్ని వ్యతిరేకిస్తూ వేదాంతా గ్రూప్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ ప్లాంటు వల్ల కాలుష్యం ఏర్పడిందని ఆరోపిస్తూ చేపట్టిన నిరసనను అణిచివేసేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది మరణించారు. దీంతో 2018 మే నుంచి ప్లాంట్‌ను మూసివేశారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమాన్ని కాపాడటం ముఖ్యమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

IT కారిడార్‌లను కలుపుతూ MMTSలు

IT కారిడార్‌లను కలుపుతూ MMTSలు

HYD : MMTS రెండోదశ పూర్తయ్యింది. నగరానికి తూర్పు, పడమరలో ఉన్న IT కారిడార్‌లను కలుపుతూ లింగంపల్లి-ఘట్‌కేసర్‌ మధ్య MMTS పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్‌ను బైపాస్‌ చేస్తూ లింగంపల్లి-సనత్‌నగర్‌-మౌలాలి-చర్లపల్లి-ఘట్‌కేసర్‌ మార్గంలో ఈ రైళ్లు సాగనున్నాయి. మార్చి నాలుగైదు తేదీల్లో ఏదో ఒకరోజు ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. కాలుష్యం లేని, వేగవంతమైన ప్రజారవాణా నగర ప్రజలకు కేవలం రూ. 5ల టిక్కెట్‌ ధరతో దక్కనుంది.

తెలంగాణకి 2 పర్యాటక ప్రాజెక్టులు!

తెలంగాణకి 2 పర్యాటక ప్రాజెక్టులు!

TG : రాష్ట్రానికి కేంద్రం నుంచి రెండు పర్యాటక ప్రాజెక్టులు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి ఐదింటిని ప్రతిపాదించగా రెండుప్రాజెక్టులు తుది పరిశీలనలో ఉన్నాయి. వీటికి సూత్రప్రాయంగా ఆమోదం లభించిందని త్వరలోనే ప్రకటన వస్తుందని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ వర్గాలు తెలిపాయి. కల్చర్‌-హెరిటేజ్‌ గమ్యస్థానాల్లో నల్గొండజిల్లాలో నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం, ప్రకృతి పర్యాటకం గమ్యస్థానాల్లో కామారెడ్డిజిల్లా బాన్సువాడలోని కల్కి చెరువు షార్ట్‌లిస్టులో ఉన్నాయి.

భారీ అగ్నిప్రమాదం.. 44 మంది మృతి

భారీ అగ్నిప్రమాదం.. 44 మంది మృతి

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏడు అంతస్తుల రెస్టారంట్‌లో మంటలు చెలరేగి 44 మంది మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది 75 మందిని రక్షించారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్లే మంటలు చెలరేగినట్లు గుర్తించారు.

హైదరాబాద్‌లో అత్యధికం.. పెద్దపల్లిలో అతి తక్కువ

హైదరాబాద్‌లో అత్యధికం.. పెద్దపల్లిలో అతి తక్కువ

HYD : జిల్లాలవారీగా చూస్తే హైదరాబాద్‌లో అత్యధికంగా 878 DSC పోస్టులు భర్తీ చేయనున్నారు. అత్యల్పంగా పెద్దపల్లిలో 93 మాత్రమే ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు గరిష్ఠంగా ఖమ్మం జిల్లాలో 176 ఉండగా.. కనిష్ఠంగా మేడ్చల్‌లో 26 పోస్టులు ఉన్నాయి. ఇక SGT పోస్టుల విషయానికి వస్తే అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 537, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 21 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

నేటి నుంచి పెండింగ్‌ దరఖాస్తులపై స్పెషల్‌ డ్రైవ్‌

నేటి నుంచి పెండింగ్‌ దరఖాస్తులపై స్పెషల్‌ డ్రైవ్‌

HYD: ధరణిలోని అపరిష్కృత దరఖాస్తులకు మోక్షం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజనతోపాటు మండలస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం(మార్చి 1)నుంచి తొమ్మిదో తేదీలోపు పెండింగ్‌ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనుంది.అన్ని స్థాయుల్లో విచారణలు, దస్త్రాల పరిశీలన చేపట్టాలని, వాటి వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌(CCLA)నవీన్‌ మిత్తల్‌ ఆదేశించారు.

ట్రాక్టర్‌-కారు ఢీ.. ముగ్గురు మృతి

ట్రాక్టర్‌-కారు ఢీ.. ముగ్గురు మృతి

AP: గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉంది. మృతులంతా మంగళగిరికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ప్రత్తిపాటి శరత్‌కు 14 రోజుల రిమాండ్‌

ప్రత్తిపాటి శరత్‌కు 14 రోజుల రిమాండ్‌

AP: టీడీపీ మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. జీఎస్టీ ఎగవేత, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలపై శరత్‌ను పోలీసులు గురువారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. అనంతరం క్రీస్తు రాజపురంలోని ఒకటో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు జడ్జి ముందు హాజరుపరచగా.. శరత్‌కు 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్ విధించారు.

H1B రిజిస్ట్రేషన్‌కు కొత్త విధానం

H1B రిజిస్ట్రేషన్‌కు కొత్త విధానం

హెచ్‌1బీ రిజిస్ట్రేషన్స్‌, పిటిషన్స్‌కి సంబంధించి అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. మైయూఎస్‌సీఐఎస్‌ పేరిట ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా సంస్థలు, వారి ప్రతినిధులు వీసా దరఖాస్తు ప్రక్రియలో సమర్థంగా భాగస్వామ్యమయ్యేందుకు వీలవుతుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌1బీ పిటిషన్స్‌ దాఖలు చేసే సంస్థలు మైయూఎస్‌సీఐఎస్‌లో ఆర్గనైజేషనల్‌ ఖాతా క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

నేడు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పాలమూరు ప్రాజెక్టు సందర్శన

నేడు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పాలమూరు ప్రాజెక్టు సందర్శన

TG: ఓవైపు బీఆర్‌ఎస్‌ నేతలు మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్న క్రమంలో.. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సందర్శించబోతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చలో పాలమూరు రంగారెడ్డి పర్యటనకు కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు.

మేడారం జాతర.. ఆర్టీసీ బస్సుల్లో 20 లక్షల మంది ప్రయాణం

మేడారం జాతర.. ఆర్టీసీ బస్సుల్లో 20 లక్షల మంది ప్రయాణం

TG: మేడారం జాతర సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ దాదాపు 4 వేల ప్రత్యేక బస్సుల్ని నడిపించింది. సుమారు 20 లక్షల మంది భక్తులు వాటిలో ప్రయాణించారు. ప్రయాణికుల్ని సురక్షితంగా తీసుకెళ్లడంలో సిబ్బంది అందించిన సేవలకు నగదు అవార్డు ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. ఒక్కో డ్రైవర్‌, ఎస్‌డీఐకి రూ.1,000, కండక్టర్లు, మెకానిక్‌లు, శ్రామికులు, ఆర్జిజన్లు, క్లర్కులకు రూ.500 చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వనున్నారు.

నేడు మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ బృందం

నేడు మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ బృందం

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. అందులో భాగంగా బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల బృందం శుక్రవారం మేడిగడ్డను సందర్శించనుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200 మంది ప్రతినిధి బృందంతో బ్యారేజీని సందర్శించనుంది.