ChotaNews Quick Feeds

స్పీకర్ పదవి పోటీకి ఇండియా కూటమి సై

స్పీకర్ పదవి పోటీకి ఇండియా కూటమి సై

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేకు గట్టి పోటీ ఇచ్చిన ఇండియా కూటమి గత ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం ఆ పదవి ఇవ్వకపోతే స్పీకర్ పదవికి పోటీ చేస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 24న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండగా కొత్తగా ఎన్నికైన సభ్యులు లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.

రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వైస్

రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వైస్

నమీబియా క్రికెటర్ డేవిడ్‌వైస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 39 ఏళ్ల డేవిడ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 15 వన్డేలు, 53 టీ20ల్లో 927 పరుగులు, 73 వికెట్లు తీశారు. తన చివరి మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ తీయడమే కాకుండా 12 బంతుల్లో 27 పరుగులు చేశారు.

TCSలో 80 వేల ఖాళీలు!

TCSలో 80 వేల ఖాళీలు!

దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్‌లో 80వేల ఖాళీలు ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. స్కిల్స్ ఉన్న అభ్యర్థుల కొరతతోనే వాటి భర్తీ ప్రక్రియ నిలిచిపోయినట్లు పేర్కొంది. నైపుణ్యాలు లేదా ఉద్యోగి ఆకాంక్షలు ప్రాజెక్టు అవసరాలకు సరిపోవడంలేదని ఆ సంస్థ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. కాగా గత రెండేళ్లుగా TCSలో ఉద్యోగ నియామక జాప్యం వల్ల 10వేల మంది ఫ్రెషర్లు ప్రభావితమైనట్లు NITESపేర్కొంది.