ChotaNews Quick Feeds

రేవ్‌ పార్టీపై మంచు లక్ష్మి ఏమన్నారంటే..

రేవ్‌ పార్టీపై మంచు లక్ష్మి ఏమన్నారంటే..

బెంగళూరు రేవ్ పార్టీపై నటి మంచు లక్ష్మి స్పందించారు. ‘‘రేవ్‌ పార్టీలో ఏం జరిగిందో తెలియదు. ఈ ప్రశ్న అడగడానికి ఇది సందర్భం కాదు. చాలా రోజుల తర్వాత నేను నటించిన వెబ్‌ సిరీస్‌ మీ ముందుకు రానుంది. దాని గురించి మాట్లాడదాం. ఎవరో ఎక్కడికో వెళ్తే నాకేంటి సంబంధం. ఆ వ్యక్తులు.. వాళ్ల ప్రాబ్లమ్‌ అంతే’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అరటిపండుతో అన్నీలాభాలే!

అరటిపండుతో అన్నీలాభాలే!

అన్ని సీజన్‌‌లలో అందుబాటులో ఉండే పండు అరటిపండు. మధుమేహం లేనివాళ్లు ప్రతిరోజు ఒక అరటిపండును తీసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. అరటిపండులో కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్స్‌ ఉండటంతో జీర్ణక్రియ సాఫీగా సాగి అజీర్తిని పోగొడుతుంది. అరటిపండులో ఉండే పోషకాలు ఆస్తమా, అధిక రక్తపోటు, క్యాన్సర్‌ను నివారిస్తాయి. అరటిపండులో ఉండే ట్రిప్టోపాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారుతుంది. తద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది.

ఫ్యాక్టరీలో పేలుడు.. 17 మంది మృతి

ఫ్యాక్టరీలో పేలుడు.. 17 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బెమెతరా జిల్లాలోని గన్‌పౌడర్‌ తయారీ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బిల్డింగ్‌ మొత్తం కుప్పకూలింది. దాంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.