ChotaNews Quick Feeds

కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైద‌రాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షంతో పాటు గంటకు 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది.

ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కురిసిన వ‌ర్షానికి ముంబై సీటి అంతా జలమయమైంది. సిటీలో పలు ప్రాంతాల్లో నీటమునిగాయి. భారీ వర్షాలు కురుస్తుండ‌టంతో అంధేరీ సబ్ వేను అధికారులు మూసేశారు. ఛత్రపతి శివాజి మహారాజ్ విమానాశ్రయంలో భారీగా వర్షపు నీరు చేరింది. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో అధికారులు ఎల్లో అలర్ట్ జారీచేశారు.

6వేల పోస్టులతో త్వరలో మరో డీఎస్సీ: భట్టి

6వేల పోస్టులతో త్వరలో మరో డీఎస్సీ: భట్టి

TG: రాష్ట్రంలోని నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక విజ్ఞప్తి చేశారు. ‘‘రాష్ట్రం తెచ్చుకుంది ఉద్యోగాల కోసం. మా ప్రభుత్వం ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది. పేద విద్యార్థులకు మంచి విద్యానందించాలనే దిశగా డీఎస్సీని ప్రకటించాం. వివిధ శాఖలలో 13,321 పోస్టులను భర్తీ చేస్తున్నాం. 5వేల నుంచి 6వేల పోస్టులతో మరో డీఎస్సీ త్వరలో ఉంటుంది’’ అని పేర్కొన్నారు.