ChotaNews Quick Feeds

సైఫ్, కరీనా పెళ్లిలో పాత్రలు కడిగా: ఆసిఫ్ ఖాన్

సైఫ్, కరీనా పెళ్లిలో పాత్రలు కడిగా: ఆసిఫ్ ఖాన్

‘పంచాయత్’ వెబ్ సిరీస్‌తో పేరు తెచ్చుకున్న నటుడు ఆసిఫ్ ఖాన్ తన జీవితంలో సినిమా కష్టాలు పడినట్లు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ పెళ్లి జరిగిన హోటల్లో పాత్రలు కడిగినట్లు పాడ్ కాస్ట్‌లో చెప్పుకొచ్చారు. కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ ఏజెంట్లు తనను అవమానపరిచారని గుర్తు చేశారు. తొలినాళ్లలో కాస్టింగ్ డైరెక్టర్‌గా, సూపర్ స్టార్ల సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గానూ చేసినట్లు తెలిపారు.

ఇజ్రాయెల్‌ దళాలకు భారీ ఎదురుదెబ్బ

ఇజ్రాయెల్‌ దళాలకు భారీ ఎదురుదెబ్బ

గాజాపై వరుస దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ గాజాలో తమ దళాలపై జరిగిన దాడిలో ఎనిమిది మంది సైనికులు మృతిచెందినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించలేదు. మృతి చెందిన వారిలో కంబాట్‌ ఇంజినీరింగ్‌ కార్ప్‌కు చెందిన డిప్యూటి కంపెనీ కమాండర్‌ వాసీం మహమూద్‌(23) ఉన్నట్లు సమాచారం.

‘పాక్ జట్టులో మూడు గ్రూపులు’

‘పాక్ జట్టులో మూడు గ్రూపులు’

పాకిస్థాన్ పేలవ ప్రదర్శనకు జట్టు మూడు గ్రూప్‌లుగా విడిపోవడమే కారణమని ఆ జట్టుకు సన్నిహితంగా ఉండే ఒకరు తెలిపారు. ‘‘జట్టులో మూడు గ్రూపులు ఉన్నాయి. ఒకటి బాబర్ అజామ్ నేతృత్వంలో, రెండవది షహీన్ అఫ్రిది, మూడవది మహ్మద్ రిజ్వాన్ గ్రూప్‌. దీనికితోడు మహ్మద్‌ అమీర్, ఇమాద్ వసీం వంటి సీనియర్లు పునరాగమనం చేయడం మరింత గందరగోళానికి దారితీసింది’’ అని అతను తెలిపారు.