ChotaNews Quick Feeds

హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రి పొన్నం సమీక్ష

హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రి పొన్నం సమీక్ష

TG: రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పొన్నం మాట్లాడుతూ.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. డ్రగ్స్ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌ను మార్చాలన్నారు. డెంగ్యూ కేసులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆగస్టులో వస్తున్న ‘అహో విక్రమార్క’

ఆగస్టులో వస్తున్న ‘అహో విక్రమార్క’

దేవ్‌గిల్ కథానాయకుడిగా నటిస్తూ తన సొంత బ్యానర్‌లో నిర్మించిన చిత్రం ‘అహో విక్రమార్క’. దీనికి పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 30న మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ నేడు ప్రకటించారు. దీనికి సంబంధించిన రీలీజ్ పోస్టర్ కూడా వదిలారు.

వైసీపీకి అబద్ధాలు.. వెన్నతో పెట్టిన విద్య: మంత్రి

వైసీపీకి అబద్ధాలు.. వెన్నతో పెట్టిన విద్య: మంత్రి

జగన్‌పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయ‌ని విమర్శించారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు వైసీపీ నేతలే ఆద్యులని ఆరోపించారు. దెబ్బలు, కొట్లాటలతో అల్లకల్లోల వాతావరణం సృష్టించారని ఫైర్ అయ్యారు. అలాంటి నేతలు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని, అబద్ధాలు ఆడటం వారికి వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు.