ChotaNews Quick Feeds

పీసీసీ చీఫ్‌గా సీతక్క?

పీసీసీ చీఫ్‌గా సీతక్క?

TG: పీసీసీ చీఫ్ పోస్టు కోసం పలువురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. అయితే పీసీసీ చీఫ్‌గా మంత్రి సీతక్క ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. సీతక్క ఆదివాసీ కావడంతో ఆమెను పీసీసీ చీఫ్‌గా చేస్తే పార్టీ నేతలు వ్యతిరేకించలేరని హైకమాండ్ భావిస్తోందట ఒక వేళ సీతక్కకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే.. మంత్రి పదవి నుంచి ఆమె తప్పుకోవాల్సి ఉంటుందని సమాచారం.

హిట్‌మైర్‌కు జరిమానా

హిట్‌మైర్‌కు జరిమానా

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్ షిమ్ర‌న్ హిట్‌మైర్‌కు జ‌రిమానా పడింది. హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన క్వాలిఫైయ‌ర్ 2 మ్యాచ్‌లో ఆయనకు ఫీజులో 10 శాతం ఫైన్ వేశారు. అయితే ఇన్నింగ్స్ 14వ ఓవ‌ర్‌లో అభిషేక్ వ‌ర్మ వేసిన బౌలింగ్‌లో హిట్‌మైర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ త‌ర్వాత అత‌ను ఆవేశంలో వికెట్ల‌ను త‌న బ్యాట్‌తో కొట్ట‌బోయాడు. దాని వ‌ల్లే హిట్‌మైర్‌కు జ‌రిమానా వేసిన‌ట్లు తెలుస్తోంది.

రేపే IPL ఫైనల్ మ్యాచ్

రేపే IPL ఫైనల్ మ్యాచ్

రేపు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగే IPL-2024 ఫైనల్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. కోల్‌కతా - హైదరాబాద్‌ జట్లకు ఇక్కడి పరిస్థితిపై అవగాహన ఉంది. సన్‌రైజర్స్ బ్యాటర్లు చాలా దూకుడుగా ఆడుతున్నారు. కోల్‌కతా కూడా ఆత్మవిశ్వాసంతో ఉంది. తప్పకుండా ఫైనల్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.