ChotaNews Quick Feeds

శారీలో హోయలు పోతున్న దివి వాద్యా

శారీలో హోయలు పోతున్న దివి వాద్యా

‘బిగ్‌బాస్’ బ్యూటీ దివి వాద్యా సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ భామ తాజాగా శారీ పిక్స్ షేర్ చేయగా వైరలవుతున్నాయి.

ఆంటీ అన్నందుకు చెప్పుతో కొట్టింది!

ఆంటీ అన్నందుకు చెప్పుతో కొట్టింది!

ఆంటీ అని పిలిచినందుకు ATM సెక్యూరిటీ గార్డును ఓ మహిళ కొట్టిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. ఆ మహిళ డబ్బు తీసుకున్న తర్వాత ఇతరులకు దారి ఇచ్చేందుకు ఆమెను పక్కకి వెళ్లమని గార్డు కోరాడు. ఆ తరుణంలోనే ఆ మహిళను గార్డు ‘ఆంటీ’ అని పిలవగా.. కోపగించుకుని అతనిని చెప్పుతో కొట్టింది. దీంతో ఆ గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

యుద్ధం ముగియగానే భారీ పెట్టుబడులు: జెలెన్‌ స్కీ

యుద్ధం ముగియగానే భారీ పెట్టుబడులు: జెలెన్‌ స్కీ

పలువురు అమెరికా బిజినెస్‌మెన్లు ఉక్రెయిన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ పేర్కొన్నారు. యుద్ధం ముగిసిన వెంటనే కార్యాచరణ ప్రారంభిస్తామని అన్నారు. వారం రోజులపాటు జెలెన్ స్కీ అమెరికా, కెనడాలో పర్యటించి.. పలువురు వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. మెకేల్ బ్లూమ్‌బర్గ్, లారీ ఫింక్‌, బిల్‌ అక్మాన్‌ వంటి వ్యాపారవేత్తలు సైతం ఉక్రెయిన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.