ChotaNews Quick Feeds

గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం

గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం

AP: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 12.1 అడుగులకు నీటి మట్టం చేరింది. ధవళేశ్వరం నుంచి 10.28 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. బుధ‌వారం వరద ప్రవాహం మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

భయం లేకుండా కశ్మీర్‌ వెళ్లొచ్చు: అజిత్ పవార్‌

భయం లేకుండా కశ్మీర్‌ వెళ్లొచ్చు: అజిత్ పవార్‌

భారతీయులు ఎవరైనా ఎలాంటి భయం లేకుండా ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ను సందర్శించవచ్చని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్‌ అజిత్‌ పవార్‌ అన్నారు. కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌ను సందర్శించేందుకు తాను భయపడ్డానంటూ కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు.

తెలంగాణ సీఎం సహాయనిధికి మేఘా సంస్థ రూ.5కోట్ల విరాళం

తెలంగాణ సీఎం సహాయనిధికి మేఘా సంస్థ రూ.5కోట్ల విరాళం

తెలంగాణ‌లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. వరద సహాయక చర్యల కోసం మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి సీఎం రేవంత్​రెడ్డికి రూ.5కోట్ల రూపాయల చెక్కు అందజేశారు. హైదరాబాద్‌ రేస్ క్లబ్‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ నివాసంలో రూ.2 కోట్ల రూపాయలు విరాళంగా అందజేసింది. లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్‌ సీఎంఆర్‌ఎఫ్‌కు కోటి రూపాయలు విరాళం అందజేశారు.