తిరుమల కొండపై భారీ వర్షం
AP : అల్పపీడనం ప్రభావం కారణంగా తిరుమలలో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే ఉదయం నుంచి తిరుమల కొండపై ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. దీంతో తిరుమలలోని మాడ వీధులన్నీ జలమయం అయ్యాయి. శ్రీవారి దర్శనం అనంతరం బయటకు వచ్చే భక్తులు పూర్తిగా తడుస్తూ ఆలయం నుంచి బయటకు వెళ్తున్నారు. అక్కడ షెడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.