సినిమా రంగంలో ఎవరితోనూ పోటీ పడను: పవన్
AP: కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన ‘పల్లె పండుగ’కార్యక్రమంలో అభిమానులు ‘ఓజీ’నినాదాలు చేస్తుండంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ‘‘సినిమాల్లో నేను ఎవరితోనూ పోటీ పడను. బాలకృష్ణ, చిరంజీవి, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్, నాని.. ఇలా అందరూ ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు నిష్ణాతులు. యువతకు ఉపాధి కల్పించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాక వినోదాలు, విందులు’’అని పవన్ వ్యాఖ్యానించారు.