భయం లేకుండా కశ్మీర్ వెళ్లొచ్చు: అజిత్ పవార్
భారతీయులు ఎవరైనా ఎలాంటి భయం లేకుండా ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ను సందర్శించవచ్చని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అన్నారు. కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌ను సందర్శించేందుకు తాను భయపడ్డానంటూ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు.