కాకినాడ జిల్లాలోని 4 మండలాల్లో స్కూళ్లకు సెలవు
AP: భారీ వర్షాలు, వరదల వలన జనజీవనం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. వర్షం తగ్గినప్పటికి కొన్ని ప్రాంతాల్లో వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లాలోని నాలుగు మండలాలకు అధికారులు సెలవు ప్రకటిస్తూ తాజాగా ఆదేశిలిచ్చారు. జిల్లాలోని పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, కిర్లంపూడి మండలాల్లో బుధవారం విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.