ఉద్ధవ్ ఠాక్రేకు అస్వస్థత
మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ముంబైలోని రిలయన్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఉద్ధవ్‌కు యాంజియోగ్రామ్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే, గతంలో ఆయన యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు.