ChotaNews Quick Feeds

చర్చలకు పిలిచిన దీదీ..!

చర్చలకు పిలిచిన దీదీ..!

కోల్‌కతా హత్యాచార ఘటనపై బెంగాల్‌ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసన చేస్తున్న వైద్యులు మంగళవారం సాయంత్రంలోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినా.. బాధితురాలికి న్యాయం జరిగే వరకు విధుల్లో చేరే ప్రసక్తే లేదని వైద్యులు తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే నెల రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించేలా చర్చలకు రావాల్సిందిగా బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వైద్యులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ఒడిశాకు మూడు కొత్త వందే భారత్‌ రైళ్లు..!

ఒడిశాకు మూడు కొత్త వందే భారత్‌ రైళ్లు..!

ఒడిశాకు మూడు కొత్త వందే భారత్‌ రైళ్లు మంజూరు అయిన‌ట్లు భార‌తీయ రైల్వే శాఖ తెలిపింది. ఈ నెల 15న ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. టాటా-బెర్హంపుర్‌, రవూర్కెలా-హావ్‌డా, దుర్గ్‌-విశాఖ రూట్‌లలో వందే భార‌త్ సేవలు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో రానున్న‌ట్లు తెలిపారు. ఈనెల 15న మొత్తం 10 వందేభారత్‌ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించ‌నున్నారు.

మహిళపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం

మహిళపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం

గృహిణిపై ఫ్లిప్‌కార్ట్‌ డెలివరీ బాయ్‌ అత్యాచారయత్నం చేశాడు. నిర్మల్ పట్టణంలో ఇది జరిగింది. పార్శిల్‌ను ఇచ్చేందుకు ఓ ఇంటికి వెళ్లిన డెలివరీ బాయ్‌ మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా కేకలు వేసింది. వెంటనే అతడు అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.