హిట్ లిస్ట్‌లో సిద్దిఖీ కుమారుడు..!
NCP కీలక నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీని చంపిన బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తండ్రీ కుమారులను చంపేందుకు కాంట్రాక్టు ఇచ్చినట్లు షూటర్లు విచారణలో పేర్కొన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. హత్య జరిగిన ప్రాంతంలోనే సిద్దిఖీ, ఆయన కుమారుడు ఉంటారని తమకు ఆదేశాలు ఇచ్చిన వ్యక్తులు చెప్పారని షూటర్స్ వెల్లడించారు.