ChotaNews Quick Feeds

పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్

పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపులు.. వ్యక్తి అరెస్ట్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఫోన్ కాల్స్ చేసిన నిందితుడ్ని పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు. నిందితుడిని విజయవాడలోని లబ్బిపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మంచు మనోజ్‌పై 10 మంది దాడి?

మంచు మనోజ్‌పై 10 మంది దాడి?

మంచు మ‌నోజ్‌పై 10మంది దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌నోజ్‌కు సంబంధించిన మెడిక‌ల్ రిపోర్ట్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అందులో డాక్ట‌ర్లు పేర్కొన్న ప్ర‌కారం.. మంచు మ‌నోజ్‌పై జ‌ల్‌ప‌ల్లిలోని ఫామ్ హౌజ్ వ‌ద్ద ఆదివారం ఉద‌యం 9.30 గంట‌ల‌కు 10 మంది గుర్తుతెలియ‌ని దుండ‌గులు దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మ‌నోజ్‌ మెడ‌, కుడి కాలికి గాయాలైన‌ట్లు డాక్ట‌ర్లు పేర్కొన్నారు.

2 రోజుల్లో ఇద్దరు మంత్రులకు బెదిరింపు కాల్స్‌

2 రోజుల్లో ఇద్దరు మంత్రులకు బెదిరింపు కాల్స్‌

AP: డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై హోంమంత్రి అనిత డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. అదే నంబర్‌ నుంచి రెండురోజుల క్రితం హోంమంత్రికి కూడా కాల్ వచ్చినట్లుగా గుర్తించారు. పవన్ కల్యాణ్‌ పేషీకి బెదిరింపు కాల్‌ రావడంతో హోంమంత్రి నంబర్‌ చెక్‌ చేశారు. ఇద్దరు ఏపీ మంత్రులకు బెదిరింపు కాల్స్‌ రావడంతో ఆగంతకుడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు.