ChotaNews Quick Feeds

టీడీపీ ట్వీట్‌పై కాంగ్రెస్ స్పందన ఇదే!

టీడీపీ ట్వీట్‌పై కాంగ్రెస్ స్పందన ఇదే!

AP: అనకాపల్లిలో రూ.1.4లక్షల కోట్ల పెట్టుబడితో మిట్టల్, నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోందని టీడీపీ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ స్పందించింది. ‘‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేస్తామని కేంద్రంతో చెప్పించగలరా? చాప కింద నీరులా ప్రైవేటీకరణ సాగుతోంది. దీన్ని పక్కదారి పట్టించేందుకు జనాలను మభ్యపెట్టే కబుర్లు ఇంకెన్నాళ్లు?2018లో సీఎం చంద్రబాబు పునాది వేసిన కడప ఉక్కు పరిశ్రమ ఎంతవరకు వచ్చింది?’’ అని ప్రశ్నించింది.

ఎస్సీ హోదా కమిషన్‌ గడువు మరో ఏడాది పొడిగింపు

ఎస్సీ హోదా కమిషన్‌ గడువు మరో ఏడాది పొడిగింపు

సిక్కు మతం, బౌద్ధ మతం కాకుండా ఇతర మతాలలోకి మారిన వ్యక్తులకు షెడ్యూల్డ్‌ కులాల హోదా కల్పించవచ్చా లేదా అన్న అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిషన్‌ గడువును మరో ఏడాది పొడిగించారు. వాస్తవానికి కమిషన్‌ గడువు ఈ ఏడాది అక్టోబర్‌ 10తో ముగిసింది. అయితే పరిశీలన ఇంకా పూర్తికాకపోవడంతో తుది నివేదికను అందజేయలేదు. దీంతో గడువును పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది.

గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 23 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 23 మంది మృతి

ఉత్త‌ర గాజా స‌హా ప‌లు ప్రాంతాల‌పై ఇజ్రాయెల్ దళాలు దాడులు జరిపాయి. ఈ దాడుల్లో దాడుల్లో 23 మంది మృతి చెందారు. గత 48 గంటల్లో గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 50 మంది చిన్నారులు మృతి చెందడంపై UNICEF ఖండించింది. మ‌రోవైపు లెబ‌నాన్‌లో హెజ్బొల్లాకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఇజ్రాయెల్ దాడుల్లో టాప్‌ కమాండర్‌ జాఫర్‌ ఖాదర్‌ ఫార్ హ‌త‌మ‌య్యారు.