ChotaNews Quick Feeds

వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ సెటైర్లు

వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ సెటైర్లు

AP: ప్రజాప్రతినిధులుగా ఉన్నంత కాలం పరిపాలన, రాజకీయాలు వేర్వేరుగా చూడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. "వైసీపీ హయాంలో151 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. వారెప్పుడైనా ప్రజల సమస్యలపై ఇలా స్పందించారా?. ఎంతసేపు వారి నోటి వెంట బూతులు తప్ప, ప్రజల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి కానరాలేదు"అని పవన్ విమర్శించారు.

సీసీ కెమెరాలు పెట్టాడు.. భార్య నిర్వాకం చూశాడు!

సీసీ కెమెరాలు పెట్టాడు.. భార్య నిర్వాకం చూశాడు!

భద్రత కోసం ఓ వ్యక్తి తన ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. అయితే చివరకు తన భార్య చేసిన నిర్వాకం తెలుసుకుని షాక్ అయ్యాడు. గుర్తు తెలియని యువకుల్ని తన భార్యే ఇంట్లోకి ఆహ్వానించడం చూసి ఖంగుతిన్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ‘‘భార్య నిర్వాకాన్ని బట్టబయలు చేసిన సీసీ కెమెరాలు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు

గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు

TG: మౌలాలిలోని ప్రొఫెసర్ సాయిబాబా భౌతికకాయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. అయితే అంతకుముందు నివాళులర్పించడానికి వస్తున్న సమయంలో గో బ్యాంక్ కేటీఆర్ అంటూ క్రామేడ్స్ నినాదాలు చేశారు. పదేళ్ల పాటు సాయిబాబా జైల్లో ఉంటే బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. ఈరోజు నివాళులర్పించడానికి ఎలా వస్తారంటూ నిలదీశారు.