shape

Crime ChotaNews

ఆప్‌-బీజేపీ.. ‘పుష్ప’ పోస్టర్‌ వార్‌

ఆప్‌-బీజేపీ.. ‘పుష్ప’ పోస్టర్‌ వార్‌

‘పుష్ప-2’ సినిమా స్టిల్స్‌తో ఢిల్లీలో అధికార పార్టీ ఆప్‌, బీజేపీల మధ్య పోస్టర్‌ వార్‌ నడుస్తోంది. కేజ్రీవాల్‌ ఫేస్‌తో ‘ఝుకేగా నహీ (తలవంచడు)’ అంటూ ఆప్‌ ఓ పోస్టర్‌ విడుదల చేసింది. మరోవైపు ‘అవినీతిపరులను అంతం చేస్తాం.. రప్పా-రప్పా’ అంటూ బీజేపీ సైతం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశవ్యప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

అల్లూరి జిల్లాలో విషాదం

అల్లూరి జిల్లాలో విషాదం

AP: అల్లూరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెదబయలు మండలం గడుగుపల్లిలో విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఇంటిపైన బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్‌ తీగలు తగిలి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తల్లి కుర్రా లక్ష్మి (36), కుమారుడు సంతోష్‌ (13), కుమార్తె అంజలి (10) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సివిల్స్‌- 2024 మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు విడుదల

సివిల్స్‌- 2024 మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు విడుదల

అఖిల భారత సర్వీసుల్లో 1056 నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ - 2024 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్‌ ఇంటర్వ్యూలకు ఎంపికైన వారి జాబితాను UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో చూడొచ్చు. కాగా, మెయిన్స్ పరీక్షలు ఈ ఏడాది సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీలలో జరిగాయి.

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం రేవంత్‌

ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం రేవంత్‌

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజు చరిత్రలో నిలిచిపోతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎం మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఎన్నో ఏళ్లు అవహేళనకు గురైంది. ఉద్యమ రోజుల్లో ఎక్కడ విన్నా.. జయ జయహే తెలంగాణ వినిపించేది. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పాటకు గౌరవం దక్కలేదు. అందుకే మేం ‘జయజయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటించాం’’ అని సీఎం తెలిపారు.

పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన మ‌నోజ్‌

పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన మ‌నోజ్‌

మంచు మోహ‌న్ బాబు కుటుంబ వివాదం పోలీస్ స్టేష‌న్‌కు చేరింది. హీరో మంచు మ‌నోజ్ పహాడిషరీఫ్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై దాడి పట్ల చర్యలు తీసుకోవాలని పోలీసులకు మ‌నోజ్ కంప్లైంట్ ఇచ్చారు. నిన్న బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దెబ్బలతో కుటుంబ సభ్యులతో మనోజ్ వెళ్లిన విష‌యం తెలిసిందే. మెడికల్ రిపోర్టులు ఆధారంగా పోలీసుల‌కు మ‌నోజ్ ఫిర్యాదు చేసిన‌ట్లు తెలుస్తోంది.

యూజర్ మాన్యువల్ ఇవ్వనందుకు రూ. 5వేల జరిమానా

యూజర్ మాన్యువల్ ఇవ్వనందుకు రూ. 5వేల జరిమానా

వన్ ప్లస్ ఫోన్‌తో పాటు యూజర్ మాన్యువల్ ఇవ్వనందుకు బెంగళూరుకు చెందిన రమేష్ అనే వ్యక్తి వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన ఫోరం.. ఆ వ్యక్తికి రూ.5000 జరిమానాతో పాటు కోర్టు ఖర్చుల కింద రూ.1000 ఇవ్వాలని వన్ ప్లస్ ఇండియా కంపెనీని ఆదేశించింది. ఫోన్ కొనుగోలు చేసిన 4నెలల తరువాత మాన్యువల్‌ అందించడం పూర్తి నిర్లక్ష్యంగా ఫోరం పేర్కోంది.

ఈ వృద్ధుడి టాలెంట్ చూస్తే గూస్‌బమ్స్ ఖాయం!

ఈ వృద్ధుడి టాలెంట్ చూస్తే గూస్‌బమ్స్ ఖాయం!

కొందరు చూసేందుకు వృద్ధుల్లా కనిపిస్తున్నా వారు చేసే విన్యాసాలు చూస్తే యువకులు కూడా ఆశ్చర్యపోయేలా ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వృద్ధుడు బైకుపై చేసిన విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు. బైక్ రన్నింగ్‌లో ఉండగా సీటు పైనుంచి లేచి సిలిండర్‌పై కూర్చున్నాడు. సిలిండర్‌పై కూర్చున్న ఆయన.. కాళ్లను బైకు స్టీరింగ్‌పై పెట్టి కంట్రోల్ చేస్తున్నాడు.

డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు ఇష్టమైన రోజు: సీఎం

డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు ఇష్టమైన రోజు: సీఎం

డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు ఇష్టమైన రోజు అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈరోజు తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌టం అదృష్టమ‌ని సీఎం తెలిపారు. గ‌తంలో కేసీఆర్‌, విజ‌యశాంతి, ఆలె న‌రేంద్ర అప్ప‌టికి త‌గిన విధంగా తెలంగాణ త‌ల్లిని రూపొందించార‌ని అన్నారు. ఈరోజు రాజ‌కీయాల‌కు అతీతంగా పండుగ జ‌రుపుకోవాల‌న్నారు. గతంలో వివ‌క్ష‌కు గురైన క‌వులు, ఉద్య‌మ‌కారుల‌ను ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.

మ‌న సంస్కృతికి ప్ర‌తిరూపం తెలంగాణ త‌ల్లి: సీఎం రేవంత్

మ‌న సంస్కృతికి ప్ర‌తిరూపం తెలంగాణ త‌ల్లి: సీఎం రేవంత్

తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయానికి ప్ర‌తిరూపం తెలంగాణ త‌ల్లి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 4కోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేసింద‌ని సీఎం ఆరోపించారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో టీజీ అని యువ‌కులు త‌మ గుండెల‌పై రాసుకుంటే.. బీఆర్ఎస్ మాత్రం టీజీని టీఎస్‌గా మార్చింద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం టీఎస్‌ని టీజీగా మార్చి ఉద్య‌మ‌కారుల ఆకాంక్ష‌ను నేరివేర్చింద‌ని సీఎం తెలిపారు.

‘డిసెంబర్‌ 9వ తేదికి ఎంతో ప్రత్యేకత ఉంది’

‘డిసెంబర్‌ 9వ తేదికి ఎంతో ప్రత్యేకత ఉంది’

TG: నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అనంతరం మాట్లాడుతూ.. ‘ డిసెంబర్‌ 9వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఇస్తున్నట్లు కేంద్రం నుంచి తొలి ప్రకటన డిసెంబర్‌ 9నే వచ్చింది. ప్రతి ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ప్రతిష్ఠ ఉత్సవంగా జరుపుకుంటాము’ అని అన్నారు.

ఏపీలో రేపు పలు జిల్లాల్లో వర్షాలు

ఏపీలో రేపు పలు జిల్లాల్లో వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రేపు ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు,నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం రైతులకు సూచించింది.

అసద్‌ ఎగ్జిట్‌.. భారత్‌కు టెస్టింగ్‌ టైమ్‌

అసద్‌ ఎగ్జిట్‌.. భారత్‌కు టెస్టింగ్‌ టైమ్‌

సిరియా నుంచి అధ్యక్షుడు బషర్ తప్పుకున్నారు. రష్యాలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే భారత్‌కు ఇది ఒక పరీక్షా సమయంగా మారింది. బషర్‌ అల్‌ అసద్‌ భారత్‌కు నమ్మకమైన స్నేహితుడిగా ఉండేవారు. ప్రత్యేకించి భారత్‌తో పలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా ఆ దేశంతో స్నేహబంధం కొనసాగింది. బషర్ లేకపోవడంతో సిరియాతో భారత్ సంబంధాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

’RX100’ బ్యూటీతో లెజెండ్ శరవణన్‌!

’RX100’ బ్యూటీతో లెజెండ్ శరవణన్‌!

శరవణన్‌ ఆరుళ్ హీరోగా దురై సెంథిల్ కుమార్‌‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ అందించారు మేకర్స్‌. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం జార్జియాలో కొనసాగుతోంది. లొకేషన్‌లో శరవణన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, డైరెక్టర్‌ అండ్ టీం దిగిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

విక్రమ్‌ ‘వీర ధీర శూరన్‌’ టీజర్‌ రిలీజ్

విక్రమ్‌ ‘వీర ధీర శూరన్‌’ టీజర్‌ రిలీజ్

విక్రమ్‌ హీరోగా ఎస్‌.యు.అరుణ్‌కుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వీర ధీర శూరన్‌’. ఈ మూవీ టీజర్‌(తమిళ వర్షన్) తాజాగా విడుదలైంది. టీజర్‌లో యాక్షన్‌ సీన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. 2025 జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో దుషారా విజయన్‌, ఎస్‌.జె.సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌ పేషీకి బెదిరింపు కాల్స్‌

పవన్‌ కల్యాణ్‌ పేషీకి బెదిరింపు కాల్స్‌

AP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాన్‌ పేషీకి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడి నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ ఆగంతకుడు సందేశాలు పంపించాడు. పేషీ సిబ్బంది.. బెదిరింపు కాల్స్‌, సందేశాలను పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులకు సైతం సమాచారం అందించారు.

‘బేబీ జాన్‌’ ట్రైలర్‌.. వరుణ్ యాక్షన్ అదుర్స్

‘బేబీ జాన్‌’ ట్రైలర్‌.. వరుణ్ యాక్షన్ అదుర్స్

వరుణ్‌ ధావన్‌-కీర్తి సురేశ్‌ జంటగా నటిస్తోన్న బాలీవుడ్ చిత్రం ‘బేబీ జాన్‌’. వామికా గబ్బీ, జాకీ ష్రాఫ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాలీస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌‌ను తాజాగా విడుదల చేసింది. ఇందులో వరుణ్ యాక్షన్ సీన్స్ అందిరిపోయిందని చెప్పాలి.

తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన సీఎం రేవంత్‌

తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన సీఎం రేవంత్‌

తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. గుండుపూసలు, హారం, ముక్కుపుడక, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో పాటు చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్నలు ఆ తల్లి చేతిలో కనిపించేలా ఏర్పాటు చేశారు.

ముగిసిన బోరుగ‌డ్డ అనిల్ విచార‌ణ‌

ముగిసిన బోరుగ‌డ్డ అనిల్ విచార‌ణ‌

అనంతపురంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ విచారణ ముగిసింది. టీడీపీ అధికార ప్రతినిధి సంగా తేజస్విని ఇచ్చిన ఫిర్యాదుతో బోరుగడ్డపై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు అనిల్‌ను కోర్టు అనుమతితో రెండు రోజుల క్రితం రాజమండ్రి నుంచి అనంతపురానికి తీసుకువచ్చారు. నేటితో విచారణ ముగిసింది. అనిల్‌ను జిల్లా న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరచనున్నారు.

‘యానిమల్-3’.. రణ్‌బీర్ ఏమన్నారంటే?

‘యానిమల్-3’.. రణ్‌బీర్ ఏమన్నారంటే?

రణ్‌బీర్‌ కపూర్-రష్మిక జంటగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ సీక్వెల్‌పై తాజాగా రణ్‌బీర్‌ క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు. ‘యానిమల్-2’నే కాదు.. ‘యానిమల్-3’ కూడా వస్తుందని చెప్పాడు. అంతేకాకుండా రణ్‌బీర్‌ మరో గుడ్‌న్యూస్ చెప్పారు. పార్ట్-3 ‘యానిమల్ పార్క్’ అనే టైటిల్‌తో రానుందని ప్రకటించారు. ప్రస్తుతం ఈవ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆర్బీఐ నూతన గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా

ఆర్బీఐ నూతన గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా

ఆర్బీఐ నూతన గవర్నర్‌గా రెవెన్యూశాఖ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా నియమితులయ్యారు. మల్హోత్రా నియామకాన్ని నియామకాల క్యాబినెట్ కమిటీ ఖరారు చేసింది. డిసెంబరు 10తో ప్రస్తుత గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పదవీ కాలం ముగియనుంది. మల్హోత్రా 1990 బ్యాచ్‌ రాజస్థాన్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి కాగా, ఈనెల 11 నుంచి మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.

క్రిస్మస్ సందర్భంగా స్కూళ్లకు వరుస సెలవులు

క్రిస్మస్ సందర్భంగా స్కూళ్లకు వరుస సెలవులు

TG: క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు వరుస సెలవులు ప్రకటించింది. డిసెంబర్ 24 నుంచి 26 వరకు తెలంగాణలోని స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే నేపథ్యంలో ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

మాదాపూర్‌కు మంచు వివాదం

మాదాపూర్‌కు మంచు వివాదం

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన మంచు ఫ్యామిలీ వివాదం ముగింపు ద‌శ‌కు చేరుకుంది. మంచు మోహ‌న్ బాబు- మ‌నోజ్‌ల మ‌ధ్య మాదాపూర్‌లో స‌మావేశం ప్రారంభం కానుంది. ఈ స‌మావేశంలో మోహ‌న్ బాబు, మ‌నోజ్‌, చిన్న శ్రీశైలం యాద‌వ్ పాల్గొన‌నున్న‌ట్లు స‌మాచారం. అస‌లు వివాదం ఏంటి? ఆస్తుల పంప‌కాలు జ‌ర‌గ‌నున్నాయా? అనే అంశాలు ఈ మీటింగ్ త‌ర్వాత తెలియ‌నున్న‌ట్లు స‌మాచారం.