shape

Education ChotaNews

మేడారం జాతర.. ఆర్టీసీ బస్సుల్లో 20 లక్షల మంది ప్రయాణం

మేడారం జాతర.. ఆర్టీసీ బస్సుల్లో 20 లక్షల మంది ప్రయాణం

TG: మేడారం జాతర సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ దాదాపు 4 వేల ప్రత్యేక బస్సుల్ని నడిపించింది. సుమారు 20 లక్షల మంది భక్తులు వాటిలో ప్రయాణించారు. ప్రయాణికుల్ని సురక్షితంగా తీసుకెళ్లడంలో సిబ్బంది అందించిన సేవలకు నగదు అవార్డు ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. ఒక్కో డ్రైవర్‌, ఎస్‌డీఐకి రూ.1,000, కండక్టర్లు, మెకానిక్‌లు, శ్రామికులు, ఆర్జిజన్లు, క్లర్కులకు రూ.500 చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వనున్నారు.

నేడు మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ బృందం

నేడు మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ బృందం

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. అందులో భాగంగా బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల బృందం శుక్రవారం మేడిగడ్డను సందర్శించనుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200 మంది ప్రతినిధి బృందంతో బ్యారేజీని సందర్శించనుంది.

నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

AP: శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈనెల 11 వరకు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 8.10 గంటలకు ఆలయ ఛైర్మన్‌ చక్రపాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. శివదీక్షధారులకు ఈనెల 5 వరకు విడతల వారిగా స్వామి స్పర్శ దర్శనం కల్పించనున్నారు.

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

MYSTERY: నిర్మానుష్యంగా మారిన ఐలాండ్

MYSTERY: నిర్మానుష్యంగా మారిన ఐలాండ్

ఒకప్పుడు జపాన్‌లోని ఐలాండ్ ప్రాంతంలో అత్యధిక జనాభా ఉండేది. ఇప్పుడు ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. అందుకు గల కారణాలు పై వీడియో చూసి తెలుసుకోండి.

స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఉంటే.. ఇది మీ కోసమే!

స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఉంటే.. ఇది మీ కోసమే!

స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఉంటే.. ఇది మీ కోసమే!

చిన్నారులను ఎండ నుంచి కాపాడడం ఎలా..

చిన్నారులను ఎండ నుంచి కాపాడడం ఎలా..

చిన్నారులను ఎండ నుంచి కాపాడడం ఎలా..

నేటి నుంచి ఏపీలో ఇంటర్‌ పరీక్షలు

నేటి నుంచి ఏపీలో ఇంటర్‌ పరీక్షలు

ఏపీలో శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 4,73,058 మంది పరీక్షకు హాజరుకానున్నారు. ద్వితీయ సంవత్సరానికి చెందిన 4,88,881 మంది పరీక్ష రాయనున్నారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి రెండేళ్లకు కలిపి 90,282 మంది పరీక్షలకు హాజరుకానున్నారు.

నేడు విద్యాదీవెన నిధుల విడుదల

నేడు విద్యాదీవెన నిధుల విడుదల

AP: సీఎం జగన్ శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన కింద అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 9.44 లక్షల మంది విద్యార్థులకు రూ.708.68కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌ నిధులను సీఎం జగన్‌ బటన్‌ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15,000, డిగ్రీ, మెడిసిన్ సహా ఇతర ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు రూ.20,000 సాయం అందిస్తోంది.

6న ఏపీ కేబినెట్ సమావేశం

6న ఏపీ కేబినెట్ సమావేశం

ఈనెల 6న ఏపీ కేబినెట్ భేటీ జరుగనుంది. సాధారణ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఇది కేబినెట్ చివరి భేటీగా భావిస్తున్నారు. అలాగే ఎన్నికల షెడ్యూలు వచ్చేలోగా మార్చి నెలకు సంబంధించిన వివిధ పథకాలకు కేబినెట్ ఆమోదం లభిస్తే వాటిని కొనసాగించేందుకు వీలు ఉంటుందనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

సాగర్‌ నుంచి ఏపీకి 3 టీఎంసీలు

సాగర్‌ నుంచి ఏపీకి 3 టీఎంసీలు

TG: నాగార్జునసాగర్‌ నుంచి ఏపీకి 3 TMCల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఉత్తర్వులు జారీచేసింది. శుక్రవారం ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో సాగర్ కుడికాలువ హెడ్‌రెగ్యులేటరీ ద్వారా ఏపీకి 3 TMCల నీటిని విడుదల చేయనున్నారు. మార్చి నెలకు సంబంధించి సాగర్‌ కుడికాలువ ద్వారా 3 TMCలు, ఏప్రిల్‌కు సంబంధించి 5 TMCలను విడుదల చేయాలని ఏపీ ఇప్పటికే బోర్డుకు లేఖ రాసింది.

నిజం తెలియాలనే అలా చేశా: హనుమ విహారి

నిజం తెలియాలనే అలా చేశా: హనుమ విహారి

ఏ తప్పు చేయకపోయినా తనను ఆంధ్రా జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించారని సీనియర్ క్రికెటర్ హనుమ విహారి ఆరోపించారు.‘‘టీమ్‌లో 17వ ప్లేయర్‌గా ఉన్న వ్యక్తి..రూల్స్ ప్రకారం డ్రెస్సింగ్ రూమ్‌కి రాకూడదు. కానీ అతడు వచ్చాడు. దీని గురించి వారించినందుకు అతడు, అతడి తండ్రి.. నేనే తప్పు చేసినట్లుగా చిత్రీకరించారు. ప్రజలకు నిజం తెలియాలనే దీనిపై పోస్ట్ పెట్టాను’’అని ఓ ఇంటర్వ్యూలో హనుమ చెప్పారు.

చేప కొంచెం.. కూత ఘనం

చేప కొంచెం.. కూత ఘనం

ప్రపంచంలోనే అత్యంత చిన్న చేప అయిన డానియనెల్లా సెరెబ్రం.. మయన్మార్‌ నీళ్లలో కనిపించే ఈ చేప కూత పెడితే చెవులు చిల్లులు పడాల్సిందే. శబ్దాల్ని చేయటంలో ఇది ప్రత్యేకతను కలిగి ఉందని బెర్లిన్‌కు చెందిన చారైట్‌ యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. ఈ చేపలు 140 డెసిబుల్స్‌ వరకు శబ్దం చేయగలవని, అంబులెన్స్‌ సైరన్‌, డ్రిల్లింగ్‌ మిషన్‌ శబ్దానికి ఇది సమానంగా ఉంటుందని చెప్పారు.

ఆయన యాక్టింగ్‌ చేయకుండానే హీరో అయ్యాడు: విశ్వక్‌ సేన్‌

ఆయన యాక్టింగ్‌ చేయకుండానే హీరో అయ్యాడు: విశ్వక్‌ సేన్‌

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ నటించిన లేటెస్ట్ మూవీ ‘గామి’. ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా మాట్లాడారు. ‘‘విభిన్న చిత్రాల్లో ‘గామి’ ఒకటి. ట్రైలర్‌ బాగుంది. సినిమా మంచి విజయం అందుకోవాలని ఆశిస్తున్నా’’ అని అన్నారు. యాక్టింగ్‌ చేయకుండానే హీరో అయిన వ్యక్తి సందీప్ వంగా అని విశ్వక్ సేన్ పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ సైనికుల అరాచకం

ఇజ్రాయెల్ సైనికుల అరాచకం

పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ ఆర్మీ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రపంచ దేశాల నుంచి పెద్దఎత్తున వచ్చిన నిత్యావసరాల పంపిణీ కోసం గాజాలో ఓ చోట ఏర్పాటుచేసిన సహాయక కేంద్రం వద్ద క్యూ కట్టిన ప్రజలపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 104 మంది సామాన్య పౌరులు చనిపోగా, 700 మందికిపైగా గాయపడ్డారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర గాజా ప్రాంతంలో చోటుచేసుకుంది.

మే 1 నుంచి రైళ్ల సర్వీసులను నిలిపివేస్తాం: రైల్వే సంఘాలు

మే 1 నుంచి రైళ్ల సర్వీసులను నిలిపివేస్తాం: రైల్వే సంఘాలు

అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మే 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తామని పలు రైల్వే సంఘాలు హెచ్చరించాయి. నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈనెల 19న కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖను కలిసి సమ్మె అంశంపై అధికారికంగా నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు.

ఉత్కంఠగా ‘వళరి’ ట్రైలర్‌..

ఉత్కంఠగా ‘వళరి’ ట్రైలర్‌..

‘గురు’ ఫేమ్ రితికా సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన హారర్‌ మూవీ ‘వ‌ళ‌రి’. అయితే, ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈనెల 6 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం ఉత్కంఠతో సాగిన ఆ ట్రైలర్‌ మీరూ చూసేయండి.

ఈసారి బీజేపీ గెలిస్తే సిలిండర్ ధర రూ.2 వేలు కావొచ్చు: మమత

ఈసారి బీజేపీ గెలిస్తే సిలిండర్ ధర రూ.2 వేలు కావొచ్చు: మమత

బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. వాళ్లు వంట గ్యాస్ సిలిండర్ ధరలను రూ.1,500 లేదా రూ.2,000కి పెంచవచ్చని వ్యాఖ్యానించారు. అప్పుడు మంటలు చేసుకునేందుకు కలపను సేకరించే పాత పద్ధతికే తిరిగి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. జర్‌గ్రామ్ జిల్లాలో నిర్వహించిన ఒక పబ్లిక్ ఈవెంట్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యర్థి నేతలకు శరద్‌ పవార్‌ ‘విందు’ ఆహ్వానం

ప్రత్యర్థి నేతలకు శరద్‌ పవార్‌ ‘విందు’ ఆహ్వానం

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శనివారం పుణె జిల్లాలోని బారామతిలో ఉద్యోగమేళా ప్రారంభోత్సవానికి సీఎం శిండే, డిప్యూటీ సీఎంలు ఫడ్నవీస్‌, అజిత్‌‌లు హాజరుకానున్నారు. శరద్‌‌పవార్‌ రాజ్యసభ ఎంపీ కాగా..బారామతి పార్లమెంటు స్థానం నుంచి ఆయన కుమార్తె సుప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమంలో తామిద్దరం భాగమవుతామని పవార్‌ తెలిపారు.ఈ క్రమంలో తన ఇంటికి విందుకు రావాల్సిందిగా ముగ్గురు నేతలను ఆహ్వానించారు.

ప్రధాని మోదీ పర్యటనకు బందోబస్తు: సీఎస్‌

ప్రధాని మోదీ పర్యటనకు బందోబస్తు: సీఎస్‌

తెలంగాణలో మార్చి 4, 5 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు. బ్లూ బుక్‌ ప్రకారం ప్రధాని పర్యటనకు భద్రత, ట్రాఫిక్‌, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసుశాఖకు సూచించారు. విమానాశ్రయం, హెలిప్యాడ్‌లతో పాటు అన్ని వేదికల వద్ద అగ్నిమాపక వాహనాలు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

చైనా స్మార్ట్‌ కార్లతో జాగ్రత్త: బైడెన్‌

చైనా స్మార్ట్‌ కార్లతో జాగ్రత్త: బైడెన్‌

చైనా తయారుచేసిన కార్లపై దర్యాప్తు చేపట్టాలని బైడెన్‌ ప్రభుత్వం ఆదేశించింది. కార్ల సాయంతో అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని డ్రాగన్‌ సేకరించే ప్రమాదముందని బైడెన్‌ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఎలక్ట్రిక్‌ సహా ఇతర కార్లలోని డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీ వంటి ఫీచర్లను ఉపయోగించి అమెరికన్లపై గూఢచర్యం చేసేందుకు అవకాశముందని భావిస్తోంది. ఈ క్రమంలో అమెరికన్ల డేటాను రక్షించడానికి ఈ చర్యలు చేపట్టినట్లు బైడెన్‌ ప్రకటించారు.

మార్చి నెల సంక్షేమ పథకాల షెడ్యూల్ ఇదే

మార్చి నెల సంక్షేమ పథకాల షెడ్యూల్ ఇదే

AP: మార్చి నెలలో ప్రజలకు అందించే సంక్షేమ పథకాల అమలు షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.

బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ప్రారంభం

బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ప్రారంభం

ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. అర్థరాత్రి దాటే వరకు ఈ భేటీ కొనసాగనుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. తెలంగాణ సహా మొత్తం 9 రాష్ట్రాల్లో లోక్‌సభ అభ్యర్థులపై కమిటీ కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా 125కు పైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. రేపు ఉదయం తొలి జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

WPL: ఆర్సీబీ దూకుడుకు ఢిల్లీ బ్రేక్‌

WPL: ఆర్సీబీ దూకుడుకు ఢిల్లీ బ్రేక్‌

డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు దూకుడుకు బ్రేక్‌ పడింది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆర్సీబీ.. మూడో మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యచేధనలో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులే చేసింది. స్మృతి మంధాన (74), సోఫీ డివైన్‌ (23), సబ్బినేని మేఘన (36) దూకుడుగా ఆడినా మిగిలిన బ్యాటర్లు రాణించకపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.

ధనుశ్ సినిమా షూటింగ్‌కు రష్మిక బ్రేక్‌

ధనుశ్ సినిమా షూటింగ్‌కు రష్మిక బ్రేక్‌

శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో కన్నడ భామ రష్మిక ప్రస్తుతం హీరో ధనుశ్‌తో ఓ చిత్రం చేస్తుంది. కాగా హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో ధనుశ్‌తో కలిసి పాల్గొన్న రష్మిక మందన్నా ఆ తర్వాత ముంబై నుంచి టోక్యోకు పయనమైంది. టోక్యోలో జరుగనున్న Crunchyroll Anime Awards కార్యక్రమానికి హాజరుకానుంది. అయితే రష్మిక తిరిగి ఎప్పుడు షూట్‌లో జాయిన్ అవుతుందనేది తెలియాల్సి ఉంది.

ఏపీలో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ!

ఏపీలో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ!

ఏపీలో 2023-2024 వరకు ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీని మాఫీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఒకే విడత కింద వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. 2024 మార్చి 31 లోపు పన్ను ఒకేసారి లేదా వాయిదాల్లో చెల్లిస్తేనే వడ్డీ మాఫీ వర్తిస్తుందని పేర్కొంది. గతంలో వడ్డీ చెల్లించి ఉంటే పన్నులో సర్దుబాటు చేస్తామని స్పష్టం చేసింది.

మేడారానికి తొలిరోజు రూ.3 కోట్ల ఆదాయం

మేడారానికి తొలిరోజు రూ.3 కోట్ల ఆదాయం

TG: మేడారం సమ్మక్క-సారలమ్మ హుండీ ఆదాయం తొలిరోజు రూ.3.15 కోట్లు వచ్చింది. మేడారం మహాజాతర హుండీ లెక్కింపు గురువారం నాడు ప్రారంభమైంది. మొత్తం 518 హుండీలను లెక్కించనున్నారు. ఇందులో భాగంగా నేడు మొదటి రోజు 134 హుండీలను దేవాదాయ శాఖ అధికారులు లెక్కించగా రూ.3 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈ మొత్తాన్ని అధికారులు బ్యాంకులో జమ చేస్తారు.

బీఆర్ఎస్ నేతలవి పనికిరాని సవాళ్లు: మంత్రి తుమ్మల

బీఆర్ఎస్ నేతలవి పనికిరాని సవాళ్లు: మంత్రి తుమ్మల

TG: సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ విరిసిన సవాళ్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు అయినా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారని..దానికి సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ నేతలు పనికిరాని చాలెంజ్‌లు విసురుతున్నారని మండిపడ్డారు. కేటీఆరే కాదు.. కేసీఆర్‌ పోటీ చేసినా మల్కాజ్‌గిరిలో ఈసారి ఎగిరేది కాంగ్రెస్ జెండానే తెలిపారు. దమ్ముంటే మా చాలెంజ్‌ను స్వీకరించాలన్నారు.

‘పుల్లారావు కుమారుడి అరెస్ట్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యే’

‘పుల్లారావు కుమారుడి అరెస్ట్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యే’

AP: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ అక్రమ అరెస్టు ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యేనని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ జగన్ కక్ష సాధింపు రాజకీయాలు తీవ్రమయ్యాయన్నారు. శరత్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ స్టేట్ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ ద్వారా అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారన్నారు.

ప్రభాస్‌- హను రాఘవపూడి మూవీ స్టోరీ లైన్‌ ఇదేనా..?

ప్రభాస్‌- హను రాఘవపూడి మూవీ స్టోరీ లైన్‌ ఇదేనా..?

ప్రభాస్‌తో హను రాఘవపూడి ఓ వార్‌ బేస్డ్ మూవీ చేయబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ దానికి కొనసాగింపుగా మరో క్రేజీ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇది వార్‌ ప్రధానంగా సాగే లవ్‌ స్టోరీ అట. ఇందులో ప్రభాస్‌ సైనికుడిగా కనిపించే అవకాశం ఉందట. ఓ వైపు యుద్ధం, మరోవైపు లవ్‌ స్టోరీ.. ఇదే ఈ సినిమా మెయిన్‌ లైన్‌ అని టాక్.

రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు

రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు

ఏపీలో రేపటి (శుక్రవారం) నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 4,73,058 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 2 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి.

బుక్కైన బీజేపీ లీడర్.. తనపై తానే హత్యాయత్నం!

బుక్కైన బీజేపీ లీడర్.. తనపై తానే హత్యాయత్నం!

హైదరాబాద్‌లో బీజేపీ నేత భాస్కర్‌గౌడ్ తన మీద తానే హత్యా ప్రయత్నం చేసుకుని పోలీసులకు దొరికిపోయారు. తనపై హత్యాయత్నం జరిగిందని ఉప్పల్ పోలీసులను ఆయన ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు.. ఇదంతా భాస్కర్ పనేనని తేల్చారు. అంతేకాదు దీనికోసం రూ.2.50లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో భాస్కర్‌గౌడ్‌తో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ పద్మజ తెలిపారు.

దంచికొట్టిన ఢిల్లీ.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే..?

దంచికొట్టిన ఢిల్లీ.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే..?

డబ్ల్యూపీఎల్‌ 2024లో హ్యాట్రిక్‌పై కన్నేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 5వికెట్ల నష్టానికి 194పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (50) అర్ధశతకంతో అదరగొట్టింది. ఓపెనర్‌ లానింగ్ (11) విఫలమైనా అలిస్ కాప్సే (46)తో కలిసి దూకుడుగా ఆడింది. మారిజానే కాప్ (32), జెస్ జోనాస్సెన్ (36*) రాణించారు.

ప్రత్తిపాటి శరత్‌పై కేసు రాజకీయ కక్షే: పట్టాభి

ప్రత్తిపాటి శరత్‌పై కేసు రాజకీయ కక్షే: పట్టాభి

AP: ప్రత్తిపాటి శరత్‌‌పై కేసు రాజకీయ కక్షలో భాగమేనని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి మండిపడ్డారు. శరత్ ఆచూకీ చెప్పాలని టీడీపీ నాయకులు డీసీపీ శ్రీనివాసరావును కోరారని తెలిపారు. పన్నుఎగవేత కేసులో అరెస్ట్ చేసినట్లు అధికారులు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. ఇది ముమ్మటికీ రాజకీయ కక్షతో జగన్ పెట్టిన కేసే అని ఆయన ఆరోపించారు.

జగన్ నెక్స్ట్ షాక్.. అంబటికేనా…?

జగన్ నెక్స్ట్ షాక్.. అంబటికేనా…?

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ల‌క్ష్యంగా సీఎం జ‌గ‌న్ పావులు క‌దుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్పటికే గుడివాడ అమర్నాథ్, జయరాం వంటి మంత్రులకు షాక్ ఇచ్చిన జగన్.. నెక్స్ట్ అంబటి రాంబాబుకు షాక్ ఇవ్వబోతున్నట్లు స‌మాచారం. ఈసారి ఆయనకు సత్తెనపల్లి టిక్కెట్ ఇచ్చేది లేదని జగన్ ఫిక్స్ అయ్యాడట. ఈసారి రాంబాబుకు కాకుండా ఆయన సోదరుడు మురళికి టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

పొత్తులో బీజేపీకి 9 అసెంబ్లీ, 5 ఎంపీ టికెట్లు!

పొత్తులో బీజేపీకి 9 అసెంబ్లీ, 5 ఎంపీ టికెట్లు!

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా కమలం పార్టీకి 9 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాలు కేటాయించే అవకాశముందని చెబుతున్నారు. జనసేన, బీజేపీకి కలిసి మొత్తంగా 33 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించేలా ఒప్పందం కుదిరినట్లు వార్తలొస్తున్నాయి. పొత్తులపై అధికారిక ప్రకటన తర్వాత రెండు, మూడు రోజుల్లో రెండో జాబితా విడుదలయ్యే అవకాశముంది.

అంగ వైకల్యం అడ్డు కాలేదు

అంగ వైకల్యం అడ్డు కాలేదు

ఆమె దృఢ సంకల్పానికి అంగ వైకల్యం అడ్డు కాలేదు. మొండి పట్టుదలతో అనుకున్నది సాధించింది. ఈ నిజమైన విజేత పేరే మానసి జోషి 22 ఏళ్లకే రోడ్డు ప్రమాదంలో కాలు పోయినా.. కృత్రిమ కాలితో తనకెంతో ఇష్టమైన బ్యాడ్మింటన్‌ క్రీడలో సక్సెస్‌ సాధించింది. విధి వెక్కిరించినా సంచలనాలు సృష్టించింది. ఆమె ఆత్మ విశ్వాసం ముందు అంగ వైకల్యం ఓడిపోయింది.

సాగర్‌ నుంచి ఏపీకి 3 టీఎంసీల నీరు

సాగర్‌ నుంచి ఏపీకి 3 టీఎంసీల నీరు

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మూడు టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అనుమతినిచ్చింది. సాగర్‌ కుడి కాల్వ హెడ్‌ రెగ్యులేటర్ ద్వారా శుక్రవారం ఉదయం 11 గంటలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించింది. కేఆర్‌ఎంబీ అధికారుల సమక్షంలో నీటి విడుదల జరుగుతుందని ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల్లో బోర్డు పేర్కొంది.

ప్రత్తిపాటి శరత్‍ను తీసుకెళ్లింది పోలీసులేనా?: లోకేశ్

ప్రత్తిపాటి శరత్‍ను తీసుకెళ్లింది పోలీసులేనా?: లోకేశ్

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు త‌న‌యుడు శరత్‍ను తీసుకెళ్లింది పోలీసులా? సైకో జ‌గ‌న్ తాడేప‌ల్లి ముఠానా? అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఈ అక్ర‌మ అరెస్టుని ఖండిస్తున్నానని.. ప్ర‌త్తిపాటి పుల్లారావు కుటుంబానికి టీడీపీ అండ‌గా ఉంటుందని పేర్కొన్నారు. తప్పుడు కేసులపై న్యాయ‌పోరాటం చేస్తామన్నారు. జ‌గ‌న్ దిగిపోయే ముందైనా సైకో చేష్ట‌లు ఆప‌క‌పోతే, భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుందని హెచ్చరించారు.

మల్కాజిగిరిలో నాపై గెలిచి చూపించు!:ఎమ్మెల్సీ

మల్కాజిగిరిలో నాపై గెలిచి చూపించు!:ఎమ్మెల్సీ

TG: సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విసిరిన సవాల్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ స్పందించారు. రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరే స్థాయి కేటీఆర్‌కు లేదని అన్నారు. మల్కాజిగిరిలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బరిలో దిగుతానని, మల్కాజిగిరిలోనే కాదు..ఎక్కడ నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

రేపు ఢిల్లీకి చంద్రబాబు, పవన్?

రేపు ఢిల్లీకి చంద్రబాబు, పవన్?

AP: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌లు రేపు(శుక్రవారం) ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్‌లు భేటీ కానున్నారని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. సీట్ల సర్దుబాటుపై చర్చించిన అనంతరం జేపీ నడ్డాతో కలిసి మార్చి 2న పొత్తులపై చంద్రబాబు, పవన్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

పీఎం కిసాన్‌లోకి 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు

పీఎం కిసాన్‌లోకి 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలోకి 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్రలో భాగంగా గత మూడున్నర నెలల్లో ఈ లబ్ధిదారులు కొత్తగా పథకంలో భాగమైనట్లు తెలిపింది. ఇందులోభాగంగా 2.60 లక్షల గ్రామ పంచాయతీల పరిధిలో 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరినట్లు కేంద్రం తెలిపింది.