15వ అంతస్తు నుంచి పడి విద్యార్థి మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని ఓ హౌసింగ్ సొసైటీలోని 15వ అంతస్తులోని అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి పడి 15 ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 10వ తరగతి చదువుతున్న బాలుడి కుటుంబం ఇంట్లో ఉన్న సమయంలో తెల్లవారుజామున 1 గంటలకు ఈ ఘటన జరిగిందని వారు తెలిపారు. ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.