shape

Lifestyle ChotaNews

కాంగ్రెస్ గెలిచాకే రాష్ట్రంలో ప్రజాపాలన: ప్రొ.కోదండరాం

కాంగ్రెస్ గెలిచాకే రాష్ట్రంలో ప్రజాపాలన: ప్రొ.కోదండరాం

కాంగ్రెస్‌ గెలిచాక తెలంగాణలో ప్రజాపాలన వచ్చిందని ప్రొ. కోదండరాం అన్నారు. నాగర్‌కర్నూల్‌‌లోని బిజినేపల్లి జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే. మోదీ హయాంలో అదానీ, అంబానీ సంపద పెరిగింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులు వంచనకు గురయ్యారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో కొన్నింటిని అమలు చేశారని, మిగతావాటిని కూడా భవిష్యత్‌లో సమర్థవంతంగా అమలు చేస్తారు’’ అని తెలిపారు.

తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.155 కోట్లు స్వాధీనం

తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.155 కోట్లు స్వాధీనం

తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.155 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రూ.61.11 కోట్ల నగదు, రూ.19.16 కోట్ల నగలు పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రూ. 28.92 కోట్ల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్న వెల్లడించారు. అంతేకాకుండా రూ.23.87 కోట్ల డ్రగ్స్‌, రూ.22.77 కోట్ల విలువైన వస్తువులు సీజ్ చేసినట్లు ప్రకటించారు.

వైసీపీ ఎమ్మెల్యే భార్యకు చేదు అనుభవం

వైసీపీ ఎమ్మెల్యే భార్యకు చేదు అనుభవం

నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి భార్యకు చేదు అనుభవం ఎదురైంది. నూనెపల్లెలో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లగా నాగిని రెడ్డిని ఓ మహిళ ఆమెను అడ్డుకుంది. శిల్పా కుటుంబం తనకు అన్యాయం చేసిందని ఆరోపించింది. తన జీవితం నాశనం కావడానికి నాగిని రెడ్డి కారణమని వాదనకు దిగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివబాలకృష్ణ బినామీల అరెస్ట్

శివబాలకృష్ణ బినామీల అరెస్ట్

HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గొడవర్తి సత్యనారాయణమూర్తి, పెంట భరత్ కుమార్, పెంట భరణి కుమార్ అనే ముగ్గురు శివబాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించారని.. వీరి పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. వీరిని ఏసీబీ స్పెషల్ కోర్టు ఎదుట హాజరుపరిచామని.. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించినట్లు తెలిపారు.

'ఫామిలీ స్టార్' నుంచి మెలోడీ సాంగ్..

'ఫామిలీ స్టార్' నుంచి మెలోడీ సాంగ్..

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన 'ఫ్యామిలీ స్టార్'. తాజాగా ఈ సినిమా నుంచి 'నందనందనా' అనే పాటను పూర్తిస్థాయిలో రిలీజ్ చేశారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాట .. సిద్ శ్రీరామ్ స్వరంలో ప్రత్యేకతను సంతరించుకుంది.

కలిసిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు

కలిసిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు

లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా నిలిచిన వారు.. ఒక్కచోట చేరారు. భేషజాలన్నీ మరిచిపోయి ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుని, ఒకరితోమరొకరు కలిసిపోయారు. ఈ అరుదైన దృశ్యం నిజామాబాద్‌లో జరిగింది. హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్ దళ్ నేతృత్వంలో నిర్వహించిన ర్యాలీకి బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిలు హాజరయ్యారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేసుకున్నారు.

స్నేహానికి స్వస్తి చెప్పిన యువతిపై దాడి

స్నేహానికి స్వస్తి చెప్పిన యువతిపై దాడి

కర్ణాటక హుబ్బళ్లిలో నేహ హత్య కేసు ఆ రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హత్యలో లవ్ జిహాద్ కోణం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో హుబ్బళ్లికి చెందిన ఓ యువతి తన స్నేహితుడు అఫ్తాబ్‌తో స్నేహానికి స్వస్తి చెప్పింది. అతను ఇచ్చిన బహుమతులను తిరిగి ఇచ్చేందుకు అఫ్తాబ్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో అతడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

వదిన వద్ద అప్పు తీసుకున్న పవన్

వదిన వద్ద అప్పు తీసుకున్న పవన్

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో అప్పుల వివరాలను వెల్లడించారు. వ్యక్తిగత అవసరాల కోసం రూ. 46.70 కోట్ల అప్పు చేసినట్లు తెలిపారు. అత్యధికంగా విజయ్ లక్ష్మీ వి.ఆర్‌. నుంచి రూ. 8 కోట్లు అప్పుగా చేశారు. అలాగే చిరంజీవి భార్య సురేఖ వద్ద రూ.2 కోట్లు అప్పు తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మెట్రో రైలు సమయం పొడిగింపు

మెట్రో రైలు సమయం పొడిగింపు

హైదరాబాద్: ఈనెల 25న ఉప్పల్‌ మార్గంలో మెట్రో రైలు సమయం పొడిగిస్తూ మెట్రో అధికారులు వెల్లడించారు. ఐపీఎల్‌ మ్యాచ్ దృష్ట్యా మెట్రో రైలు సమయం పొడిగిస్తున్నట్లు తెలిపారు. చివరి రైలు రాత్రి 12.15కు చివరి స్టేషన్‌ నుంచి బయలుదేరతాయని.. అర్ధరాత్రి 1.10 గంటలకు గమ్య స్థానాలకు చేరుకోనున్నాయని పేర్కొన్నారు.

రవిశంకర్‌ ప్రసాద్‌కు పోటీగా జగ్జీవన్‌రామ్‌ మనవడు

రవిశంకర్‌ ప్రసాద్‌కు పోటీగా జగ్జీవన్‌రామ్‌ మనవడు

బీహార్‌లోని పాట్నా సాహిబ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ మనవడు, మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ కుమారుడు డా.అన్షుల్‌ అవిజీత్‌కు టికెట్ ఇచ్చింది. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున మాజీ కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ బరిలో ఉన్నారు. ఆయనకు పోటీనిచ్చేందుకు కాంగ్రెస్‌ అన్షుల్‌ను బరిలోకి దింపింది. దీంతో ఈ పోరు ఆసక్తికరంగా మారింది.

అదే అవ్వా, తాతల కల: సీఎం జగన్

అదే అవ్వా, తాతల కల: సీఎం జగన్

ఎవరి మీదా ఆధారపడకుండా తమ జీవితం తామే గడపాలనేది అవ్వా తాతల కల అని జగన్ అన్నారు. అటువంటి వారికి రూ.3వేలు పెన్షన్ ఇస్తున్నది వైసీపీ ప్రభుత్వం అని తెలిపారు. పెన్షన్ కోసం క్యూలో నిలబడకుండా ఇంటి వద్దే డబ్బు ఇవ్వడం తన కల అని జగన్ వివరించారు. ఇంటి వద్దకే రేషన్ పంపించిన ఘనత తమ ప్రభుత్వానిదే అని జగన్ తెలిపారు.

T-20 వరల్డ్ కప్: అదిరిపోయే ప్రోమో

T-20 వరల్డ్ కప్: అదిరిపోయే ప్రోమో

ఈ ఏడాది టీ-20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జూన్ 1 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా కోసం స్టార్ స్పోర్ట్స్ వీడియో ప్రోమోను విడుదల చేసింది. రోహిత్ సేన టీ-20 వరల్డ్ కప్ కు సిద్ధమవుతోంది. వాళ్ల యాక్షన్ చూడడానికి మీరు సిద్ధమా? అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్‌ హీరోయిన్‌

పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్‌ హీరోయిన్‌

గతంలో ఓ ఆడిషన్‌లో తనకు ఎదురైన చేదు సంఘటన గురించి హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అన్నే హాత్వే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘తొలినాళ్లలో నేనో సినిమా ఆడిషన్‌కు వెళ్లా. హీరో-హీరోయిన్ల కెమిస్ట్రీ ఎలా ఉంటుందో పరీక్షించేందుకు అక్కడికి వచ్చిన పది మంది అబ్బాయిలని ముద్దు పెట్టుకోమని చెప్పారు’’ అని గతాన్ని గుర్తు చేసుకొని బాధపడ్డారు.

అంబేద్కరే వచ్చి అడిగినా అది జరగదు: ప్రధాని

అంబేద్కరే వచ్చి అడిగినా అది జరగదు: ప్రధాని

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న అబద్ధాన్ని ఇంకా ఎన్నిరోజులు ప్రచారం​ చేస్తారని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లో జాంజ్‌గిర్-చంపాలో మంగళవారం(ఏప్రిల్‌23)జరిగిన ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మాట్లాడారు. అంబేద్కర్‌ తిరిగి వచ్చి అడిగినా రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరన్నారు. కాంగ్రెస్‌ నేతలు తాము రాముని కంటే గొప్పవాళ్లం అనుకుంటారని, అందుకే అయోధ్య రాముని ప్రాణప్రతిష్టకు రాలేదని ఎద్దేవా చేశారు.

నాకు రాఖీ కడతారా: సీఎం జగన్

నాకు రాఖీ కడతారా: సీఎం జగన్

AP: వైసీపీ ప్రభుత్వం అందించిన పథకాల్లో సింహ భాగం మహిళకు సంబంధిచినవే ఉన్నాయని సీఎం జగన్ అన్నారు. ఇంటి పట్టాలు సైతం మహిళల పేర్లతోనే రిజిష్టర్ చేశామని గుర్తు చేశారు. పథకాల ద్వారా ఇచ్చే నగదును కూడా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇన్ని చేసిన తనకు రాఖీ కడతారా అని జగన్ మహిళను కోరారు.

చంద్రబాబు అంటే చంద్రముఖి: జగన్

చంద్రబాబు అంటే చంద్రముఖి: జగన్

AP: 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేదల అభివృద్ధికి కోసం ఆలోచన చేయలేదని సీఎం జగన్ తెలిపారు. ఎందుకంటే ఆయన చంద్రముఖి అన్నారు. చంద్రముఖి ప్రజల రక్తం తాగడానికే ఆలోచన చేస్తుందని విమర్శించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉన్న పథకాలు టీడీపీ హయాంలో లేవన్నారు. ఇన్ని పథకాలు అందించిన వైసీపీకి మళ్లీ అధికారం ఇవ్వాలని జగన్ కోరారు.

హనుమంతునికి సీఎం రేవంత్ పూజలు

హనుమంతునికి సీఎం రేవంత్ పూజలు

మహబూబ్‌నగర్: కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలోని ఆంజనేయుని ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకపూజలు చేశారు. ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జోగులాంబకు కేటీఆర్ పూజలు

జోగులాంబకు కేటీఆర్ పూజలు

అలంపూర్ శ్రీ జోగులాంబ దేవాలయాన్ని కేటీఆర్ సందర్శించారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెట్లపై కూర్చొని నమస్కరించారు.

ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జ‌రిగిన‌ సాలకట్ల వసంతోత్సవాలు నేటితో ముగిశాయి. తొలిరోజు, రెండో రోజు శ్రీ మలయప్పస్వామి, శ్రీ రుక్మిణీ సమేత శ్రీ కృష్ణస్వామివారికి ఘనంగా వసంతోత్సవ సేవలు నిర్వహించారు. చివరిరోజున శ్రీ‌దేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పతో పాటు శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారు, శ్రీరుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు.

అలాంటి వారిని 420 అంటారు: సీఎం జగన్

అలాంటి వారిని 420 అంటారు: సీఎం జగన్

AP: వస్తువులను ఎత్తుకెళ్లే వారిని దొంగలని, హత్యలు, మానభంగాలు చేసే వారిని హంతకులని అంటే.. ఇచ్చిన హామీలను నెరవేర్చని వారిని 420 అంటారని సీఎం జగన్ అన్నారు. ప్రజల డ్రీమ్స్.. జగన్ స్కీమ్స్ పేరుతో వైసీపీ ప్రభుత్వ పాలన సాగిందని వివరించారు. మే 13న జరిగే ఎన్నికల్లో నారా సైన్యానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జగన్ తెలిపారు.

ప‌వ‌న్ ప్ర‌మాణం వీడియో వైరల్

ప‌వ‌న్ ప్ర‌మాణం వీడియో వైరల్

జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా రిట‌ర్నింగ్ అధికారి ఆయనతో ప్ర‌మాణం చేయించారు. ‘‘కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను’’ అంటూ ఆయ‌న ప్ర‌మాణం చేశారు. ఆ వీడియోను జ‌న‌సేన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడది వైరల్ అవుతోంది.

స్టైలిష్ లుక్‌లో ప్రభాస్‌..

స్టైలిష్ లుక్‌లో ప్రభాస్‌..

టాలీవుడ్ హీరో ప్రభాస్ డిఫరెంట్‌ లుక్‌లో ఉన్న ఒక ఫోటో బయటికొచ్చింది. ఎవరూ ఊహించని విధంగా సరికొత్త అవతార్‌లో కనిపిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. లాంగ్‌ హెయిర్‌తో ఉన్న ప్రభాస్‌ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ లుక్‌ వెనుక సీక్రెట్ ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ, రాజాసాబ్ సినిమాల్లో నటిస్తున్నాడు.

బావోజీ జాతర ప్రారంభించిన సీఎం రేవంత్

బావోజీ జాతర ప్రారంభించిన సీఎం రేవంత్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని తిమ్మారెడ్డిపల్లిలో బావోజీ జాతరను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బావోజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా.. నాలుగు రోజుల పాటు ఇక్కడ జాతర జరగనుంది. లంబాడీల ఆరాధ్యమైన గురు లోకమసంద్‌ను ఈ వేడుకల్లో పూజించనున్నారు. బావోజీ ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి బంజారాలు అధిక సంఖ్యలో వస్తారు.

ఎన్నికల ప్రచారంలో జేబు దొంగల చేతివాటం

ఎన్నికల ప్రచారంలో జేబు దొంగల చేతివాటం

దేశంలో ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఆయా పార్టీ అభ్యర్థుల ప్రచారాలు జోరందుకున్నాయి. మద్దతుదారులతో భారీ బహిరంగ సభలు,రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు జేబుదొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు. టీవీ రాముడిగా పేరొందిన మీరట్ బీజేపీ అభ్యర్థి అరుణ్‌ గోవిల్‌ పాల్గొన్న రోడ్‌షోలో అనేక చోరీలు చోటుచేసుకున్నాయి. జనాల్లో కలిసిపోయిన దొంగల ముఠా పలువురి నుంచి డబ్బు, నగలు, ఫోన్లు కాజేశారు.

సీఎం రేవంత్‌‌కు హేట్సాఫ్‌: విజయేందర్‌

సీఎం రేవంత్‌‌కు హేట్సాఫ్‌: విజయేందర్‌

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు విజయేందర్ గౌడ్ హేట్సాప్ చెప్పారు. మల్కాజిగిరిలోని ప్రజలకు ఇండ్ల పట్టాలిచ్చి, రోడ్లు వేయించింది దేవేందర్ గౌడ్ అని సీఎం రేవంత్ చెప్పడం హర్షణీయమని తెలిపారు. సొంతపార్టీ కానివారు చేసే గొప్ప పనుల్ని ప్రస్తుతించాలంటే ఔన్నత్యం, ఔదార్యం కావాలని.. ఆ లక్షణాలు రేవంత్‌కు ఉన్నాయని.. అందుకే ఆయన ప్రజల ఆదరాభిమానాల్సి పొందుతున్నారని ప్రశంసించారు.

పెళ్లిలో కత్తి పట్టిన విజయ్ దేవరకొండ

పెళ్లిలో కత్తి పట్టిన విజయ్ దేవరకొండ

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ వివాహ వేడుకలో కత్తి పట్టుకొని ఫోటోలకు పోజులిచ్చాడు. నేడు తన పర్సనల్ బాడీగార్డు పెళ్లికి వెళ్లాడు విజయ్. ఈ క్రమంలో వరుడి కుటుంబ సాంప్రదాయం ప్రకారం విజయ్‌కి కత్తిని బహుకరించి పెద్దలు సన్మానించారు. దీంతో హీరో విజయ్ కూడా ఆ కత్తి పట్టుకొని ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

రాముడి ఫొటోతో బిర్యానీ వ్యాపారం

రాముడి ఫొటోతో బిర్యానీ వ్యాపారం

రాముడి ఫొటో ముద్రించిన ప్లేట్లలో బిర్యానీ వడ్డించి అమ్మడం చర్చనీయాంశం అయింది. ఢిల్లీలోని జహంగీర్​ పురిలో ఈ ఘటన వెలుగు చూసింది. హోటల్​ యజమాని రాముడి చిత్రపటం ఉన్న ప్లేట్లలో బిర్యానీ అమ్మడాన్ని భజరంగదళ్​ సభ్యులు వ్యతిరేకించారు. తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మైనార్టీల ఆస్తులపై రాహుల్ చెప్పిందిదే!

మైనార్టీల ఆస్తులపై రాహుల్ చెప్పిందిదే!

కాంగ్రెస్ గెలిస్తే మైనార్టీలకు హిందూ ఆస్తులు పంచి పెడుతుందని బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై హస్తం పార్టీ క్లారిటీ ఇచ్చింది. రాహుల్ గాంధీ ఓ సభలో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జనగణన చేసి.. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆస్తులు దామాషా ప్రకారం పంచిపెడతామని చెప్పారు. కానీ, కొందరు ఆ వీడియోను ఎడిట్ చేసి.. కేవలం మైనార్టీలకే ఆస్తులను పంచిస్తామని రాహుల్ చెప్పినట్లుగా రూపొందించారు.

ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేస్తున్నాం: చంద్రబాబు

ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేస్తున్నాం: చంద్రబాబు

మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్రలో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పాతపట్నంలో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. గిరిజనుల కోసం పాతపట్నంలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.