shape

Hyderabad ChotaNews

Blog Image

హైదరాబాద్‌ ఓటమి.. ఫైనల్స్‌కు కోల్‌కతా

ఐపీఎల్‌-17లో భాగంగా జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా.. 13.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో కోల్‌కతా ఫైనల్స్‌కు చేరుకుంది.

Blog Image

ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్

TG: సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర బాబు తెలిపారు. ఆయనను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఆయన ఇంటిలో సోదాలు చేసి రూ.38 లక్షలు నగదు సీజ్ చేసినట్లు సుధీంద్ర చెప్పారు. 60 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే 17 ప్రాపర్టీలను గుర్తించినట్లు పేర్కొన్నారు.

Blog Image

కారు, ఆటో ఢీ.. 9 మందికి గాయాలు

TG: నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్న కారు.. వెల్దండ సమీపంలో ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు చారకొండ మండలం శేరి అప్పరెడ్డిపల్లి పడమటితండాకు చెందిన రైతులుగా గుర్తించారు.

Blog Image

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

Blog Image

పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆల‌యంలో వసంతోత్సవాలకు మంగ‌ళ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. మే 22 నుంచి 24 వరకు వార్షిక వసంతోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. భక్తులు ఒక్కొక్కరు రూ.150 చెల్లించి దీంట్లో పాల్గొనవచ్చు.

Blog Image

ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలకు వెళ్లనున్న ఉపరాష్ట్రపతి

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొసేన్ అమీ-అబ్దోల్లాహియాన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. వారి మృతికి సంతాపం తెలిపేందుకు అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ బుధవారం ఇరాన్‌కు వెళ్లనున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇబ్రహీం రైసీ గౌరవ సూచకంగా మంగళవారం భారత్ అంతటా ఒకరోజు సంతాప దినం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Blog Image

రతన్ టాటాతో మాస్టర్ బ్లాస్టర్

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను కలుసుకున్నట్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. ‘‘గత ఆదివారం టాటాతో కాస్త సమయం గడిపే అవకాశం లభించింది. మేమిద్దరం ఆటో మొబైల్స్, వన్యప్రాణుల సంరక్షణ, సమాజ సేవ గురించి చర్చించుకున్నాం. దీంతోపాటు పెంపుడు కుక్కలపై మా ఇద్దరికి ఉన్న ప్రేమను తెలియజేసుకున్నాం. ఇలాంటి సంభాషణలు జీవితాంతం గుర్తుండిపోతాయి’’ అని తెలిపారు.

Blog Image

64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్‌

చైనా మొబైల్‌ తయారీ కంపెనీ వివో మరో కొత్త ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వివో వై200ప్రో 5జీ మొబైల్‌ ఓ వేరియంట్‌లో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.24,999గా నిర్ణయించింది. సిల్క్‌ బ్లాక్‌, సిల్క్‌ గ్రీన్‌ రంగుల్లో ఫోన్‌ లభిస్తుంది. ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌,ఫెడరల్‌ బ్యాంక్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,500ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చని కంపెనీ చెబుతోంది.

Blog Image

‘జగన్ గెలిచినా అసెంబ్లీకి రాలేరు’

వైసీపీ చీఫ్ జగన్ ఎమ్మెల్యేగా గెలిచినా అసెంబ్లీకి రాలేరని టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణ రాజు సెటైర్ వేశారు. కూటమి ప్రభుత్వాన్ని ఆయన ఎదుర్కోలేరని చెప్పారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. జగన్ అధికారం నుంచి దిగిపోవడమే వాటన్నింటికీ పరిష్కారమని అన్నారు. విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.

Blog Image

మరోసారి అప్పు చేసిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా అప్పులు చేస్తోంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మరో రూ.2వేల కోట్లు అప్పు తీసుకొచ్చింది. వెయ్యి కోట్ల రూపాయలు 17ఏళ్లకు 7.40 శాతం వడ్డీకి తీసుకుంది. మరో రూ.వెయ్యి కోట్లు 7.38శాతం వడ్డీకి 20 ఏళ్లకు అప్పు తీసుకుంది. గత వారమే రూ. 4వేల కోట్లు అప్పు చేసిన విషయం తెలిసిందే.

Blog Image

దారుణంగా విఫలమైన SRH బ్యాటర్లు.. KKR టార్గెట్ 160

కోల్‌కతాతో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో SRH బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రాహుల్ త్రిపాఠి(55), క్లాసెన్(32), కమిన్స్(30) మినహా ఎవరూ అంతగా రాణించలేదు. దీంతో హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కోల్‌కతా బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు తీసుకోగా.. వైభవ్, హర్షిత్, నరైన్, వరుణ్, రస్సెల్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో KKR గెలవాలంటే 160 పరుగులు చేయాల్సి ఉంటుంది.

Blog Image

సీనియర్లుగా జట్టులో మీ బాధ్యత అదే కదా: హర్భజన్‌

ఐపీఎల్‌-17వ సీజన్‌ను ముంబై ఇండియన్స్‌ చివరి స్థానంతో ముగించింది. దీనిపై ఒకప్పుడు ఆ జట్టుకు ఆడిన హర్భజన్ సింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ముంబై భవిష్యత్తు కోసం కెప్టెన్సీ మార్పు చేయడం సరైన నిర్ణయమే అయినప్పటికీ, దానిని సరిగ్గా అమలు చేయలేదన్నాడు. జట్టులోని సీనియర్లు కెప్టెన్ ఎవరన్నది పట్టించుకోకూడదని, వారి బాధ్యత జట్టును కలిసికట్టుగా ఉండేలా చూడటమే అని పేర్కొన్నారు.

Blog Image

సీబీఐలో లంచాధికారులు

ఓ కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులే అవినీతికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌లో నర్సింగ్‌ కాలేజీ స్కామ్‌ వ్యవహారంలో తనిఖీలకు వెళ్లిన అధికారులే లంచాలు తీసుకున్నారు. అనుకూలమైన నివేదిక ఇచ్చేందుకు రూ. 2నుంచి 10 లక్షల వరకు లంచం బొక్కారు. ఈ వ్యవహారం వెలుగుచూడడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పలువురు సీబీఐ అధికారులతో పాటు 22మంది బయటి వ్యక్తులపైనా కేసు నమోదు చేశారు.

Blog Image

85 మందిపై హిస్టరీ షీట్‌: ఏపీ డీజీపీ

AP: ఎన్నికల ముందు, తర్వాత జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్‌ తెరిచినట్టు డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్‌, మరో ఇద్దరిపై బహిష్కరణ వేటు వేసేందుకు సిఫార్సు చేశామన్నారు. ఎన్నికల ముందు రోజు నమోదైన కేసుల్లో 1,522 మంది నిందితులను గుర్తించినట్టు తెలిపారు.

Blog Image

ఆ ఒక్క సీటు మినహా యూపీలో బీజేపీకి ఓటమే: అఖిలేశ్

లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో ‘ఇండియా’ కూటమికి విశేష స్పందన వస్తోందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. ప్రధాని మోదీ పోటీ చేస్తోన్న వారణాసి మినహా మిగతా అన్నిచోట్లా బీజేపీ ఓడిపోతుందని వ్యాఖ్యానించారు. లాల్‌గంజ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం చేసిన అఖిలేశ్‌.. ఈసారి ఎలాంటి వ్యూహాలతో వచ్చినా యూపీ ప్రజలు బీజేపీని తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారన్నారు.

Blog Image

ఈవీఎం పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పోలింగ్ బూత్‌లో వీరంగం సృష్టించారు. పాల్వాయి గేటులోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. దానికి సంబంధించిన వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. స్వయంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఈవీఎంలను ధ్వంసం చేయడం హాట్ టాపిక్ అయింది.

Blog Image

ఏసీపీ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు

TG: సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావు ఇంటిలో ఏసీబీ జరిపిన సోదాల్లో భారీగా నగదు లభ్యమైంది. దాదాపు 12 గంటల పాటు తనిఖీలు చేయగా రూ. 45 లక్షలు, 60 తులాల బంగారం, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బినామీ పేర్లతో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. కాగా, సాహితీ ఇన్ఫ్రా కేసులో బాధితుల నుంచే డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

Blog Image

‘బీఆర్ఎస్‌వి ఏడుపుగొట్టు రాజకీయాలు’

TG: పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీపై ఏడవడం తప్ప బీఆర్ఎస్ నేతలకు ఏమీ చేతకావడం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలైనా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామంటే బోగస్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Blog Image

తెలంగాణ, ఏపీలో NIA సోదాలు

తెలంగాణలో NIA అధికారులు సోదాలు చేపట్టారు. ఇటీవల బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో భాగంగా తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడులోని 11 చోట్ల తనిఖీలు ముమ్మరం చేశారు. నిందితులకు సహకరించిన వారు, అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. పలు డిజిటల్ పరికరాలు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

Blog Image

మిథున్ చక్రవర్తి రోడ్ షోపై రాళ్లదాడి

లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకొంటున్నాయి. తాజాగా సినీ నటుడు, బీజేపీ నేత మిథున్‌ చక్రవర్తి మిడ్నాపుర్ పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోపై కొందరు వ్యక్తులు రాళ్లు విసిరారు. మిడ్నాపుర్‌ లోక్‌సభ సీటు నుంచి బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌ తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈ ఘర్షణ జరగ్గా.. ఆయనకు ఏమీ కాలేదని పోలీసులు వెల్లడించారు.

Blog Image

దేశం ఎన్నో విజయాలు సాధించింది: ఈటల

TG: మోదీ హయాంలో దేశం ఎన్నో విజయాలు సాధించిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డికి మద్దతుగా ఈటల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదుల పాలిట మోదీ సింహస్వప్నంలా మారారన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్‌లో ఉగ్రదాడులు జరగలేదన్నారు.

Blog Image

కేదార్‌నాథ్‌కు పోటెత్తిన భక్తులు

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. కేవలం పది రోజుల్లోనే ఈసారి 2.81 లక్షల మంది భక్తులు బాబా కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. కేదార్‌నాథ్‌కు ఏటా వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. 2023లో 19 లక్షల మంది రాగా, ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Blog Image

కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది: మాజీ సీఎం

సొంత పార్టీలో వైరుధ్యాల కారణంగా కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ సీనియర్‌ నేత, మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో జరిగేది ఇదేనన్నారు. అధికార పార్టీలో అంతర్గత విభేదాలతోపాటు పలు విషయాల్లో సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొందన్నారు. జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్‌లో చీలిక ఖాయమన్నారు.

Blog Image

సెలవు ఇవ్వాలని ఈసీని కోరిన ఎమ్మెల్సీ

TG: పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ రోజు సెలవు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఈసీని కోరారు. ఓటు హక్కు ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలో పని చేస్తున్న గ్రాడ్యుయేట్స్‌కు వేతనంతో కూడిన సెలవు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. కాగా, ఈ నెల 27న నల్గొండ -ఖమ్మం -వరంగల్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది.

Blog Image

అదిరిపోయే ఫీచర్స్‌తో కేటీఎం కొత్త బైక్

KTM కంపెనీ కొత్త బైక్‌ను లాంఛ్ చేసింది. సరికొత్త కలర్స్‌తో అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, ఈఎఫ్ఐ ఇంజిన్‌ను కలిగి ఉంది. గరిష్టంగా 31పీఎస్ శక్తిని, 25ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వీపీ సస్పెన్షన్ ప్యాకేజీతో కొత్త ట్రెల్లిస్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు ఈ కొత్త బైక్ ఇంజినీరింగ్ రైడర్ల అవసరాలకు తగినట్టుగా రూపొందించింది.

Blog Image

‘సీఎం తమ తప్పేమీ లేదని నిరూపించుకోవాలి’

సంచలనం సృష్టించిన 'ఆప్' ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి విషయంలోఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తొలిసారి స్పందించారు. ముఖ్యమంత్రి సాచివేత ధోరణితో వ్యవహరించకుండా తమ తప్పేమీ లేదని నిరూపించుకోవాలని అన్నారు. ఈ ఘటనపై కేజ్రీవాల్ ఇంతవరకూ స్పందించకపోవడాన్ని ప్రశ్నించారు. సీఎం మౌనం వల్ల మహిళల భద్రతపై అనుమానాలు మరింత ఇబ్బడిముబ్బడి అవుతాయన్నారు.

Blog Image

బ్రిజ్‌ భూషణ్‌పై అభియోగాలు నమోదు

మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణల కేసులో బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై ఢిల్లీ కోర్టు అధికారికంగా అభియోగాలు మోపింది. అతడు మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని న్యాయస్థానం ముందు వెల్లడించారు. బ్రిజ్‌ భూషణ్‌ నేరాన్ని ఏమైనా అంగీకరించారా? అని కోర్టు అడగ్గా.. ‘‘తాను ఎలాంటి తప్పు చేయనప్పుడు నేరాన్ని ఎందుకు అంగీకరించాలి’’ అని అతడి తరఫు న్యాయవాది వెల్లడించారు.