shape

Hyderabad ChotaNews

Blog Image

ఫ్యాక్టరీలో పేలుడు.. 17 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బెమెతరా జిల్లాలోని గన్‌పౌడర్‌ తయారీ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. పలువురు గాయపడినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

Blog Image

వావ్.. కమిన్స్‌ను బాహుబలితో పోల్చుతున్నారే!

ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో RRపై SRH గెలిచి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో బాహుబలి మూవీలోని ‘నిప్పులే శ్వాసగా’ అనే పాట లిరిక్స్‌తో SRH కెప్టెన్ పాట్ కమిన్స్‌పై రూపొందించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కచ్చితంగా పాట్ కమిన్స్‌ సారథ్యంలో SRH జట్టు కప్ గెలుస్తుందని హైదరాబాదీలు కామెంట్స్ చేస్తున్నారు.

Blog Image

ఓటేసిన ప్రియాంక గాంధీ

సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఓటు వేశారు.

Blog Image

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

Blog Image

ఓటు హక్కు వినియోగించుకున్న కపిల్‌దేవ్‌

మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నందుకు తనకు చాలా సంతోషంగా ఉన్నదని భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ అన్నారు. లోక్‌సభ ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఇవాళ హర్యానాలో తన సతీమణితో కలిపి ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యం దేశంలో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కపిల్‌దేవ్‌ సూచించారు.

Blog Image

అల్లు అర్జున్ పర్యటన వివాదం.. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు

నంద్యాలలో నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదంపై ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. ఈనెల 11న వైసీపీ అభ్యర్థి శిల్పారవికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… భారీ జన సమీకరణ జరుగుతుందని సమాచారాన్ని అందివ్వలేదని ఎస్.బి. కానిస్టేబుళ్లు స్వామి నాయక్ , నాగరాజు వీఆర్‌కు పంపిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Blog Image

కేన్స్‌లో మెరిసిన హైదరాబాదీ బ్యూటీ !

ఫ్రాన్స్‌లో 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదీ భామ అదితిరావు హైదరి కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై అదిరిపోయే లుక్‌లో కనిపించింది. వైట్‌ అండ్‌ బ్లాక్‌ ఔట్‌ఫిట్‌తో రెడ్‌ కార్పెట్‌పై నడుస్తుంటే అక్కడ కెమెరామెన్‌లతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

Blog Image

‘కన్నప్ప’లో నాకు సరిపోయే పాత్ర లేదు!

మంచు లక్ష్మి ‘కన్నప్ప’ మూవీలో నటించకపోవడానికి గల కారణమేంటో చెప్పింది. ‘‘మంచు విష్ణు ‘కన్నప్ప’లో నాకు సరిపోయే పాత్ర లేదేమో. అందుకే అవకాశం ఇవ్వలేదు. మనోజ్‌ కూడా లేడు. ఒకవేళ నేను, మనోజ్‌ కూడా ఉంటే అది మా ఫ్యామిలీ సినిమా అవుతుంది’’అని పేర్కొంది. కాగా, మంచు లక్ష్మి నటించిన వెబ్‌సిరీస్‌ ‘యక్షిణి’ జూన్‌ 14 నుంచి ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లోస్ట్రీమింగ్ కానుంది.

Blog Image

భువనేశ్వర్‌లో ఓటేసిన CM

ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ఆయన పోలింగ్‌ బూత్‌ ఆవరణలో తన వేలిపై ఉన్న సిరా గుర్తును మీడియాకు చూపించారు. ఒడిశాలో ఇవాళ ఆరో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌తోపాటే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కూడా జరుగుతోంది.

Blog Image

ఓటేసిన సోనియా, రాహుల్

సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ శనివారం కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో కాంగ్రెస్‌ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఓటేశారు.

Blog Image

రాంచీలో ఓటేసిన తెలంగాణ ఇంచార్జి గ‌వ‌ర్న‌ర్

జార్ఖండ్ రాజ‌ధాని రాంచీలో తెలంగాణ ఇంచార్జి గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్ త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఆయన క్యూలైన్‌లో వ‌చ్చి ఓటు వేశారు. అనంత‌రం ఇంచార్జి గ‌వ‌ర్న‌ర్ మీడియాతో మాట్లాడుతూ..‘ ఇవాళ తాను ఓటు వేసి ప్ర‌జాస్వామ్య హ‌క్కును వినియోగించుకున్నాను. ప్ర‌తి పౌరుడు కూడా విధిగా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని’ ఆయ‌న సూచించారు.

Blog Image

కేసీఆర్ దృఢ సంక‌ల్పానికి YTPS ఒక ఉదాహ‌ర‌ణ: కేటీఆర్

TG: బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన యాదాద్రి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్‌స్టేష‌న్ విద్యుదుత్ప‌త్తికి సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్(X) వేదిక‌గా ట్వీట్ చేశారు. యాదాద్రి ప‌వ‌ర్‌స్టేష‌న్‌లో ఒక‌టి, రెండు యూనిట్ల‌లో బాయిల‌ర్ లైట్ ప్ర‌క్రియ విజ‌య‌వంతమైంద‌ని గ‌తవారం ఇంజినీర్లు చెప్ప‌డం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. కేసీఆర్ దృఢ సంక‌ల్పానికి వైటీపీఎస్ ఒక అద్భుత‌మైన ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు.

Blog Image

అమెజాన్‌లో భారీ ఆఫర్.. 5జీ మొబైల్‌పై భారీ డిస్కౌంట్

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ వినియోగదారుల కోసం కొత్త మొబైళ్లపై డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తుంది. తాజాగా అమెజాన్ సమ్మర్ డీల్స్ సేల్‌ను ప్రకటించింది. అమెజాన్‌లో Apple iPhone 13 ధర అసలు ధర రూ.59,900 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.48,999కే ధర పలుకుతోంది. భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మరిన్ని వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.

Blog Image

‘ఫలితాలెలా ఉన్నా సంయమనం పాటించాలి’

AP: ఎన్నికల్లో ఫలితాల తరువాత నాయకులు గెలుపోటముల్లో భావోద్వేగాలను నియంత్రించుకుని, గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి సహకరించాలని వివిధ పార్టీల నేతలకు పోలీసులు సూచిస్తున్నారు. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపునకు కూడా సహకరించాలని కోరారు. ఫలితాల రోజు ర్యాలీలు, సంబరాలు, బాణసంచా కాల్చడంపై నిషేధం ఉందన్నారు. నాయకులెవరూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని ఆదేశించారు.

Blog Image

అన్ని వైద్య కళాశాలల్లో EWS కోటా!

HYD : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు (EWS) రిజర్వేషన్‌ అమలు చేయాలని ప్రభుత్వం సూత్ర­ప్రాయంగా నిర్ణయించింది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (NMC) ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచే రిజర్వేషన్లు అమలు చేయనుంది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని అన్ని సీట్లలో 10 శాతం EWS రిజర్వేషన్‌ కోసం కేటాయించనున్నారు.

Blog Image

PCC చీఫ్‌గా సీతక్క?

TG: పీసీసీ చీఫ్ పోస్టు కోసం పలువురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. అయితే పీసీసీ చీఫ్‌గా మంత్రి సీతక్క ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. సీతక్క ఆదివాసీ కావడంతో ఆమెను పీసీసీ చీఫ్‌గా చేస్తే పార్టీ నేతలు వ్యతిరేకించలేరని హైకమాండ్ భావిస్తోందట. ఒక వేళ సీతక్కకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే.. మంత్రి పదవి నుంచి ఆమె తప్పుకోవాల్సి ఉంటుందని సమాచారం.

Blog Image

ఇకపై ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లేనట్లే!

HYD: AP విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు జూన్ 2వ తారీఖున ముగియనుంది. దీంతో హైదరాబాద్‌లో ఉన్న AP ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఆ రాష్ట్రానికి మార్చుతున్నారు. గతేడాది CM జగన్ అన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని, కార్యాలయాలను APకి తరలించాలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (GAD)కు ఆదేశాలు జారీ చేశారు.

Blog Image

హిట్‌మైర్‌కు జరిమానా

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్ షిమ్ర‌న్ హిట్‌మైర్‌కు జ‌రిమానా పడింది. హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన క్వాలిఫైయ‌ర్ 2 మ్యాచ్‌లో ఆయనకు ఫీజులో 10 శాతం ఫైన్ వేశారు. అయితే ఇన్నింగ్స్ 14వ ఓవ‌ర్‌లో అభిషేక్ వ‌ర్మ వేసిన బౌలింగ్‌లో హిట్‌మైర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ త‌ర్వాత అత‌ను ఆవేశంలో వికెట్ల‌ను త‌న బ్యాట్‌తో కొట్ట‌బోయాడు. దాని వ‌ల్లే హిట్‌మైర్‌కు జ‌రిమానా వేసిన‌ట్లు తెలుస్తోంది.

Blog Image

రేపే IPL ఫైనల్ మ్యాచ్

రేపు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగే IPL-2024 ఫైనల్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. కోల్‌కతా - హైదరాబాద్‌ జట్లకు ఇక్కడి పరిస్థితిపై అవగాహన ఉంది. సన్‌రైజర్స్ బ్యాటర్లు చాలా దూకుడుగా ఆడుతున్నారు. కోల్‌కతా కూడా ఆత్మవిశ్వాసంతో ఉంది. తప్పకుండా ఫైనల్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

Blog Image

27 ఏళ్ల తర్వాత.. మళ్లీ ఇరువురి కాంబోలో !

ప్రభుదేవా, కాజోల్‌ కాంబినేషన్‌ అనగానే ‘మెరుపు కలలు’(1997) చిత్రం అందరికి గుర్తొస్తుంది. తాజాగా చరణ్‌తేజ్‌ ఉప్పలపాటి దర్శకత్వంలో వీరిద్దరు ఓ బాలీవుడ్‌ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కలిసి నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ అగ్ర తారలిద్దరూ కలిసి నటిస్తుండటం విశేషం. త్వరలో టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

Blog Image

ఐటీ ఉద్యోగాల్లో HYDదే హవా

TG: ఆర్థిక మందగమనం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల తొలగింపు జరుగుతుంటే హైదరాబాద్‌లో మాత్రం నియామకాల్లో పురోగతి ముందంజలో కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్త పోస్టింగుల్లో 3.6 శాతం తగ్గుదల నమోదుకాగా, భాగ్యనగరంలో 41.5 శాతం వృద్ధి నమోదైంది. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకు ఐటీ నియామకాలపై ‘ఇండీడ్’ అధ్యయనం చేసి ఈ వివరాలను పేర్కొంది.

Blog Image

గోల్డ్ మ్యాన్స్ వీడియో వైరల్

ఇద్దరు గోల్డ్ మ్యాన్‌‌లు ఒక చోట కలిశారు. ఇటీవల తెలంగాణ గోల్డ్ మ్యాన్‌ దుర్గం శ్రావణ్ కుమార్ కూతురి వివాహానికి తమిళనాడుకు చెందిన గోల్డ్ మ్యాన్ వరిచియు సెల్వం హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్స్ ‘వామ్మో.. ఈ గోల్డ్ మ్యాన్స్ మామూలుగా లేరుగా’’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Blog Image

కౌంటింగ్‌పై అభ్యర్థుల దృష్టి

AP : రాష్ట్రంలో పోలింగ్ తర్వాత సేదతీరడానికి దేశ, విదేశాలకు వెళ్లిన అభ్యర్థులు క్రమంగా నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. పార్టీల అగ్రనాయకత్వం ఆదేశాలతో కౌంటింగ్ ప్రక్రియపై దృష్టిసారించారు. మండల స్థాయి నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలో అనుసరించాల్సిన నిబంధనలు, చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేస్తున్నారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఏజెంట్లకు సూచిస్తున్నారు.

Blog Image

ఓటు వేసిన ప్రియాంక గాంధీ కుమార్తె

సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో భాగంగా కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ కుమార్తె మిరయా, కుమారుడు రేహాన్‌ వాద్రా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Blog Image

ఆ ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయా?.. ఎందుకంటే

భారత్‌లో IT హార్డ్‌వేర్, TV, వాషింగ్‌మెషీన్, AC వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది. ఎర్ర సముద్రంలో సరుకు రవాణాచేసే షిప్‌లపై హౌతీల దాడులే దీనికి కారణమని సమాచారం. దీంతో షిప్పింగ్ కంటైనర్ల కొరత, ముడిసరుకు రవాణా ఛార్జీల పెంపు కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుదారుపై రానున్న రోజుల్లో భారం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Blog Image

పోకిరి అసలు హీరో మహేష్ బాబు కాదు!

పోకిరి అసలు హీరో మహేష్ బాబు కాదు!

Blog Image

ప్ర‌తి ఓటు విలువైన‌ది: ప్ర‌ధాని మోదీ

సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ శనివారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్ (X) వేదికగా సందేశం ఇచ్చారు. ప్ర‌తి ఓటు విలువైన‌ద‌ని, మీ ఓటును కూడా వినియోగించుకోవాల‌ని సూచించారు. ఆరో విడత ఎన్నిక‌ల్లో భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఓటింగ్‌లో పాల్గొనాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. ఎన్నిక‌ల స‌ర‌ళిలో ప్ర‌జ‌లు చైత‌న్య‌వంతంగా పాల్గొంటేనే ప్ర‌జాస్వామ్యం వ‌ర్ధిల్లుతుంద‌ని మోదీ తెలిపారు.

Blog Image

ఓటేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ శనివారం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు వేశారు. ఈ సందర్భంగా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Blog Image

UP కుర్రాడికి ప్రధాని లేఖ

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో నివసిస్తున్న అభయ్ చంద్వాసియాకు ప్రధాని మోదీ లేఖ రాశారు. అభయ్ గత 20 ఏళ్లుగా మోటార్ న్యూరాన్ డిజార్డర్ అనే నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం 95 శాతం మేర శారీరక వైకల్యంతో జీవిస్తున్నాడు. ‘ప్రేమతో కూడిన మీ మాటలు దేశం కోసం మనస్పూర్తిగా పని చేసేవారికి కొత్త శక్తిని ఇస్తాయని’ మోదీ పేర్కొన్నారు.

Blog Image

తెలంగాణలో కొత్తగా BRU టాక్స్ మొదలైంది: కేటీఆర్‌

TG: రాష్ట్రంలో కొత్తగా BRU కాఫీ టాక్స్ మొదలైందని కేటీఆర్‌ ట్విట్టర్ (X ) వేదికగా విమర్శించారు. B- భట్టి విక్రమార్క టాక్స్, R- రేవంత్ రెడ్డి టాక్స్, U- ఉత్తమ్‌కుమార్ రెడ్డి టాక్స్ వసూలు చేసి సంచులను ఢిల్లీకి పంపడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి, లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Blog Image

వీరిద్దరి కాంబినేషన్‌లో మరో కాంబో ?

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సినీనటుడు వరుణ్‌ తేజ్‌ నటించిన 'ఫిదా' చిత్రం భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. అయితే వీరిద్దరి కాంబోలో మరోసారి కలిసి పని చేయడానికి వరుణ్‌ కూడా ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది. వరుణ్‌ తేజ్ ప్రస్తుతం ‘మట్కా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. శేఖర్‌ కమ్ముల ‘కుబేర’తో బిజీగా ఉన్నారు. అవి రెండూ పూర్తయ్యాకే ఈ కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కబోతోందని సమాచారం.

Blog Image

మెట్రో రైలు టైమింగ్స్ మార్పు

HYD: మెట్రో రైలు వేళల్లో స్వల్ప మార్పులు చేశారు. ట్రయల్‌లో భాగంగా చివరి రైలు రన్నింగ్‌ వేళలను వారానికి ఒకరోజు పొడిగించారు. ఈ మారిన సమయాల్లో భాగంగా ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసులను పొడిగిస్తున్నట్లు మెట్రోరైలు అధికారులు వివరించారు. దీంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Blog Image

రిగ్గింగ్‌కు పాల్ప‌డుతున్న BJP : TMC

BJP రిగ్గింగ్‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేస్తూ BJP ఓట్ల‌ను సొంతం చేసుకుంటున్న‌ట్లు TMC పేర్కొన్న‌ది. ఆ ఆరోప‌ణ‌ల‌కు చెందిన EVM ఫోటోల‌ను కూడా TMC షేర్ చేసింది. త‌న ఎక్స్ అకౌంట్‌లో ఆ పార్టీ ఫోటోల‌ను పోస్టు చేసింది. బంకుర‌లోని ర‌ఘునాథ‌పుర్‌లో జ‌రిగిన రిగ్గింగ్‌కు చెందిన ఫోటోల‌ను పోస్టు చేశారు.

Blog Image

వైసీపీ ఓడితే.. జగన్‌ అసెంబ్లీకి రాడు: రఘురామ

AP: టీడీపీ నేత రఘురామకృష్ణం రాజు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓడితే… జగన్‌ అసెంబ్లీకి రాడంటూ వ్యాఖ్యానించారు. ‘‘నాకు తెలిసి జగన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కాలు పెట్టడు. ఆయన స్వభావం నాకు తెలుసు. అవమానాన్ని తట్టుకోలేరు. అసెంబ్లీకి అయితే ఆయన రాడు” అని రఘురామకృష్ణ తెలిపారు.

Blog Image

IPLఫైనల్స్: టీమిండియా నుంచి ఒక్కరూ లేరు!

రేపు జరిగే IPL-2024 ఫైనల్‌లో కోల్‌కతాతో హైదరాబాద్‌ తలపడనుంది. అయితే ఈ టోర్నీ మొత్తం అదరగొట్టి ఫైనల్స్‌కు చేరిన ఇరు జట్లలో టీ20 వరల్డ్‌కప్‌కు వెళ్లే భారత జట్టులోని 15 మందిలో ఒక్క ప్లేయర్ లేరు. ఈ విషయాన్ని నెటిజన్లు సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ యంగ్ ప్లేయర్లను ప్రశంసిస్తున్నారు. రోహిత్ శర్మ, కోహ్లీ, పాండ్య, సూర్యకుమార్, బుమ్రా ఉన్న జట్లు లీగ్, ప్లేఆఫ్స్‌‌లోనే వెనుదిరిగాయి.

Blog Image

రేవ్‌ పార్టీ.. ముగ్గురు పోలీసులపై వేటు

బెంగళూరు రేవ్‌ పార్టీ వ్యవహారం పోలీస్‌ శాఖలోనూ కలకలం రేపుతోంది. రేవ్‌ పార్టీ కొనసాగుతున్నా కనీస సమాచారాన్ని సేకరించలేక పోయారంటూ హెబ్బగూడి పోలీస్‌స్టేషన్ ఏఎస్‌ఐతో పాటు ముగ్గురిని బెంగళూరు రూరల్ జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి సస్పెండ్‌ చేశారు. గూఢచారి విభాగం కానిస్టేబుల్‌ ఎస్‌బీ గిరీశ్, ఏఎస్‌ఐ నారాయణస్వామి, ఆ ప్రాంత గస్తీ కానిస్టేబుల్‌ దేవరాజుపై సస్పెసన్ వేటు పడింది.

Blog Image

ఈస్ట్‌ ఢిల్లీలో ఓటేసిన ‌ గౌతమ్‌ గంబీర్‌

టీమిండియా మాజీ క్రికెటర్‌, ఈస్ట్‌ ఢిల్లీ సిట్టింగ్‌ ఎంపీ గౌతమ్‌ గంబీర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం గంబీర్‌.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు అనేది ప్రజల శక్తి అని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్ల BJP పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని గంబీర్‌ చెప్పారు.

Blog Image

హైదరాబాద్‌ ఆనందం.. రాజస్థాన్‌ నిరాశ.. ఒకే ఫ్రేమ్‌లో

రాజస్థాన్‌పై రెండో క్వాలిఫయర్‌ 2లో అద్భుత విజయంతో హైదరాబాద్‌ ఫైనల్‌కు చేరుకుంది. దీంతో హైదరాబాద్‌ జట్టు సభ్యులు ఆనందంతో. రాజస్థాన్‌ ఆటగాళ్లు నిరాశలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. కాగా ఐపీఎల్‌ తుది పోరులో ఆదివారం కోల్‌కతాను హైదరాబాద్ ఢీకొట్టనుంది.

Blog Image

ట్రెండ్‌ తెలియాలంటే.. నిరీక్షించాల్సిందే!

AP : కౌంటింగ్ నాడు ట్రెండ్‌ తెలియాలంటే నిరీక్షించాల్సిందే. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ కవర్‌ తెరిచి ఏజెంట్లకు చూపించి ఆ ఓటు అర్హమైనదో కాదో గుర్తించాలి. కవర్‌‘A’తో పాటు ఓటరు డిక్లరేషన్‌ ఫారం విడిగా లేకుంటే పరిగణలోకి తీసుకోరు. గెజిటెడ్‌ అధికారి సంతకం లేకపోయినా ఆ ఓటును పరిగణించరు. 2019ఎన్నికల్లో 56వేల పోస్టల్‌ బ్యా­లెట్లు చెల్లకుండా పోయాయి.

Blog Image

బంగ్లా ఎంపీని హనీ ట్రాప్ చేసింది ఈమెనే!

చికిత్స కోసం భారత్‌కు వచ్చి దారుణంగా హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ మహమ్మద్‌ అన్వరుల్‌ అజీమ్‌ అన్వర్‌ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆయన హత్యలో బంగ్లా మోడల్ శిలాస్తి రెహమాన్ కీలక పాత్ర పోషించారు. MPని అపార్ట్‌మెంట్‌కు రప్పించేందుకు హనీ ట్రాప్ చేశారు. ఇంట్లోకి రాగానే గొంతు నులిమి చంపారు. ఈ కేసులో శిలాస్తిని ఢాకా పోలీసులు అరెస్ట్ చేశారు.