ChotaNews Quick Feeds

నేటి నుంచి భారత్‌-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు

నేటి నుంచి భారత్‌-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు

భారత్‌-అమెరికా రెండు వారాల పాటు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపట్టనున్నాయి. అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో ఉన్న ఫోర్ట్‌వయిన్‌రైట్‌ సైనిక స్థావరంలో యుద్ధ అభ్యాస్‌-23 పేరిట వీటిని నిర్వహించనున్నారు. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత్‌కు చెందిన 350 మంది సైనిక బృందం ఇప్పటికే అక్కడకు చేరుకుంది. భారత్‌, అమెరికా ఏటా సంయుక్త సైనిక విన్యాసాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

నేటి నుంచి పలు రైళ్ల రద్దు

నేటి నుంచి పలు రైళ్ల రద్దు

సాంకేతిక కారణాలతో నేటి నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 25 నుంచి అక్టోబరు 1 వరకు కాచిగూడ-నడికుడి-కాచిగూడ(07791/07792), గుంటూరు-డోన్‌-గుంటూరు(17228/17227), గుంటూరు-కాచిగూడ-గుంటూరు(17251/17252) , గుంటూరు-సికింద్రాబాద్‌-గుంటూరు(17253/17254) రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు వివరించారు. అలాగే మచిలీపట్నం-మంత్రాలయం రైలు(07067)ను ఈనెల 26, 28, 30 తేదీల్లో, మంత్రాలయం-మచిలీపట్నం రైలు(07068)ను ఈనెల 27, 29, అక్టోబరు 1న రద్దు చేసినట్లు తెలిపారు.

నేడు వైద్య, ఆరోగ్యశాఖ ప్రగతి నివేదిక ఆవిష్కరణ

నేడు వైద్య, ఆరోగ్యశాఖ ప్రగతి నివేదిక ఆవిష్కరణ

వైద్య, ఆరోగ్యశాఖ పదేళ్ల ప్రగతి నివేదికను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు నేడు హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖలో కొత్తగా నియమితులైన 310 మంది ఫార్మాసిస్టులకు మంత్రి నియామక పత్రాలను అందచేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.