ChotaNews Quick Feeds

షర్మిల అప్పుపై చంద్రబాబు ఏమన్నారంటే?

షర్మిల అప్పుపై చంద్రబాబు ఏమన్నారంటే?

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన అన్న సీఎం జగన్ వద్ద రూ. 82 కోట్లు అప్పు తీసుకున్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తండ్రి మొత్తం ఆస్తిని కొట్టేసిన దుర్మార్గుడు జగన్ అని విమర్శించారు. ఆస్తిలో వాటా ఇవ్వకుండా అప్పు ఇచ్చాడని మండిపడ్డారు. చెల్లికే న్యాయం చేయలేని వాడు ప్రజలకు ఏం మంచి చేస్తాడని ప్రశ్నించారు.

స్వరాష్ట్రంలో పాలమూరుకు తీరని అన్యాయం: సీఎం రేవంత్

స్వరాష్ట్రంలో పాలమూరుకు తీరని అన్యాయం: సీఎం రేవంత్

తెలంగాణ స్వరాష్ట్రంలో పాలమూరుకు తీరని అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కరీంనగర్‌లో ఓడిపోతానని భయపడి కేసీఆర్ పాలమూరుకు వస్తే.. ఇక్కడి ప్రజలు గెలిపించి పార్లమెంట్‌కు పంపించారన్నారు. తదనంతరం కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇస్తే.. తానే తెచ్చానని కేసీఆర్ చెప్పుకున్నారని విమర్శించారు. పదేళ్లు తెలంగాణకు సీఎంగా ఉన్న కేసీఆర్.. మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు.

నా ప్రసంగంతో కాంగ్రెస్‌లో భయం: మోదీ

నా ప్రసంగంతో కాంగ్రెస్‌లో భయం: మోదీ

కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ కుట్ర పన్నుతోందనే సత్యాన్ని తాను బయటపెట్టడంతో ఆ పార్టీలో ఆందోళన మొదలైందని విమర్శించారు. నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రధాని మాట్లాడారు.