ChotaNews Quick Feeds

తెలంగాణ సీఎం సహాయనిధికి మేఘా సంస్థ రూ.5కోట్ల విరాళం

తెలంగాణ సీఎం సహాయనిధికి మేఘా సంస్థ రూ.5కోట్ల విరాళం

తెలంగాణ‌లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. వరద సహాయక చర్యల కోసం మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి సీఎం రేవంత్​రెడ్డికి రూ.5కోట్ల రూపాయల చెక్కు అందజేశారు. హైదరాబాద్‌ రేస్ క్లబ్‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ నివాసంలో రూ.2 కోట్ల రూపాయలు విరాళంగా అందజేసింది. లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్‌ సీఎంఆర్‌ఎఫ్‌కు కోటి రూపాయలు విరాళం అందజేశారు.

43 ఏళ్ల తర్వాత.. డ్రైవింగ్‌ టెస్ట్ పాసైన న‌టుడు

43 ఏళ్ల తర్వాత.. డ్రైవింగ్‌ టెస్ట్ పాసైన న‌టుడు

ఒకట్రెండు కాదు 43 ఏళ్ల తర్వాత డ్రైవింగ్‌ టెస్ట్‌కు హాజరై, పాసయ్యారు బాలీవుడ్‌ నటుడు చంకీ పాండే. ఆ ఆనందాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘43 సంవత్సరాల తర్వాత డ్రైవింగ్‌ టెస్ట్‌కు హాజరయ్యా. ఏం జరిగిందో ఊహించగలరా? అవును.. నేను పాసయ్యా’’ అంటూ ముంబయి ఆర్టీవోకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఫొటో పంచుకున్నారు.

15 వేల ఉద్యోగాలు.. నెలకు రూ.2లక్షల జీతం

15 వేల ఉద్యోగాలు.. నెలకు రూ.2లక్షల జీతం

యుద్ధం కారణంగా కార్మికుల కొరత ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌.. భారత్‌ నుంచి వేల సంఖ్యలో నియామకాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా మరోసారి వేల సంఖ్యలో కార్మికులను నియమించుకునేందుకు భారత్‌ను ఇటీవల సంప్రదించిందని నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. 15వేల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ ఉద్యోగానికి నెల‌కు రూ.1.92 లక్షల జీతంతోపాటు బీమా, ఆహారం, వసతి కల్పిస్తారు.