ChotaNews Quick Feeds

తెలంగాణలో గ్రామీణ రోడ్లకు మహర్దశ

తెలంగాణలో గ్రామీణ రోడ్లకు మహర్దశ

TG: రాష్ట్రంలో గ్రామీణ రోడ్ల నిర్మాణానికి సంబంధించి రూ.1377.66 కోట్లు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 92 నియోజకవర్గాల్లో 641 పనులకు ఈ నిధులు విడుదలయ్యాయి. 1323 కిలోమీటర్ల కొత్త రహదారుల నిర్మాణాలకు ఈ నిధులను వెచ్చించనున్నారు.

TDP ఆఫీస్‌పై దాడి కేసు.. లొంగిపోయిన చైతన్య

TDP ఆఫీస్‌పై దాడి కేసు.. లొంగిపోయిన చైతన్య

AP: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో నేడు లొంగిపోయాడు. ఆయన వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. కూటమి ప్రభుత్వం రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. చైతన్య.. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడు.

వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ సెటైర్లు

వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ సెటైర్లు

AP: ప్రజాప్రతినిధులుగా ఉన్నంత కాలం పరిపాలన, రాజకీయాలు వేర్వేరుగా చూడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. "వైసీపీ హయాంలో151 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. వారెప్పుడైనా ప్రజల సమస్యలపై ఇలా స్పందించారా?. ఎంతసేపు వారి నోటి వెంట బూతులు తప్ప, ప్రజల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి కానరాలేదు"అని పవన్ విమర్శించారు.