ChotaNews Quick Feeds

హిందువుల తొలి పండుగ ఏదో తెలుసా..?

హిందువుల తొలి పండుగ ఏదో తెలుసా..?

హిందువుల తొట్టతొలి పండుగగా తొలి ఏకాదశిని పేర్కొంటారు. హిందువుల ప్రధానమైన పండుగలకు తొలి ఏకాదశితోనే శ్రీకారం చుడతారు. తొలి ఏకాదశి తర్వాతే వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ప్రధాన పండగలు వస్తాయి. హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశేష ప్రాధాన్యత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశికి విశేష ప్రాధాన్యతనిస్తారు. దీన్నే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు.

చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ

చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ

టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించారు. ఓ T20 సిరీస్‌లో సెంచరీతోపాటు వికెట్ సాధించిన తొలి భారత ఆటగాడిగా అభిషేక్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు భారత్ నుంచి మరే క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. కాగా జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో అభిషేక్‌కు బ్యాటింగ్ రాలేదు. బౌలింగ్‌లో మాత్రం 3 ఓవర్ వేసి 20 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టారు.

వివాహితపై ఆర్ఎంపీ డాక్టర్ అత్యాచారం

వివాహితపై ఆర్ఎంపీ డాక్టర్ అత్యాచారం

AP: శ్రీకాకులం జిల్లా పలాసలో జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వజ్రపుకొత్తూరు మండల కేంద్రంలో క్లీనిక్ నడుపుతున్న దువ్వాడ ఉమామహేశ్వరరావు అనే ఆర్ఎంపీ డాక్టర్.. ఓ వివాహితపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాధిత మహిళ భర్త వజ్రపుకొత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.