ChotaNews Quick Feeds

ఇక జియోలో రెండే వార్షిక ప్లాన్లు

ఇక జియోలో రెండే వార్షిక ప్లాన్లు

రిలయన్స్‌ జియో ఇప్పుడు కేవలం రెండు వార్షిక ప్రీపెయిడ్‌ ప్లాన్లను మాత్రమే అందిస్తోంది. రూ.3,999 ప్లాన్‌‌తో అపరిమిత కాలింగ్‌, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, 2.5జీబీ డేటా, ఫ్యాన్‌కోడ్‌, జియోసినిమా, జియోటీవీ, జియోక్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తాయి. ఇక రూ.3,599 ప్లాన్‌‌తో రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, 2.5జీబీ డేటాను పొందొచ్చు. అపరిమిత కాలింగ్‌ ఉంటుంది. జియోసినిమా, జియోటీవీ, జియోక్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది.

ట్రంప్‌ చిత్రాలతో టీ- షర్టులు

ట్రంప్‌ చిత్రాలతో టీ- షర్టులు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిత్రాలతో టీ-షర్టులను రూపొందించారు. ఆయనపై కాల్పులు జరిగిన నేపథ్యంలో వీటిని తయారు చేశారు. ఈ టీ-షర్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రంప్‌పై దాడి జరిగిన మూడు గంటల వ్యవధిలోనే 2 వేలకు పైగా టీ-షర్టుల ఆర్డర్లు జరిగినట్లు తెలుస్తోంది.

విజయవాడ దుర్గ గుడి ఘాట్​ రోడ్డు మూసివేత

విజయవాడ దుర్గ గుడి ఘాట్​ రోడ్డు మూసివేత

AP: విజయవాడ దుర్గ గుడి ఘాట్ రోడ్డు మూసివేశారు. వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతున్న కారణంగా ఘాట్ రోడ్డు ఆదివారం ( జులై 14) మూసివేశారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతుండటంతో ఘాట్ రోడ్డును మూసివేసినట్లు అధికారులు తెలిపారు. మహా మండపం నుంచి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. కొండరాళ్ళు దొర్లిపడకుండా ముందస్తుగా ఘాట్ రోడ్డును మూసివేశారు.