ChotaNews Quick Feeds

ట్రంప్‌ చిత్రాలతో టీ- షర్టులు

ట్రంప్‌ చిత్రాలతో టీ- షర్టులు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిత్రాలతో టీ-షర్టులను రూపొందించారు. ఆయనపై కాల్పులు జరిగిన నేపథ్యంలో వీటిని తయారు చేశారు. ఈ టీ-షర్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రంప్‌పై దాడి జరిగిన మూడు గంటల వ్యవధిలోనే 2 వేలకు పైగా టీ-షర్టుల ఆర్డర్లు జరిగినట్లు తెలుస్తోంది.

మరిడమ్మ అమ్మవారి ఆషాఢ మాస జాతరలో భక్తుల కిటకిట

మరిడమ్మ అమ్మవారి ఆషాఢ మాస జాతరలో భక్తుల కిటకిట

కాకినాడ: పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆషాఢ మాస జాతర, దుర్గాష్టమి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.

విజయవాడ దుర్గ గుడి ఘాట్​ రోడ్డు మూసివేత

విజయవాడ దుర్గ గుడి ఘాట్​ రోడ్డు మూసివేత

AP: విజయవాడ దుర్గ గుడి ఘాట్ రోడ్డు మూసివేశారు. వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతున్న కారణంగా ఘాట్ రోడ్డు ఆదివారం ( జులై 14) మూసివేశారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతుండటంతో ఘాట్ రోడ్డును మూసివేసినట్లు అధికారులు తెలిపారు. మహా మండపం నుంచి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. కొండరాళ్ళు దొర్లిపడకుండా ముందస్తుగా ఘాట్ రోడ్డును మూసివేశారు.