ChotaNews Quick Feeds

సందీప్ రెడ్డి వంగాకు నాగ్ అశ్విన్ కౌంటర్!

సందీప్ రెడ్డి వంగాకు నాగ్ అశ్విన్ కౌంటర్!

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి2898AD’ సినిమా రూ.1,000కోట్ల క్లబ్‌లోకి చేరింది. దీనిపై నాగ్ అశ్విన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎలాంటి రక్త‌పాతం, అశ్లీలత, రెచ్చగొట్టే వ్యాఖ్య‌లు, దోపిడి, గాయ‌ప‌రిచే మాట‌లు లేకుండా రూ.1,000 కోట్లు సాధించడం గొప్పవిషయమని అశ్విన్ పేర్కొన్నారు. దీంతో ‘యానిమల్’ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు కౌంటర్‌గానే అశ్విన్ ఈ విధంగా ట్వీట్‌చేశారని నెట్టింట చర్చ జరుగుతోంది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరగనున్న ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వే.. టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లలో గెలిచి సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. ఇక నామమాత్రంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి.

ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్

ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని గంగానమ్మ ఆలయ పునర్ నిర్మాణ ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి పాల్గొన్నారు. గంగానమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిపై లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని గంగానమ్మ తల్లికి వేడుకున్నామని తెలిపారు.