ఆ నిబంధనలు కఠినతరం చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
దేశీయ ఫుడ్ సేఫ్టీ నియంత్రణ సంస్థ యాంటీబయాటిక్స్ వాడకంలో నిబంధనలను కఠినతరం చేసింది. మాంసం, మాంస ఉత్పత్తులు, పాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, గుడ్లు, ఆక్వాకల్చర్ కోసం వాడే యాంటీబయాటిక్స్ నిబంధనలను కఠినతరం చేసింది. అనుమతించిన స్థాయిలను తగ్గించి, మరిన్ని ఔషధాలను పరిశీలించాల్సిన జాబితాలో ఉంచింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎసేఐ) తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.