ChotaNews Quick Feeds

కంటెస్టెంట్లలకు బిగ్‌బాస్‌ బంపర్ ఆఫర్.. ప్రోమో

కంటెస్టెంట్లలకు బిగ్‌బాస్‌ బంపర్ ఆఫర్.. ప్రోమో

బిగ్‌బాస్‌ 8వ సీజన్‌లో ఫ్యామిలీ వీక్‌ దగ్గరి నుంచి ఎప్పుడూ ఎవరో ఒకరు గెస్టులు వస్తూనే ఉన్నారు. రెండువారాల క్రితం పాత సీజన్‌ కంటెస్టెంట్లు, గత వారం సెలబ్రిటీలు రాగా.. ఇప్పుడు బుల్లితెర తారలు హౌస్‌లోకి వస్తున్నారు. ఈ సీరియల్‌ జంటలతో పోటీపడి గెలిస్తే ప్రైజ్‌మనీలో కొంత డబ్బు యాడ్‌ చేస్తానన్నాడు బిగ్‌బాస్‌. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్‌ చేశారు.

ఈ పార్లమెంటు సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు!

ఈ పార్లమెంటు సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు!

జమిలి ఎన్నికలపై మరో ముందడుగు పడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో లేదంటే వచ్చే సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. ఆ తర్వాత దీనిని జాయింట్‌ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్న వేళ.. దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఈ ట్రిక్ ఎప్పుడైనా ట్రై చేశారా?

ఈ ట్రిక్ ఎప్పుడైనా ట్రై చేశారా?

బాలికలు, యువతులు, మహిళలు గాజులు వేసుకోవడం, తీయడంలో కోన్నిసార్లు ఇబ్బందులు పడుతుంటారు. బిగుతుగా ఉన్న గాజులను తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ సమస్యకు ఓ మహిళ చక్కటి పరిష్కారాన్ని కనుక్కుంది. చేతికి వేసిన గాజును ఎంతో సులభంగా తీయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ ట్రిక్ ఏదో చాలా బాగుందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.