ముగిసిన YCP నేతల విచారణ
AP: మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో YCP నేతల విచారణ ముగిసింది. ఎప్పటిలాగే విచారణకు సహకరించలేదని.. విచారణకు కీలకమైన సెల్‌ఫోన్లు ఇచ్చేందుకు మరోసారి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో పాల్గొన్న వారి ఫొటోలు చూపించి పోలీసులు ప్రశ్నించారు. తమతో ఫొటో దిగిన వారి గురించి అడిగితే వైసీపీ నేతలు తమకు తెలియదని సమాధానమిచ్చినట్లు పోలీసులు వివరించారు.