ChotaNews Quick Feeds

జగన్నాథుడే ట్రంప్‌ను రక్షించాడు!

జగన్నాథుడే ట్రంప్‌ను రక్షించాడు!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్న ఘటనపై కోల్‌కతా ఇస్కాన్ VP రాధారమణ్ దాస్ ఆసక్తికర ట్వీట్‌చేశారు. ట్రంప్‌ను పూరీ జగన్నాథుడే రక్షించారని పలువురు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇదే నిజమని రాధారమణ్ దాస్ అభిప్రాయపడ్డారు. 48ఏళ్ల క్రితం న్యూయార్క్‌లో రథయాత్ర వేడుకల నిర్వహణకు అవసరమైన రథాలను తన భూమిలోనే నిర్మించుకునేందుకు ట్రంప్ అనుమతిచ్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

సందీప్ రెడ్డి వంగాకు నాగ్ అశ్విన్ కౌంటర్!

సందీప్ రెడ్డి వంగాకు నాగ్ అశ్విన్ కౌంటర్!

ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి2898AD’ సినిమా రూ.1,000కోట్ల క్లబ్‌లోకి చేరింది. దీనిపై నాగ్ అశ్విన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎలాంటి రక్త‌పాతం, అశ్లీలత, రెచ్చగొట్టే వ్యాఖ్య‌లు, దోపిడి, గాయ‌ప‌రిచే మాట‌లు లేకుండా రూ.1,000 కోట్లు సాధించడం గొప్పవిషయమని అశ్విన్ పేర్కొన్నారు. దీంతో ‘యానిమల్’ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు కౌంటర్‌గానే అశ్విన్ ఈ విధంగా ట్వీట్‌చేశారని నెట్టింట చర్చ జరుగుతోంది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరగనున్న ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వే.. టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లలో గెలిచి సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. ఇక నామమాత్రంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి.