నాలుగేళ్ల బాలికపై అత్యాచారం
మహారాష్ట్రలోని పుణెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారికి తెలిసిన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. దీంతో బాధితరాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ముంధ్వా పోలీసులు POCSO చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపడుతున్నాట్లు తెలిపారు.