ChotaNews Quick Feeds

డీమార్ట్‌ షేర్లు డౌన్‌

డీమార్ట్‌ షేర్లు డౌన్‌

డీమార్ట్‌ పేరిట రిటైల్‌ వ్యాపారం నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ షేర్లు క్షీణించాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి ప్రకటించిన ఫలితాల్లో మదుపర్లను మెప్పించడంలో కంపెనీ విఫలమవడంతో సోమవారం ఉదయం 9% మేర క్షీణించాయి. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.27 వేల కోట్ల మేర ఆవిరైంది. మరోవైపు క్విక్‌ కామర్స్‌ సంస్థల నుంచి డీమార్ట్‌కు ఎదురవుతున్న పోటీ కూడా మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

బాణాసంచాపై నిషేధం.. ఎక్కడంటే

బాణాసంచాపై నిషేధం.. ఎక్కడంటే

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సైతం దేశ రాజధానిలో బాణాసంచా తయారీ, విక్రయాలు, నిల్వ, వినియోగంపై నిషేధం విధించింది. శీతాకాలం నేపథ్యంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీపావళి నేపథ్యంలో ఆన్‌లైన్‌ డెలివరీలతో సహా అన్నిరకాల బాణాసంచా అమ్మకాలు, నిల్వ, తయారీ, కాల్చడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ కాలుష్యనియంత్రణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

అక్టోబర్‌ 23 నుంచి ‘రాజా సాబ్’ వరుస అప్‌డేట్స్

అక్టోబర్‌ 23 నుంచి ‘రాజా సాబ్’ వరుస అప్‌డేట్స్

ప్రభాస్‌ - మారుతి కాంబోలో సిద్ధమవుతోన్న చిత్రం ‘రాజా సాబ్‌’. రొమాంటిక్‌ హారర్‌ కామెడీ నేపథ్యంలో ఇది తెరకెక్కుతోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అక్టోబర్‌ 23 నుంచి ఈ సినిమా నుంచి వరుస అప్‌డేట్స్ ఉంటాయని నిర్మాత SKN వెల్లడించారు.