100 శాతం చెత్త విభజన జరగాలి: కలెక్టర్
పల్నాడు: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 100శాతం చెత్త విభజన జరగాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు, కెమికల్ వ్యర్థాలు, నిర్మాణ రంగ వ్యర్థాలు వంటి అన్ని రకాల చెత్తను ఎక్కడికక్కడ విభజించి సేకరించాలన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ జిల్లా పర్యావరణ ప్రణాళిక సమావేశం నిర్వహించారు.