ChotaNews Quick Feeds

'ప్రజా దర్బార్' నిర్వహించిన ఎమ్మెల్యే

'ప్రజా దర్బార్' నిర్వహించిన ఎమ్మెల్యే

కోనసీమ: రావులపాలెంలో ప్రజా సమస్యలు తిష్ట వేశాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన 'ప్రజా దర్బార్' నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యంతో ప్రజా సమస్యలు పేరుకుపోయాయని, ఆ కష్టాలను తొలగించాలని ప్రజా దర్బార్‌లో వినతులు ఇస్తున్న అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు.

ముగిసిన YCP నేతల విచారణ

ముగిసిన YCP నేతల విచారణ

AP: మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో YCP నేతల విచారణ ముగిసింది. ఎప్పటిలాగే విచారణకు సహకరించలేదని.. విచారణకు కీలకమైన సెల్‌ఫోన్లు ఇచ్చేందుకు మరోసారి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో పాల్గొన్న వారి ఫొటోలు చూపించి పోలీసులు ప్రశ్నించారు. తమతో ఫొటో దిగిన వారి గురించి అడిగితే వైసీపీ నేతలు తమకు తెలియదని సమాధానమిచ్చినట్లు పోలీసులు వివరించారు.

ఎమర్జింగ్‌ ఆసియా కప్‌కు భారతజట్టు ప్రకటన

ఎమర్జింగ్‌ ఆసియా కప్‌కు భారతజట్టు ప్రకటన

ఒమన్‌ దేశంలో జరగనున్న ఎమర్జింగ్ ఆసియా కప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత్‌-ఎ జట్టును బీసీసీఐ ప్రకటించింది. తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, అనుజ్ రావత్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నేహాల్ వదేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా, రసీక్ సలామ్, సాయి కిశోర్, రాహుల్ చాహర్.