shape

technology ChotaNews

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో జరగనున్న ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వే.. టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లలో గెలిచి సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. ఇక నామమాత్రంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి.

ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్

ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని గంగానమ్మ ఆలయ పునర్ నిర్మాణ ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి పాల్గొన్నారు. గంగానమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిపై లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని గంగానమ్మ తల్లికి వేడుకున్నామని తెలిపారు.

ట్రంప్‌పై హత్యాయత్నం.. రష్యా స్పందన ఇదే!

ట్రంప్‌పై హత్యాయత్నం.. రష్యా స్పందన ఇదే!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో రష్యా స్పందించింది. అమెరికా చట్ట విరుద్ధమైన విధానాలను ప్రేరేపించిన ఫలితమే ఈ దాడి అని విమర్శించింది. విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని అమెరికాకు హితవు పలికింది. అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌కు మద్దతు ఉపసంహరిస్తానని ట్రంప్‌ పరోక్షంగా చెప్పడంతో ఆయనపై హత్యాయత్నం జరిగిందని రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ఆరోపించారు.

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

అల్కరాజ్‌ vs జకోవిచ్.. టికెట్ ధర రూ. 8 లక్షలపైనే!

అల్కరాజ్‌ vs జకోవిచ్.. టికెట్ ధర రూ. 8 లక్షలపైనే!

వింబుల్డన్ ఫైన‌ల్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ మెగా ఫైనల్లో ఏడుసార్లు ఛాంపియన్ నొవాక్ జకోవిచ్, డిఫెండింగ్ ఛాంప్ కార్లోస్ అల్కరాజ్‌ తలపడనున్నారు. ఈ మ్యాచ్ వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మ్యాచ్ ఎంట్రీ టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అత్యధికంగా టికెట్ ధర 10,600డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో దాదాపు రూ. 8.90లక్షలు అన్నమాట.

గౌడన్నలతో సీఎం రేవంత్ సహపంక్తి భోజనం

గౌడన్నలతో సీఎం రేవంత్ సహపంక్తి భోజనం

TG: కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ అనంతరం గౌడన్నలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనం చేశారు. ఇందులో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మేయర్‌కు ఆహ్వానం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మేయర్‌కు ఆహ్వానం

విశాఖపట్ఠణం: గోపాలపట్నం జిల్లా పరిషత్ పాఠశాల పూర్వ విద్యార్ధుల ఆత్మీయ కలయికకు హాజరుకావాలి నగర డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ ను ఆహ్వానించారు. పాఠశాల 1989-90 పూర్వ విధ్యార్ధుల బ్యాచ్‌‌ కు సంబంధించి ఆగస్టు 18 వ తేది (ఆదివారం ) గోపాలపట్నం బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఈ కార్యక్రమం జరగనుందని కమిటి సభ్యులు తెలిపారు.

రత్న భాండాగారం తలుపులు తెరవగానే సొమ్మసిల్లిన ఎస్పీ

రత్న భాండాగారం తలుపులు తెరవగానే సొమ్మసిల్లిన ఎస్పీ

పూరీ జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారం తలుపులు ఎట్టకేలకు ఆదివారం మధ్యాహ్నం తెరుచుకున్నాయి. అయితే తలుపులను తెరువగానే పూరి జిల్లా ఎస్పీ పినాక్‌ మిశ్రా గదిలో సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో ఆయనను ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన హెల్త్‌ క్యాంప్‌కు తరలించారు. అక్కడ డాక్టర్‌ సీబీకే మహంతి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

అందరికీ ఇన్సూరెన్స్‌.. బడ్జెట్‌ సమావేశాల్లో మార్పులు?

అందరికీ ఇన్సూరెన్స్‌.. బడ్జెట్‌ సమావేశాల్లో మార్పులు?

బీమా చట్టం-1938లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసే అవకాశం ఉంది. 2047 నాటికి అందరికీ బీమా అందించాలనే లక్ష్యంలో భాగంగానే సవరణలు తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాబోయే బడ్జెట్‌ సమావేశాల్లో సవరణ బిల్లు ప్రవేశపెట్టొచ్చని సమాచారం. ఈ బిల్లులో కాంపోజిట్‌ లైసెన్స్‌, ఇతర ఆర్థిక ఉత్పత్తులనూ పంపిణీ చేసేందుకు బీమా సంస్థలకు అనుమతి వంటి అంశాలు ఉండొచ్చని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.

గతాన్ని బీజేపీ మర్చిపోవాలి: చిదంబరం

గతాన్ని బీజేపీ మర్చిపోవాలి: చిదంబరం

దాదాపు 50ఏళ్ల క్రితం దేశంలో అత్యయిక స్థితిని విధించిన జూన్‌ 25వ తేదీని ‘రాజ్యాంగ హత్యా దినం’గా బీజేపీ ప్రకటించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం తప్పుబట్టారు. 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీ గురించి చర్చించడం ఏంటి. ఎమర్జెన్సీ విధించడం పొరపాటని అప్పట్లోనే దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అంగీకరించారు. ఎమర్జెన్సీని అంతసులువుగా విధించకుండా ఉండేందుకు రాజ్యాంగాన్ని సవరించాం. గతాన్ని బీజేపీ మర్చిపోవాలి’’అని పేర్కొన్నారు.

క్యాన్సర్‌తో పోరాడుతున్న మాజీ క్రికెటర్.. బీసీసీఐ సాయం

క్యాన్సర్‌తో పోరాడుతున్న మాజీ క్రికెటర్.. బీసీసీఐ సాయం

భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. బ్లడ్ క్యాన్సర్ బారిన పడిన అతను లండన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ మాజీ క్రికెటర్ చికిత్స కోసం బీసీసీఐ గొప్ప మనసును చాటుకుంది. అతని చికిత్స కోసం వెంటనే కోటి రూపాయలను విడుదల చేయాలని బీసీసీఐ సెక్రటరీ జై షా ఆదివారం సంబంధిత అధికారులను ఆదేశించారు.

కాల్పుల విరమణ చర్చల నుంచి వైదొలగిన హమాస్‌

కాల్పుల విరమణ చర్చల నుంచి వైదొలగిన హమాస్‌

గాజాలో శాంతి యత్నాలకు తీవ్రవిఘాతం ఏర్పడింది. కాల్పుల విరమణ చర్చల నుంచి వైదొలగుతున్నట్లు హమాస్ చీఫ్ ఇస్మాయిలీ హనియా ప్రకటించారు. శాంతి చర్చలపై ఇజ్రాయెల్‌ ఆసక్తిగా లేకపోవడం, నిరాయుధ పౌరులపై ఐడీఎఫ్‌ దాడులు చేయడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇస్మాయిలీ తెలిపారు.

తీవ్రవాదుల ఆకస్మిక దాడి.. సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి

తీవ్రవాదుల ఆకస్మిక దాడి.. సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి

మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. అనుమానిత తిరుగుబాటుదారుల దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్‌ మరణించాడు. జిరిబామ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అస్సాం సరిహద్దు జిల్లా ప్రాంతంలో పారామిలిటరీ సిబ్బంది, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా గస్తీ నిర్వహిస్తుండగా తీవ్రవాదులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ సంఘటనలో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మరణించగా, ఆ వాహనంలో ఉన్న ఇద్దరు పోలీస్‌ కమాండోలు గాయపడ్డారు.

తెలంగాణ మరో పదేళ్లు కాంగ్రెస్‌దే: సీఎం రేవంత్

తెలంగాణ మరో పదేళ్లు కాంగ్రెస్‌దే: సీఎం రేవంత్

తెలంగాణలో మరో పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పని అయిపోయింది అన్నవాళ్లు.. ఇప్పుడు వాళ్ల వైపు ఎంతమంది ఉన్నారని లెక్కపెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీఆర్ఎస్ కోరుకుంటే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్‌ను నిలబెట్టడానికి వస్తున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్‌పై సీఎం రేవంత్ విమర్శలు

కేసీఆర్‌పై సీఎం రేవంత్ విమర్శలు

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఓడిపోయి ఫామ్‌హౌస్‌లో ఉన్నోళ్లను నేను అడుగుతున్నా.. ఔటర్ రింగ్ రోడ్, ఫార్మా ఇండస్ట్రీ, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ తెచ్చింది కాంగ్రెస్ కాదా?. మీరేం తెచ్చారు… డ్రగ్స్, గంజాయి తప్ప. గత పదేళ్లకు తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు’’ అని పేర్కొన్నారు.

గౌడన్నల ఎక్స్‌గ్రేషియాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

గౌడన్నల ఎక్స్‌గ్రేషియాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

TG: గౌడన్నల ఎక్స్‌గ్రేషియాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పలువురు గీత కార్మికులకు ‘కాటమయ్య రక్ష కిట్ల’ను పంపిణీ చేశారు. అలాగే మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.7 కోట్ల 90 లక్షల గౌడన్నల ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

రూట్ మార్చిన జగన్‌.. రేప‌ట్నుంచి ప్ర‌జా ద‌ర్బార్‌..?

రూట్ మార్చిన జగన్‌.. రేప‌ట్నుంచి ప్ర‌జా ద‌ర్బార్‌..?

వైసీపీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్‌ ప్రజలతో మమేకమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశమైన ఆయన పార్టీ ఓటమి సంబంధించి నేతలకు భరోసాను కల్పించే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో రేప‌టి నుంచి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం జోరుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

హయత్‌నగర్‌ వరకు త్వరలోనే మెట్రో రైలు: రేవంత్‌రెడ్డి

హయత్‌నగర్‌ వరకు త్వరలోనే మెట్రో రైలు: రేవంత్‌రెడ్డి

గీత కార్మికులకు ‘కాటమయ్య రక్షణ’ కిట్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పేదలకు కూడా కార్పొరేట్‌ విద్య, వైద్యం అందాలని కాంగ్రెస్‌ ఆలోచించింది. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాలు తెచ్చాం. కాంగ్రెస్‌ చేపట్టిన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్‌ వల్ల రంగారెడ్డి జిల్లా భూముల విలువ పెరిగింది. హయత్‌నగర్‌ వరకు త్వరలోనే మెట్రోరైలు కూడా వస్తుంది’’అని తెలిపారు.

బీజేపీలో చేరిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి

బీజేపీలో చేరిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి

మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్య బీజేపీలో చేరారు. పదవీ విరమణ చేసిన మూడు నెలల తర్వాత ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. శనివారం భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాఘవేంద్ర శర్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. 2013 సెప్టెంబరు 12న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రోహిత్ ఆర్య నియమితులయ్యారు.