shape

technology ChotaNews

శ్రీశైలానికి రాత్రిళ్లూ మార్గం సుగమం

శ్రీశైలానికి రాత్రిళ్లూ మార్గం సుగమం

AP : శ్రీశైలంలో నేటి నుంచి 11వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. వీటిని వీక్షించేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నల్లమలలో రాత్రి వేళ వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నట్లు దోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు. చోదకులు పరిమిత వేగంతో, వన్యప్రాణులకు ఎలాంటి హాని కలగకుండా వాహనాలను నడపాలని ఆయన సూచించారు.

ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం 1 మార్చి 24

ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం 1 మార్చి 24

ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం 1 మార్చి 24

ఐరోపా లగ్జరీ బ్రాండ్లను విక్రయించనున్న ఆల్టెరో

ఐరోపా లగ్జరీ బ్రాండ్లను విక్రయించనున్న ఆల్టెరో

ఐరోపా లగ్జరీ బ్రాండ్ల ఫర్నిచర్‌ విక్రయాలు ప్రారంభించినట్లు ఆల్టెరో అనే సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌లోని కావూరిహిల్స్‌లో 12,000 చదరపు అడుగుల భవనంలో తొలి స్టోర్‌ను ప్రారంభించామని, రూ.5 లక్షల నుంచి రూ.5 కోట్ల విలువైన ఇటలీ, స్పెయిన్‌, పోర్చుగల్‌, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌ వంటి ఐరోపాదేశాల ప్రముఖ బ్రాండ్ల ఫర్నిచర్‌ను ఆర్డరుపై అందిస్తామని ఎండీ వివరించారు. దేశంలోని ప్రధాన నగరాల్లో స్టోర్లు ఏర్పాటు చేస్తామన్నారు.

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

ఖరీఫ్‌లో రూ.24,420 కోట్ల రాయితీ

ఖరీఫ్‌లో రూ.24,420 కోట్ల రాయితీ

రాబోయే ఖరీఫ్‌ సీజన్‌(ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్ 30)లో ఎరువులపై రూ.24,420 కోట్ల రాయితీని భరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులు ఎప్పటిలాగే రూ.1,350 ధరకే 50 కిలోల DAPని పొందవచ్చని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎరువుల విభాగం చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అలాగే దేశంలో కొత్తగా మూడు సెమీ–కండక్టర్ల తయారీ యూనిట్ల స్థాపనకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

ఉద్యోగుల ప్రశంసా  దినోత్సవం 1 మార్చి 24

ఉద్యోగుల ప్రశంసా దినోత్సవం 1 మార్చి 24

ఉద్యోగుల ప్రశంసా దినోత్సవం 1 మార్చి 24

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి రూ.62,820గా ఉండగా.. అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర సైతం రూ.10 తగ్గి రూ.57,580గా నమోదైంది. ఇక వెండి ధ‌ర‌ మాత్రం రూ.100 పెరిగి కేజీ రూ.75,800గా పలుకుతోంది. ఇవే ధరలు హైదరాబాద్‌, విశాఖ, విజయవాడలోనూ కొనసాగుతున్నాయి.

నేటి నుంచి MSMEల సర్వే

నేటి నుంచి MSMEల సర్వే

AP : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) పనితీరును మెరుగుపరిచేలా ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో కేంద్ర ప్రభుత్వ ర్యాంప్‌ పథకం కింద శుక్రవారం నుంచి సర్వే నిర్వహించనున్నట్లు MSME డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ తెలిపింది. రాష్ట్రంలోని తయారీ, సేవ, వాణిజ్య రంగాల్లోని అన్ని MSMEలను ఈ సర్వే ద్వారా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకువచ్చి AP MSME వన్‌ పోర్టల్‌కు అనుసంధానిస్తామని పేర్కొంది.

APలో పెరిగిన చిరుతల సంఖ్య

APలో పెరిగిన చిరుతల సంఖ్య

దేశవ్యాప్తంగా 13,874 చిరుతలున్నట్లు కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ విడుదల చేసిన నివేదిక వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 569, తెలంగాణలో 297 చొప్పున ఉన్నాయి. 2018 లెక్కలతో పోలిస్తే APలో చిరుతల సంఖ్య 15.65శాతం పెరగ్గా, తెలంగాణలో 11.07శాతం తగ్గింది. APలోని నాగార్జునసాగర్‌- శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ (270), తెలంగాణలోని ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో 121లో చిరుత పులులు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి.

తిరుమలలో భక్తుల రద్దీ ఇలా..

తిరుమలలో భక్తుల రద్దీ ఇలా..

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. గురువారం స్వామి వారిని 57,338 మంది భక్తులు దర్శించుకోగా.. 19,852 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.4.67 కోట్లు ఆదాయం వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది.

వరసిద్ధుడికి విరాళంగా 6 కిలోల బంగారం

వరసిద్ధుడికి విరాళంగా 6 కిలోల బంగారం

AP : చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని అంతరాలయానికి సుమారు రూ.5కోట్ల విరాళంతో బంగారు వాకిలి ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. దానికి అవసరమైన ఆరు కిలోల బంగారాన్ని ఆలయ పునర్నిర్మాణ దాతలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్‌లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. గురువారం ఆ బంగారాన్ని స్వామివారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.

నేడు తిరుపతిలో కాంగ్రెస్ సభ

నేడు తిరుపతిలో కాంగ్రెస్ సభ

AP: నేడు తిరుపతిలోని తారాక రామ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సచిన్ పైలెట్ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ సభకు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో పాటు రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రధాని మోదీ ఇచ్చిన హామీని ఈ సభ నుంచి ప్రశ్నించనున్నారు.

వేదాంతా గ్రూప్‌ పిటిషన్‌ కొట్టివేత

వేదాంతా గ్రూప్‌ పిటిషన్‌ కొట్టివేత

తమిళనాడులోని తూత్తుకుడిలో తమ రాగి స్మెల్టింగ్‌ ప్లాంటును మూసివేయడాన్ని వ్యతిరేకిస్తూ వేదాంతా గ్రూప్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ ప్లాంటు వల్ల కాలుష్యం ఏర్పడిందని ఆరోపిస్తూ చేపట్టిన నిరసనను అణిచివేసేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది మరణించారు. దీంతో 2018 మే నుంచి ప్లాంట్‌ను మూసివేశారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమాన్ని కాపాడటం ముఖ్యమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

IT కారిడార్‌లను కలుపుతూ MMTSలు

IT కారిడార్‌లను కలుపుతూ MMTSలు

HYD : MMTS రెండోదశ పూర్తయ్యింది. నగరానికి తూర్పు, పడమరలో ఉన్న IT కారిడార్‌లను కలుపుతూ లింగంపల్లి-ఘట్‌కేసర్‌ మధ్య MMTS పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్‌ను బైపాస్‌ చేస్తూ లింగంపల్లి-సనత్‌నగర్‌-మౌలాలి-చర్లపల్లి-ఘట్‌కేసర్‌ మార్గంలో ఈ రైళ్లు సాగనున్నాయి. మార్చి నాలుగైదు తేదీల్లో ఏదో ఒకరోజు ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. కాలుష్యం లేని, వేగవంతమైన ప్రజారవాణా నగర ప్రజలకు కేవలం రూ. 5ల టిక్కెట్‌ ధరతో దక్కనుంది.

తెలంగాణకి 2 పర్యాటక ప్రాజెక్టులు!

తెలంగాణకి 2 పర్యాటక ప్రాజెక్టులు!

TG : రాష్ట్రానికి కేంద్రం నుంచి రెండు పర్యాటక ప్రాజెక్టులు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి ఐదింటిని ప్రతిపాదించగా రెండుప్రాజెక్టులు తుది పరిశీలనలో ఉన్నాయి. వీటికి సూత్రప్రాయంగా ఆమోదం లభించిందని త్వరలోనే ప్రకటన వస్తుందని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ వర్గాలు తెలిపాయి. కల్చర్‌-హెరిటేజ్‌ గమ్యస్థానాల్లో నల్గొండజిల్లాలో నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం, ప్రకృతి పర్యాటకం గమ్యస్థానాల్లో కామారెడ్డిజిల్లా బాన్సువాడలోని కల్కి చెరువు షార్ట్‌లిస్టులో ఉన్నాయి.

భారీ అగ్నిప్రమాదం.. 44 మంది మృతి

భారీ అగ్నిప్రమాదం.. 44 మంది మృతి

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏడు అంతస్తుల రెస్టారంట్‌లో మంటలు చెలరేగి 44 మంది మృతి చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది 75 మందిని రక్షించారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్లే మంటలు చెలరేగినట్లు గుర్తించారు.

హైదరాబాద్‌లో అత్యధికం.. పెద్దపల్లిలో అతి తక్కువ

హైదరాబాద్‌లో అత్యధికం.. పెద్దపల్లిలో అతి తక్కువ

HYD : జిల్లాలవారీగా చూస్తే హైదరాబాద్‌లో అత్యధికంగా 878 DSC పోస్టులు భర్తీ చేయనున్నారు. అత్యల్పంగా పెద్దపల్లిలో 93 మాత్రమే ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు గరిష్ఠంగా ఖమ్మం జిల్లాలో 176 ఉండగా.. కనిష్ఠంగా మేడ్చల్‌లో 26 పోస్టులు ఉన్నాయి. ఇక SGT పోస్టుల విషయానికి వస్తే అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 537, అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 21 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

నేటి నుంచి పెండింగ్‌ దరఖాస్తులపై స్పెషల్‌ డ్రైవ్‌

నేటి నుంచి పెండింగ్‌ దరఖాస్తులపై స్పెషల్‌ డ్రైవ్‌

HYD: ధరణిలోని అపరిష్కృత దరఖాస్తులకు మోక్షం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజనతోపాటు మండలస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. శుక్రవారం(మార్చి 1)నుంచి తొమ్మిదో తేదీలోపు పెండింగ్‌ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనుంది.అన్ని స్థాయుల్లో విచారణలు, దస్త్రాల పరిశీలన చేపట్టాలని, వాటి వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌(CCLA)నవీన్‌ మిత్తల్‌ ఆదేశించారు.

ట్రాక్టర్‌-కారు ఢీ.. ముగ్గురు మృతి

ట్రాక్టర్‌-కారు ఢీ.. ముగ్గురు మృతి

AP: గుంటూరు జిల్లా ఏటుకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉంది. మృతులంతా మంగళగిరికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ప్రత్తిపాటి శరత్‌కు 14 రోజుల రిమాండ్‌

ప్రత్తిపాటి శరత్‌కు 14 రోజుల రిమాండ్‌

AP: టీడీపీ మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. జీఎస్టీ ఎగవేత, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలపై శరత్‌ను పోలీసులు గురువారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. అనంతరం క్రీస్తు రాజపురంలోని ఒకటో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు జడ్జి ముందు హాజరుపరచగా.. శరత్‌కు 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్ విధించారు.

H1B రిజిస్ట్రేషన్‌కు కొత్త విధానం

H1B రిజిస్ట్రేషన్‌కు కొత్త విధానం

హెచ్‌1బీ రిజిస్ట్రేషన్స్‌, పిటిషన్స్‌కి సంబంధించి అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. మైయూఎస్‌సీఐఎస్‌ పేరిట ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా సంస్థలు, వారి ప్రతినిధులు వీసా దరఖాస్తు ప్రక్రియలో సమర్థంగా భాగస్వామ్యమయ్యేందుకు వీలవుతుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌1బీ పిటిషన్స్‌ దాఖలు చేసే సంస్థలు మైయూఎస్‌సీఐఎస్‌లో ఆర్గనైజేషనల్‌ ఖాతా క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

నేడు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పాలమూరు ప్రాజెక్టు సందర్శన

నేడు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పాలమూరు ప్రాజెక్టు సందర్శన

TG: ఓవైపు బీఆర్‌ఎస్‌ నేతలు మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్న క్రమంలో.. మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సందర్శించబోతున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చలో పాలమూరు రంగారెడ్డి పర్యటనకు కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు.

మేడారం జాతర.. ఆర్టీసీ బస్సుల్లో 20 లక్షల మంది ప్రయాణం

మేడారం జాతర.. ఆర్టీసీ బస్సుల్లో 20 లక్షల మంది ప్రయాణం

TG: మేడారం జాతర సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ దాదాపు 4 వేల ప్రత్యేక బస్సుల్ని నడిపించింది. సుమారు 20 లక్షల మంది భక్తులు వాటిలో ప్రయాణించారు. ప్రయాణికుల్ని సురక్షితంగా తీసుకెళ్లడంలో సిబ్బంది అందించిన సేవలకు నగదు అవార్డు ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. ఒక్కో డ్రైవర్‌, ఎస్‌డీఐకి రూ.1,000, కండక్టర్లు, మెకానిక్‌లు, శ్రామికులు, ఆర్జిజన్లు, క్లర్కులకు రూ.500 చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వనున్నారు.

నేడు మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ బృందం

నేడు మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ బృందం

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. అందులో భాగంగా బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల బృందం శుక్రవారం మేడిగడ్డను సందర్శించనుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200 మంది ప్రతినిధి బృందంతో బ్యారేజీని సందర్శించనుంది.

నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

AP: శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈనెల 11 వరకు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 8.10 గంటలకు ఆలయ ఛైర్మన్‌ చక్రపాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. శివదీక్షధారులకు ఈనెల 5 వరకు విడతల వారిగా స్వామి స్పర్శ దర్శనం కల్పించనున్నారు.

MYSTERY: నిర్మానుష్యంగా మారిన ఐలాండ్

MYSTERY: నిర్మానుష్యంగా మారిన ఐలాండ్

ఒకప్పుడు జపాన్‌లోని ఐలాండ్ ప్రాంతంలో అత్యధిక జనాభా ఉండేది. ఇప్పుడు ఆ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. అందుకు గల కారణాలు పై వీడియో చూసి తెలుసుకోండి.

స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఉంటే.. ఇది మీ కోసమే!

స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఉంటే.. ఇది మీ కోసమే!

స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఉంటే.. ఇది మీ కోసమే!

చిన్నారులను ఎండ నుంచి కాపాడడం ఎలా..

చిన్నారులను ఎండ నుంచి కాపాడడం ఎలా..

చిన్నారులను ఎండ నుంచి కాపాడడం ఎలా..

నేటి నుంచి ఏపీలో ఇంటర్‌ పరీక్షలు

నేటి నుంచి ఏపీలో ఇంటర్‌ పరీక్షలు

ఏపీలో శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 4,73,058 మంది పరీక్షకు హాజరుకానున్నారు. ద్వితీయ సంవత్సరానికి చెందిన 4,88,881 మంది పరీక్ష రాయనున్నారు. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి రెండేళ్లకు కలిపి 90,282 మంది పరీక్షలకు హాజరుకానున్నారు.

నేడు విద్యాదీవెన నిధుల విడుదల

నేడు విద్యాదీవెన నిధుల విడుదల

AP: సీఎం జగన్ శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో పర్యటించనున్నారు. విద్యాదీవెన కింద అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 9.44 లక్షల మంది విద్యార్థులకు రూ.708.68కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్‌ నిధులను సీఎం జగన్‌ బటన్‌ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15,000, డిగ్రీ, మెడిసిన్ సహా ఇతర ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు రూ.20,000 సాయం అందిస్తోంది.

6న ఏపీ కేబినెట్ సమావేశం

6న ఏపీ కేబినెట్ సమావేశం

ఈనెల 6న ఏపీ కేబినెట్ భేటీ జరుగనుంది. సాధారణ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఇది కేబినెట్ చివరి భేటీగా భావిస్తున్నారు. అలాగే ఎన్నికల షెడ్యూలు వచ్చేలోగా మార్చి నెలకు సంబంధించిన వివిధ పథకాలకు కేబినెట్ ఆమోదం లభిస్తే వాటిని కొనసాగించేందుకు వీలు ఉంటుందనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

సాగర్‌ నుంచి ఏపీకి 3 టీఎంసీలు

సాగర్‌ నుంచి ఏపీకి 3 టీఎంసీలు

TG: నాగార్జునసాగర్‌ నుంచి ఏపీకి 3 TMCల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఉత్తర్వులు జారీచేసింది. శుక్రవారం ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో సాగర్ కుడికాలువ హెడ్‌రెగ్యులేటరీ ద్వారా ఏపీకి 3 TMCల నీటిని విడుదల చేయనున్నారు. మార్చి నెలకు సంబంధించి సాగర్‌ కుడికాలువ ద్వారా 3 TMCలు, ఏప్రిల్‌కు సంబంధించి 5 TMCలను విడుదల చేయాలని ఏపీ ఇప్పటికే బోర్డుకు లేఖ రాసింది.

నిజం తెలియాలనే అలా చేశా: హనుమ విహారి

నిజం తెలియాలనే అలా చేశా: హనుమ విహారి

ఏ తప్పు చేయకపోయినా తనను ఆంధ్రా జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించారని సీనియర్ క్రికెటర్ హనుమ విహారి ఆరోపించారు.‘‘టీమ్‌లో 17వ ప్లేయర్‌గా ఉన్న వ్యక్తి..రూల్స్ ప్రకారం డ్రెస్సింగ్ రూమ్‌కి రాకూడదు. కానీ అతడు వచ్చాడు. దీని గురించి వారించినందుకు అతడు, అతడి తండ్రి.. నేనే తప్పు చేసినట్లుగా చిత్రీకరించారు. ప్రజలకు నిజం తెలియాలనే దీనిపై పోస్ట్ పెట్టాను’’అని ఓ ఇంటర్వ్యూలో హనుమ చెప్పారు.

చేప కొంచెం.. కూత ఘనం

చేప కొంచెం.. కూత ఘనం

ప్రపంచంలోనే అత్యంత చిన్న చేప అయిన డానియనెల్లా సెరెబ్రం.. మయన్మార్‌ నీళ్లలో కనిపించే ఈ చేప కూత పెడితే చెవులు చిల్లులు పడాల్సిందే. శబ్దాల్ని చేయటంలో ఇది ప్రత్యేకతను కలిగి ఉందని బెర్లిన్‌కు చెందిన చారైట్‌ యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. ఈ చేపలు 140 డెసిబుల్స్‌ వరకు శబ్దం చేయగలవని, అంబులెన్స్‌ సైరన్‌, డ్రిల్లింగ్‌ మిషన్‌ శబ్దానికి ఇది సమానంగా ఉంటుందని చెప్పారు.