shape

Telangana ChotaNews

Blog Image

రిగ్గింగ్‌కు పాల్ప‌డుతున్న BJP : TMC

BJP రిగ్గింగ్‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేస్తూ BJP ఓట్ల‌ను సొంతం చేసుకుంటున్న‌ట్లు TMC పేర్కొన్న‌ది. ఆ ఆరోప‌ణ‌ల‌కు చెందిన EVM ఫోటోల‌ను కూడా TMC షేర్ చేసింది. త‌న ఎక్స్ అకౌంట్‌లో ఆ పార్టీ ఫోటోల‌ను పోస్టు చేసింది. బంకుర‌లోని ర‌ఘునాథ‌పుర్‌లో జ‌రిగిన రిగ్గింగ్‌కు చెందిన ఫోటోల‌ను పోస్టు చేశారు.

Blog Image

వైసీపీ ఓడితే.. జగన్‌ అసెంబ్లీకి రాడు: రఘురామ

AP: టీడీపీ నేత రఘురామకృష్ణం రాజు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓడితే… జగన్‌ అసెంబ్లీకి రాడంటూ వ్యాఖ్యానించారు. ‘‘నాకు తెలిసి జగన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కాలేడు పెట్టడు. ఆయన స్వభావం నాకు తెలుసు. అవమానాన్ని తట్టుకోలేరు. అసెంబ్లీకి అయితే ఆయన రాడు” అని రఘురామకృష్ణ తెలిపారు.

Blog Image

హజ్ యాత్రకు సిద్ధమైన ముస్లింలు !

AP: రాష్ట్రవ్యాప్తంగా 692 మంది ముస్లిములు హజ్ యాత్రకు వెళ్తున్నట్లు వక్ఫ్ బోర్డు సీఈవో అబ్దుల్ ఖదీర్ తెలిపారు. ఈ నెల 27న విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి 322 మంది, 28న 322 మంది, 29న 48 మంది చొప్పున ప్రత్యేక విమానాల్లో హజ్ యాత్రకు వెళ్లనున్నారని పేర్కొన్నారు. ప్రయాణానికి 6 గంటల ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలని ఖదీర్ సూచనలు చేశారు.

Blog Image

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

Blog Image

IPLఫైనల్స్: టీమిండియా నుంచి ఒక్కరూ లేరు!

రేపు జరిగే IPL-2024 ఫైనల్‌లో కోల్‌కతాతో హైదరాబాద్‌ తలపడనుంది. అయితే ఈ టోర్నీ మొత్తం అదరగొట్టి ఫైనల్స్‌కు చేరిన ఇరు జట్లలో టీ20 వరల్డ్‌కప్‌కు వెళ్లే భారత జట్టులోని 15 మందిలో ఒక్క ప్లేయర్ లేరు. ఈ విషయాన్ని నెటిజన్లు సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ యంగ్ ప్లేయర్లను ప్రశంసిస్తున్నారు. రోహిత్ శర్మ, కోహ్లీ, పాండ్య, సూర్యకుమార్, బుమ్రా ఉన్న జట్లు లీగ్, ప్లేఆఫ్స్‌‌లోనే వెనుదిరిగాయి.

Blog Image

రేవ్‌ పార్టీ.. ముగ్గురు పోలీసులపై వేటు

బెంగళూరు రేవ్‌ పార్టీ వ్యవహారం పోలీస్‌ శాఖలోనూ కలకలం రేపుతోంది. రేవ్‌ పార్టీ కొనసాగుతున్నా కనీస సమాచారాన్ని సేకరించలేక పోయారంటూ హెబ్బగూడి పోలీస్‌స్టేషన్ ఏఎస్‌ఐతో పాటు ముగ్గురిని బెంగళూరు రూరల్ జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి సస్పెండ్‌ చేశారు. గూఢచారి విభాగం కానిస్టేబుల్‌ ఎస్‌బీ గిరీశ్, ఏఎస్‌ఐ నారాయణస్వామి, ఆ ప్రాంత గస్తీ కానిస్టేబుల్‌ దేవరాజుపై సస్పెసన్ వేటు పడింది.

Blog Image

ఈస్ట్‌ ఢిల్లీలో ఓటేసిన ‌ గౌతమ్‌ గంబీర్‌

టీమిండియా మాజీ క్రికెటర్‌, ఈస్ట్‌ ఢిల్లీ సిట్టింగ్‌ ఎంపీ గౌతమ్‌ గంబీర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం గంబీర్‌.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు అనేది ప్రజల శక్తి అని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్ల BJP పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని గంబీర్‌ చెప్పారు.

Blog Image

హైదరాబాద్‌ ఆనందం.. రాజస్థాన్‌ నిరాశ.. ఒకే ఫ్రేమ్‌లో

రాజస్థాన్‌పై రెండో క్వాలిఫయర్‌ 2లో అద్భుత విజయంతో హైదరాబాద్‌ ఫైనల్‌కు చేరుకుంది. దీంతో హైదరాబాద్‌ జట్టు సభ్యులు ఆనందంతో. రాజస్థాన్‌ ఆటగాళ్లు నిరాశలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. కాగా ఐపీఎల్‌ తుది పోరులో ఆదివారం కోల్‌కతాను హైదరాబాద్ ఢీకొట్టనుంది.

Blog Image

ట్రెండ్‌ తెలియాలంటే.. నిరీక్షించాల్సిందే!

AP : కౌంటింగ్ నాడు ట్రెండ్‌ తెలియాలంటే నిరీక్షించాల్సిందే. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ కవర్‌ తెరిచి ఏజెంట్లకు చూపించి ఆ ఓటు అర్హమైనదో కాదో గుర్తించాలి. కవర్‌‘A’తో పాటు ఓటరు డిక్లరేషన్‌ ఫారం విడిగా లేకుంటే పరిగణలోకి తీసుకోరు. గెజిటెడ్‌ అధికారి సంతకం లేకపోయినా ఆ ఓటును పరిగణించరు. 2019ఎన్నికల్లో 56వేల పోస్టల్‌ బ్యా­లెట్లు చెల్లకుండా పోయాయి.

Blog Image

బంగ్లా ఎంపీని హనీ ట్రాప్ చేసింది ఈమెనే!

చికిత్స కోసం భారత్‌కు వచ్చి దారుణంగా హత్యకు గురైన బంగ్లాదేశ్‌ ఎంపీ మహమ్మద్‌ అన్వరుల్‌ అజీమ్‌ అన్వర్‌ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆయన హత్యలో బంగ్లా మోడల్ శిలాస్తి రెహమాన్ కీలక పాత్ర పోషించారు. MPని అపార్ట్‌మెంట్‌కు రప్పించేందుకు హనీ ట్రాప్ చేశారు. ఇంట్లోకి రాగానే గొంతు నులిమి చంపారు. ఈ కేసులో శిలాస్తిని ఢాకా పోలీసులు అరెస్ట్ చేశారు.

Blog Image

బెంగళూరులోనే రేవ్ పార్టీలు ఎందుకంటే?

బెంగళూరులో రేవ్‌పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. సినీ, వ్యాపార, రాజకీయ వర్గాలకు చెందిన ఎంతోమంది ఆ వేడుకలో పాల్గొన్నట్టు పోలీసులు నిర్దారించారు. గతంలో హైదరాబాద్‌లోనే ఎక్కువ రేవ్ పార్టీలు జరిగేవి. అయితే హైదరాబాద్‌ల్లో పోలీసుల నిఘా ఉండటంతో ఈవెంట్‌ నిర్వాహకులు రూటు మార్చారు. తెలుగు రాష్ట్రాలకు దగ్గరగా ఉన్న బెంగళూరును అడ్డాగా మార్చుకొని రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు.

Blog Image

పాట్ కమిన్స్ అరుదైన రికార్డు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్ పాట్ కమిన్స్ అరుదైన రికార్డు సాధించాడు. ఒకే ఐపీఎల్‌ సీజన్‌లో కెప్టెన్‌గా అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడు పాట్ కమిన్స్ నిలిచాడు. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ఇప్పటికి 17 వికెట్లు తీశాడు. 2008లో రాజస్థాన్‌ సారథిగా షేన్ వార్న్ (19) వికెట్లు తీశాడు.. మరో రెండు వికెట్లు తీస్తే వార్న్‌ను కమిన్స్ అధిగమిస్తాడు.

Blog Image

పుణె యాక్సిడెంట్ కేసులో ఇద్దరు పోలీసులపై వేటు

పుణె యాక్సిడెంట్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. యాక్సిడెంట్ విషయం గురించి పైఅధికారులకు సమాయానికి సమాచారం అందించని యరవాడ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ రాహుల్ జగ్దలే, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్ తోడ్కరీపై సస్పెన్షన్ వేటు పడింది. పుణెలోని కమలానగర్‌లో ఓ టీనేజర్ తన తండ్రి కారుతో ఢీకొట్టడంతో ఇద్దరు టెకీలు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

Blog Image

మదనపల్లిలో వ్యక్తి దారుణహత్య

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లి శ్రీవారి నగర్‌లో శేషాద్రి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం తెల్లవారుజామున శేషాద్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హత్యకు వ్యక్తిగత గొడవలా? లేదంటే రాజకీయ కక్షలు కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Blog Image

హైటెన్షన్ వైర్లు తగిలి అపస్మారక స్థితిలో బాలిక

HYD: రహమత్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మేడపై ఆడుకుంటున్న ఓ బాలికకు హైటెన్షన్ కరెంట్ వైర్లు తాకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఎంతసేపటికి బాలిక మేడపై నుంచి కిందకి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా బాలిక సగం కాలిన శరీరంతో కనిపించింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలికకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Blog Image

ఫ్రెంచ్ ఓపెన్‌కు సర్వం సిద్ధం

ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌ ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. తొలి పోరులో 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించిన స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్.. జర్మనీకి చెందిన నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్‌తో తలపడనున్నాడు. మరోవైపు ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌లు నొవాక్ జకోవిచ్ (సెర్బియా), ఇగా స్వియాటెక్ (పోలండ్)లు టాప్‌సీడ్‌లుగా బరిలోకి దిగనున్నారు.

Blog Image

IPL:హైదరాబాద్‌ ఫ్రాంఛైజీకి కలిసొస్తున్న ఆసీస్ ఆటగాళ్లు

ఐపీఎల్‌ ఫైనల్‌ చేరడం హైదరాబాద్‌ ఫ్రాంఛైజీకి ఇది నాలుగోసారి. 2009, 2016లో టైటిల్‌ గెలిచిన ఆ జట్టు 2018లో ఫైనల్లో ఓడింది. అయితే ఇందులో మూడు సందర్భాల్లో ఆస్ట్రేలియా క్రికెటరే హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌‌గా ఉన్నారు. ఇంతకుముందు గిల్‌క్రిస్ట్‌ (డెక్కన్‌ ఛార్జర్స్- 2009), వార్నర్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్-2016) కెప్టెన్లుగా ఉన్నారు. ఇప్పుడు కమిన్స్‌ జట్టుకు సారథి.

Blog Image

‘RRR నార్త్’ అంచనా వ్యయం ఎంతంటే

HYD: భూసేకరణ వ్యవహారం కొలిక్కి రాకుండానే రీజినల్ రింగ్ రోడ్డు(RRR) అంచనా వ్యయం భారీగా పెరుగుతోంది. RRR నార్త్ భాగంలో 158KM మార్గం నిర్మాణానికి రూ.9,164 కోట్లు ఖర్చవుతుందని 2021లో అంచనా వేశారు. తాజాగా ఆ మొత్తం రూ.15,000కోట్లకు చేరినట్లు అధికారులు తెలిపారు. భూ విలువలు, సిమెంటు, స్టీలు ధరలు పెరగడమే కారణమని చెబుతున్నారు. ఐదారు నెలల్లో భూసేకరణ కొలిక్కి వస్తుందని పేర్కొంటున్నారు.

Blog Image

‘ఇంపాక్ట్‌’ అదిరింది

IPL-2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫైనల్‌కు చేరడంలో షాబాజ్‌ అహ్మద్‌ కీలక పాత్ర పోషించాడు. రాజస్థాన్‌తో జరిగిన కీలకమైన రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన షాబాజ్‌ మూడు వికెట్లు పడగొట్టి రాజస్థాన్‌ను గట్టి దెబ్బ తీశాడు. జోరు మీదున్న యశస్వీ జైస్వాల్‌తో పాటు రియాన్ పరాగ్, అశ్విన్‌లను పెవిలియన్ పంపి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచారు.

Blog Image

మెంతి నీరు.. ఆరోగ్య ప్రయోజనాలు

రోజూ ఖాళీ కడుపుతో మెంతి నీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మెంతుల్లో ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్, కాపర్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ ఎ, బి6, సి, కె వంటి పోషకాలు ఉంటాయి. దీని వల్ల జీవక్రియ పెరుగుతుంది. జీర్ణక్రియ మరియు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది.

Blog Image

భారీగా షాక్ ఇచ్చిన గ్రాడ్యుయేట్లు

TG : వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్స్ MLC ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది. 2021 MLC ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్లు 5,05,565 ఉండేవి. కానీ ఈనెల 27న జరగనున్న MLC ఉప ఎన్నికల్లో 4,63,836 ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుమారు 41,729 ఓటర్ల సంఖ్య తగ్గినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Blog Image

పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదు

AP: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈనెల 13న పాల్వాయి గేటులోని పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్నందుకు తనపై పిన్నెల్లి దాడి చేశాడని టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు రెంటచింతల పోలీసులు తెలిపారు. దీంతో పిన్నెల్లిపై 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Blog Image

ఎన్‌టీపీసీ లాభం 6,490 కోట్లు

విద్యుత్‌ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్‌టీపీసీ గత త్రైమాసికానికిగాను రూ.6,490.05 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.4,871.55 కోట్ల లాభంతో పోలిస్తే 33 శాతం ఎగబాకింది. ఏడాది క్రితం రూ.44,744.96 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన సంస్థ, గత త్రైమాసికానికిగాను రూ.48,816.55 కోట్లకు ఎగబాకింది.

Blog Image

ఎంఎన్‌జేలో ట్విన్‌ టవర్లు

HYD : నగరంలోని ప్రభుత్వ క్యాన్సర్‌ ఆసుపత్రి MNJ ను విస్తరించనున్నారు. ప్రస్తుత ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న స్థలంలో ట్విన్‌ టవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంచేశారు. మొత్తం రూ.110 కోట్లతో కొత్త భవనాలు నిర్మించనున్నారు. ఫలితంగా అదనంగా 500 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో 750 పడకలున్నాయి. ఏటేటా రోగుల సంఖ్య పెరుగుతోంది. MNJలో అధునాతన సేవలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.

Blog Image

ఖరీఫ్‌కు కొత్త వరి వంగడాలు సిద్ధం

AP: ఖరీఫ్‌ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో పంట తెగుళ్లు, వైపరీత్యాలను ఎదురొడ్డి నిలిచే ఆధునిక వంగడాల సాగు ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని నిపుణులు తెలిపారు. రాష్ట్రంలో సుమారు 300 వరి రకాలు సాగుచేస్తున్నప్పటికీ బీపీటీ 5204, ఎన్‌డీఎల్‌ఆర్‌ 7, స్వర్ణ, పీఏపీఎల్‌ 1100, ఆర్‌జీఎల్‌ 2537 వంటి కొన్ని రకాలు మాత్రమే తినడానికి అనువుగా ఉన్నాయని సూచించారు.

Blog Image

వెల్జాల్‌ సహదేవి సముద్రం చెరువులో భారీ చేప

TG : రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్‌ గ్రామంలోని సహదేవి సముద్రం చెరువులో శుక్రవారం భారీ మీనం మత్స్యకారుల వలకు చిక్కింది. ఇరవై కిలోల బరువున్న చేపలు ఎక్కువ సంఖ్యలో వలకు చిక్కడంతో మత్స్యకారులు సంబరపడ్డారు. పాతికేళ్ల తర్వాత చెరువులో 20 కిలోల వరకు బరువున్న చేపలు లభ్యమవుతున్నాయని మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు బాలకిష్టయ్య తెలిపారు.

Blog Image

భూ సర్వేపై కదలిక

HYD : రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వేపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకు సర్వే సెటిల్మెంట్‌ ల్యాండ్‌ రికార్డు కమిషనర్‌ కార్యాలయం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో భూ సర్వే చేపట్టి భూ రికార్డులను అప్‌డేట్‌ చేసేందుకు DILRMP(డిజిటల్‌ ఇండియా ల్యాండ్‌ రికార్డు మోడ్రనైజేషన్‌) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

Blog Image

నేడో, రేపో ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌?

TG: సీఎం రేవంత్‌రెడ్డి నేడో, రేపో ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీని ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. సీఎంతో పాటు కొందరు మంత్రులు కూడా హస్తినకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి విగ్రహాలను కూడా సీఎం ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే.

Blog Image

రియల్‌మీ 12 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్

ఈ ఏడాది మార్కెట్‌లో విడుదలైన రియల్‌మీ 12 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌పై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మూడు స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తుంది.. వీటి ధరలు వరుసగా రూ. 29,999, రూ.31,999, రూ.33,999గా ఉన్నాయి. ఫోను కొనుగోలుపై రూ.3,000 వరకు బ్యాంక్ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.అదనంగా రూ.3,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది.

Blog Image

బీహార్‌లో కుల సమీక‘రణం’!

ఆరోదశలో బీహార్‌లోని 8 కీలక పార్లమెంటు స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 86మంది పోటీలో ఉన్నారు. మొత్తం కోటిన్నర మంది ఓటర్లు వీరి భవితవ్యం తేల్చనున్నారు. ప్రధాన పార్టీలైన JDU, RJDలు కుల సమీకరణలకు, ఆర్థిక బలానికి ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. మొత్తం 8 స్థానాల్లో సీఎం నితీశ్‌ నేతృత్వంలోని JDU నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది.

Blog Image

కర్నాల్‌లో ఓటేసిన హర్యానా మాజీ సీఎం

హర్యానా మాజీ సీఎం, బీజేపీ సీనియర్‌ నేత మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హర్యానా రాష్ట్రం కర్నాల్‌ లోక్‌సభ స్థానంలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు వేశారు. ఖట్టర్‌ కర్నాల్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మనోహర్‌లాల్‌ ఖట్టర్‌పై కాంగ్రెస్‌ పార్టీ కర్నాల్‌ లోక్‌సభ స్థానంలో దివ్యాన్షు బుధిరాజాను పోటీకి దింపింది.

Blog Image

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి, రూ.72,430గా నమోదు కాగా.. అదే స‌మ‌యంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి, రూ.66,390గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు తగ్గుదల నమోదయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.96,400గా కొనసాగుతోంది.

Blog Image

6వ విడత బరిలో ఉన్న ప్రముఖులు వీరే

దేశవ్యాప్తంగా 6వ విడత పోలింగ్ ప్రారంభం అయింది. ఈ విడతలో పోటీ చేస్తున్న ప్రముఖుల్లో మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్, మేనకా గాంధీ, మనోహర్ లాల్ ఖట్టర్, అభిజీత్ గంగోపాధ్యాయ, మెహబూబా ముఫ్తీ, నవీన్ జిందాల్, రావ్ ఇంద్రజీత్ సింగ్, రాజ్ బబ్బర్, సంబిత్ పాత్ర, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు ఉన్నారు. జూన్ 1న జరిగే ఆఖరిదశ పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగిస్తుంది.

Blog Image

కోల్‌కతా జట్టులో వెలుగులు నింపిన శ్రేయస్‌ అయ్యర్

ఐపీఎల్‌లో కోల్‌కతా పేరు చెప్పగానే అందరికి గుర్తుకు వచ్చేది శ్రేయస్‌ అయ్యరే. ఐపీఎల్‌-17లో తిరిగి జట్టు పగ్గాలు చేపట్టిన శ్రేయస్‌ జట్టును ముందుకు నడిపించడంతో కోల్‌కతాకు ప్లస్‌ అయింది. బలమైన జట్లను మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వాలిఫయర్‌-1లో పటిష్టమైన సన్‌రైజర్‌ హైదరాబాద్‌ కోల్‌కతా ధాటికి నిలవలేకపోయింది. ఈసారి శ్రేయస్‌ సేన కప్‌ సాధిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.