shape

Andhra Pradesh ChotaNews

Blog Image

15 వేల ఉద్యోగాలు.. నెలకు రూ.2లక్షల జీతం

యుద్ధం కారణంగా కార్మికుల కొరత ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌.. భారత్‌ నుంచి వేల సంఖ్యలో నియామకాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా మరోసారి వేల సంఖ్యలో కార్మికులను నియమించుకునేందుకు భారత్‌ను ఇటీవల సంప్రదించిందని నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. 15వేల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ ఉద్యోగానికి నెల‌కు రూ.1.92 లక్షల జీతంతోపాటు బీమా, ఆహారం, వసతి కల్పిస్తారు.

Blog Image

చర్చలకు పిలిచిన దీదీ..!

కోల్‌కతా హత్యాచార ఘటనపై బెంగాల్‌ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసన చేస్తున్న వైద్యులు మంగళవారం సాయంత్రంలోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినా.. బాధితురాలికి న్యాయం జరిగే వరకు విధుల్లో చేరే ప్రసక్తే లేదని వైద్యులు తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే నెల రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించేలా చర్చలకు రావాల్సిందిగా బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వైద్యులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

Blog Image

ఒడిశాకు మూడు కొత్త వందే భారత్‌ రైళ్లు..!

ఒడిశాకు మూడు కొత్త వందే భారత్‌ రైళ్లు మంజూరు అయిన‌ట్లు భార‌తీయ రైల్వే శాఖ తెలిపింది. ఈ నెల 15న ప్రధాని మోదీ ప్రారంభిస్తారని తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. టాటా-బెర్హంపుర్‌, రవూర్కెలా-హావ్‌డా, దుర్గ్‌-విశాఖ రూట్‌లలో వందే భార‌త్ సేవలు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో రానున్న‌ట్లు తెలిపారు. ఈనెల 15న మొత్తం 10 వందేభారత్‌ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించ‌నున్నారు.

Blog Image

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

Blog Image

మహిళపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం

గృహిణిపై ఫ్లిప్‌కార్ట్‌ డెలివరీ బాయ్‌ అత్యాచారయత్నం చేశాడు. నిర్మల్ పట్టణంలో ఇది జరిగింది. పార్శిల్‌ను ఇచ్చేందుకు ఓ ఇంటికి వెళ్లిన డెలివరీ బాయ్‌ మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా కేకలు వేసింది. వెంటనే అతడు అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Blog Image

వరదపై టీడీపీ-వైసీపీ బురద రాజకీయాలు: షర్మిల

బుడమేరు వరదపై టీడీపీ-వైసీపీ బురద రాజకీయాలు చేస్తున్నాయని ‘ఎక్స్’ వేదికగా ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. విజయవాడలోని పాత రాజరాజేశ్వరిపేటలో వరద బాధితులను ఆమె పరామర్శించారు. ఆంధ్రపై కేంద్రానికి ఎందుకు సవతి తల్లి ప్రేమ..? అని నిలదీశారు. విజయవాడ రైల్వే డివిజన్ నుంచి ఏటా రూ.6 వేల కోట్ల ఆదాయం పొందుతున్న రైల్వేశాఖ.. కనీసం నీళ్ల బాటిల్ ఇవ్వకపోవడం దారుణమని అన్నారు.

Blog Image

రూ.3 వేల కోట్లతో పారిశ్రామిక మండలి

తెలంగాణలో రూ.3 వేల కోట్ల పారిశ్రామిక మండలిని ఏర్పాటు చేస్తామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జహీరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సంసిద్ధత తెలిపిందని వెల్లడించారు. వ్యాపార, పారిశ్రామిక సంస్థల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్నాయని చెప్పారు.

Blog Image

కేంద్రానికి, సీఎం రేవంత్‌కు మంత్రి దామోదర కృతజ్ఞతలు

తెలంగాణకు నాలుగు మెడికల్ కాలేజీలను కేటాయిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రానికి, మంజూరు చేసేలా కృషిచేసిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ‌ ఏడాది మొత్తం 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సర్కార్ సాధించిందని, మొత్తంగా 400 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు.

Blog Image

హైకోర్టును ఆశ్రయించిన ఆదిమూలం

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన లైంగిక వేధింపులు కేసు కొట్టేయాలని ధర్మాసనాన్ని కోరారు. ప్రాథమిక విచారణ లేకుండా కేసు నమోదు చేశారని పిటిషన్ వేశారు. జూలై, ఆగస్టు నెలలో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. కాగా, ఇటీవల ఓ మహిళ తనపై జరిగిన లైంగిక దాడి వీడియోను బయటపెట్టింది.

Blog Image

ఏపీకి కియా రూ. 3 కోట్ల విరాళం

ఏపీకి కియా మోటార్స్ ఇండియా విభాగం భారీ విరాళంతో ముందుకొచ్చింది. వరదల్ల నుంచి రిలీఫ్ పొందేందుకు తమ వంతుగా రూ.3 కోట్ల చెక్‌ను కియా మోటార్స్ సీఏఓ కాబ్ డాంగ్ లీ సీఎం చంద్రబాబుకు అందించారు. కష్ట సమయంలో ఇచ్చిన విరాళం ఎంతో ఉపయోగపడుతోందని సీఎం వారికి ధన్యవాదాలు తెలిపారు.

Blog Image

హైడ్రాకు ప్రత్యేకంగా పోలీసు సిబ్బంది కేటాయింపు

TG: హైడ్రాకు ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. 15 మంది సీఐ స్థాయి, 8 మంది ఎస్‌ఐ అధికారులను కేటాయిస్తూ ఉత్తర్వులు రిలీజ్ చేసింది.

Blog Image

ట్రాఫిక్ పోలీసుల ఎఫెక్ట్.. నిప్పంటించుకున్న యువకుడు

ట్రాఫిక్‌ పోలీసులు బైక్ ఆపారని ఓ యువకుడు మనస్థాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించాడు. శంషాబాద్‌ పరిధిలోని తొండుపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో బైక్‌ నడుపుతున్న వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. అతన్ని బెదిరిస్తూ మాట్లాడటంతో ఇరు వర్గాల మధ్య వాదన జరిగింది. పోలీసుల తీరుతో విసిగిపోయిన యువకుడు కోపంతో పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలించారు.

Blog Image

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణ కొత్త నాలుగు, ఏపీకి రెండు మెడికల్ కాలేజీలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో యాదాద్రి భువనగిరి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఇక ఏపీలో కడప, పాడేరుకు కేటాయించింది. ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభం అవుతాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.