shape

Telangana ChotaNews

Blog Image

టీడీపీ ట్వీట్‌పై కాంగ్రెస్ స్పందన ఇదే!

AP: అనకాపల్లిలో రూ.1.4లక్షల కోట్ల పెట్టుబడితో మిట్టల్, నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోందని టీడీపీ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ స్పందించింది. ‘‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేస్తామని కేంద్రంతో చెప్పించగలరా? చాప కింద నీరులా ప్రైవేటీకరణ సాగుతోంది. దీన్ని పక్కదారి పట్టించేందుకు జనాలను మభ్యపెట్టే కబుర్లు ఇంకెన్నాళ్లు?2018లో సీఎం చంద్రబాబు పునాది వేసిన కడప ఉక్కు పరిశ్రమ ఎంతవరకు వచ్చింది?’’ అని ప్రశ్నించింది.

Blog Image

ఎస్సీ హోదా కమిషన్‌ గడువు మరో ఏడాది పొడిగింపు

సిక్కు మతం, బౌద్ధ మతం కాకుండా ఇతర మతాలలోకి మారిన వ్యక్తులకు షెడ్యూల్డ్‌ కులాల హోదా కల్పించవచ్చా లేదా అన్న అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిషన్‌ గడువును మరో ఏడాది పొడిగించారు. వాస్తవానికి కమిషన్‌ గడువు ఈ ఏడాది అక్టోబర్‌ 10తో ముగిసింది. అయితే పరిశీలన ఇంకా పూర్తికాకపోవడంతో తుది నివేదికను అందజేయలేదు. దీంతో గడువును పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది.

Blog Image

గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 23 మంది మృతి

ఉత్త‌ర గాజా స‌హా ప‌లు ప్రాంతాల‌పై ఇజ్రాయెల్ దళాలు దాడులు జరిపాయి. ఈ దాడుల్లో దాడుల్లో 23 మంది మృతి చెందారు. గత 48 గంటల్లో గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 50 మంది చిన్నారులు మృతి చెందడంపై UNICEF ఖండించింది. మ‌రోవైపు లెబ‌నాన్‌లో హెజ్బొల్లాకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఇజ్రాయెల్ దాడుల్లో టాప్‌ కమాండర్‌ జాఫర్‌ ఖాదర్‌ ఫార్ హ‌త‌మ‌య్యారు.

Blog Image

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

Blog Image

కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలు విడుదల

TG: రాష్ట్రంలో 121 డిగ్రీ కళాశాల్లో పనిచేస్తున్న 460 కాంట్రాక్ట్ లెక్చరర్లకు సంబంధించిన వేతనాలు విడుదలయ్యాయి. వారికి ఇవ్వాల్సిన మూడు నెలల పెండింగ్ వేతనాలు సుమారు రూ.8.12 కోట్లు మంజూరు చేశారు. కాగా, కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు విడుదల చేయడంపై టీజీడీసీఎల్ఏ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వినోద్ కుమార్ కళాశాల విద్య కమిషనర్ దేవసేనకు, ఆర్జేడీ యాదగిరి, సీసీఈ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Blog Image

ముందుగానే ఆస్ట్రేలియాకు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు ఎంపికైన కేఎల్ రాహుల్, బ్యాకప్‌ వికెట్‌‌కీపర్‌ ధ్రువ్ జురెల్‌ను మ్యాచ్‌ ప్రాక్టీస్ కోసం ముందుగానే ఆస్ట్రేలియాకు పంపించాలని టీమ్ఇండియా నిర్ణయించింది. వీరిద్దరూ మంగళవారం ఉదయం అక్కడికి వెళ్లి ఇండియా-ఎ జట్టుతో కలవనున్నారు. మరోవైపు, ఇండియా ఎ, టీమ్‌ఇండియా మధ్య జరగాల్సిన మూడురోజుల ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌ రద్దయినట్లు కెప్టెన్ రోహిత్‌శర్మ ధ్రువీకరించాడు.

Blog Image

ఆ విషయంలో బీజేపీ నేతలు సిద్ధహస్తులు: శ్రీధర్ బాబు

TG: ప్రజాస్వామ్య విలువలను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తుంగలో తొక్కాయని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. తెలంగాణ సీఎం మారుతారని బీజేపీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్, బీజేపీలు జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో బీజేపీ నేతలు సిద్ధహస్తులని ఎద్దేవా చేశారు.

Blog Image

స్మోకింగ్‌ మానేశా.. కానీ!: షారుక్‌ ఖాన్‌

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌.. ధూమపానంపై కీలక విషయాన్ని వెల్లడించారు. తాను పొగ తాగడం మానేసినట్లు తెలిపారు. ‘‘నేను పొగ తాగడం మానేశా. దీంతో ఇకపై శ్వాస తీసుకోవడంలో నాకు ఇబ్బందులు ఉండవని తొలుత అనుకున్నా. కానీ, పొగ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇంకా బాధపెడుతూనే ఉన్నాయి. ఇప్పుడున్న ఆ సమస్య కూడా త్వరలోనే తగ్గిపోతుందని భావిస్తున్నా’’ అని తెలిపారు.

Blog Image

ఇది రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి: జగన్

AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ అధినేత జగన్ స్పందించారు. ‘‘సోషల్ మీడియా కార్యకర్తలను నిర్బంధించడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే. ఇది రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి. టీడీపీ నేతలు చేయిస్తున్న రాజకీయ ప్రేరేపిత అరెస్ట్‌లను ఖండిస్తున్నాను. పోలీసుల అధికార దుర్వినియోగం క్షమించరానిది. తక్షణమే దీనిని ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడము’’ అని ట్వీట్ చేశారు.

Blog Image

మా అమ్మ సంకల్పంతోనే ఇదంతా: కమలా హారిస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రాటిక్‌ అభ్యర్థిగా నిలిచిన కమలా హారిస్.. తన తల్లి గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘‘మా అమ్మ డాక్టర్ శ్యామలా గోపాలన్ హారిస్.. 19 సంవత్సరాల వయస్సులో ఒంటరిగా భారతదేశం నుంచి అమెరికాకు వచ్చారు. ఆమె ధైర్యం, సంకల్పం ఈ రోజు నన్ను ఇలా నిలబెట్టాయి’’ అంటూ తన తల్లి ఫొటోను షేర్ చేశారు.

Blog Image

ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తారా?: వైసీపీ

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. ‘‘వైసీపీ సోషల్‌మీడియా కార్యకర్తలపై కూటమి సర్కార్ వేధింపులకు పాల్పడుతోంది. అక్రమ కేసులు పెట్టి.. అరెస్ట్‌లు చేస్తోంది. ఇవాళ వినుకొండ, గుడివాడ‌, భీమ‌వ‌రం, ఉద‌య‌గిరి, నెల్లూరు, పెనుగొండ‌, నందిగామ త‌దితర ప్రాంతాల్లో కొంత‌మంది వైసీపీ సోషల్‌మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసింది. తప్పులను కూడా ప్రశ్నించొద్దంటూ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది’’ అని ట్వీట్ చేసింది.

Blog Image

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

ఏపీ ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. కడప జిల్లా కలెక్టర్‌గా చెరుకూరి శ్రీధర్‌, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా జి.లక్ష్మీషాను నియమించింది. అభిషిక్త కిషోర్‌కు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. వీసీ&ఎండీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎన్టీఆర్ వైద్య సేవ పథకం సీఈవో పోస్టులకు ఇంఛార్జ్‌లను నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.

Blog Image

US Elections: స్వింగ్‌ స్టేట్స్‌లో హోరాహోరీ!

అమెరికా అధ్యక్ష ఎన్నికలప్రచారం తుది అంకానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో స్వింగ్‌ స్టేట్స్‌లో వీరిద్దరి మధ్య పోటాపోటీ నెలకొన్నట్లు ది న్యూయార్క్‌ టైమ్స్‌- సైనా పోల్‌ నిర్వహించిన తాజా ఒపీనియన్‌ పోల్స్‌ పేర్కొంటున్నాయి. నెవడా, నార్త్‌ కరోలినా, విస్కాన్సిన్‌లు హారిస్‌ వైపు మొగ్గుచూపగా.. ఆరిజోనాలో ట్రంప్‌నకు మద్దతు లభిస్తున్నట్లు సమాచారం. మిషిగన్‌, జార్జియా, పెన్సిల్వేనియాల్లో ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Blog Image

రేపు పిఠాపురంలో పర్యటించనున్న ప‌వ‌న్

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ రేపు, ఎల్లుండి పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు అభివృద్ధి ప‌నులకు ఆయ‌న శంకుస్థాప‌న చేయ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు ప‌వన్ రాజ‌మండ్రి ఎయిర్ పోర్టులో దిగ‌నున్నారు. అక్క‌డ నుండి రోడ్డు మార్గంలో గొల్ల‌ప్రోలు జిల్లా ప‌రిష‌త్ స్కూల్‌కు వెళ్ల‌నున్నారు. అనంత‌రం నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై అధికారుల‌తో స‌మీక్షించ‌నున్నారు.

Blog Image

‘కేంద్రమంత్రి అయితే ఇంకేమైనా ఉందా?’

AP: వైసీపీ నేత విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఎంపీ అయితేనే విజయసాయిరెడ్డి తన వియ్యంకుడితో కలిసి సగం రాష్ట్రాన్ని దోచేశారని.. ఇక కేంద్రమంత్రి అయితే ఇంకేమైనా ఉందా? అని చురకలంటించారు. ఇంకా వైసీపీ బతికి బట్టకడుతుందని ఆశగా ఉందా.. కన్నతల్లే జగన్ బతుకు బయటపెట్టిన తర్వాత ఇంకా ఎక్కడుందయ్యా పార్టీ అని ఎద్దేవా చేశారు.

Blog Image

రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని హైద‌రాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Blog Image

తిరుమలలో తప్పిన పెను ప్రమాదం

AP: తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. అక్కడ ఓ భారీ వృక్షం నెలకొరిగింది. రాంబగీచా పార్కింగ్ వద్ద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో రెండు కారులు ధ్వంసం అయ్యాయి. ప్రమాద సమయంలో ఘటనా స్థలంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు.

Blog Image

మూడేళ్ల‌లో జగన్‌కు రాజ‌యోగం..!

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం రాజకీయంగా అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే జగన్ రాజకీయ జాతకం మారుతుందని వైసీపీ కీలక నేతలు నమ్ముతున్నారు. ఆయన తిరిగి ఏపీకి సీఎం అవుతారని అంటున్నారు. మరో మూడేళ్లలో అంటే 2027లో జమిలి ఎన్నికలు జ‌రుగుతాయ‌ని, అప్పుడు వైసీపీ భారీ ఆధిక్యతతో అధికారాన్ని సొంతం చేసుకుంటుందని వైసీపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Blog Image

ఏపీలో మరో భారీ పెట్టుబడి

ఏపీలో మరో కంపెనీ భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు రాష్ట్రంలో రూ.1.40లక్షల కోట్ల వ్యయంతో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు AM/NS (ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్) సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ ట్వీట్ చేసింది. ఈ ప్రాజెక్టును అనకాపల్లిలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఆర్సెలార్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్‌తో మంత్రి లోకేశ్ జూమ్ కాల్‌లో మాట్లాడగా.. ఈ ఒప్పందం కుదిరినట్లు ట్వీట్ చేసింది.

Blog Image

కులగణనపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

TG: జూబ్లీహిల్స్ నివాసంలో బీసీ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మరోసారి స్పష్టం చేశారు.

Blog Image

ఆ బిల్లుకు వైసీపీ వ్యతిరేకం: ఎంపీ విజయసాయిరెడ్డి

AP: ముస్లిం సంప్రదాయాలకు విరుద్దంగా ఉన్న వక్ఫ్ సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. జగన్ ఎప్పుడూ ముస్లింలకు అండగా నిలుస్తారన్నారు. ఆదాయం పెంచుకోవడం, ఖర్చు చేయడానికి బోర్డుకు అధికారం ఉందని, వాటిని తొలగించాలనే అంశాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.

Blog Image

TTD ఛైర్మన్ కొత్త నిర్ణయం.. రాజా సింగ్ స్పందన ఇదే

TG: టీటీడీ ఛైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడు ఇటీవల చేసిన కామెంట్లపై సర్వత్రా చర్చ నడుస్తోంది. తిరుమలలో పనిచేసే ప్రతి ఒక్కరూ హిందువై ఉండాలని.. ఆయన చేసిన ప్రకటనపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ కొత్త ఛైర్మన్ బీఆర్ నాయుడు తీసుకున్న నిర్ణయం సరైనదేని తమ మద్దతు ప్రకటించారు.

Blog Image

వస్తువుల ధరల్లో తగ్గుదల: ప్రపంచ బ్యాంక్

అంతర్జాతీయ మార్కెట్‌లలో వస్తువుల ధరలకు సంబంధించిన విషయాలను వరల్డ్ బ్యాంక్ తన ఔట్‌లుక్‌లో వెల్లడించింది. వస్తువుల ధరలు 2025లో 5 శాతం, 2026లో 2 శాతం.. ఈ ఏడాది 3 శాతం క్షీణతను పొందుతాయని పేర్కొంది. 2024లో బ్యారెల్‌ ధర 80 డాలర్లు కాగా.. ఇది 2025లో 73 డాలర్లకు చేరుతుందని వెల్లడించింది. 2026 నాటికి ఈ ధరలు 72 డాలర్లకు పడిపోతుందని కూడా స్పష్టం చేసింది.

Blog Image

యాపిల్ తర్వాత గూగుల్‌పై పడ్డ ఇండోనేషియా!

ఇటీవల ఐఫోన్ 16ను బ్యాన్ చేసిన తర్వాత ఇండోనేషియా ఇప్పుడు గూగుల్ పిక్సెల్ ఫోన్ల అమ్మకాన్ని నిషేధించింది. దేశీయ కంటెంట్ అవసరాలను తీర్చలేనందుకు ఇండోనేషియా గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాన్ని నిషేధించింది. ఇండోనేషియా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారికంగా సమాచారం ఇచ్చింది. ఇండోనేషియాలో విక్రయించే స్మార్ట్‌ఫోన్‌ల్లో 40శాతం స్థానిక కంటెంట్ అందించే వరకు గూగుల్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించలేమని ఇండోనేషియా తెలిపింది.

Blog Image

ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై నిషేధం.. స్పందించిన HMDA

TG: హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో అనధికార లేఅవుట్లలో ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌ను నిషేధించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని, అవన్నీ ఫేక్ అని HMDA తెలిపింది. దీనికి సంబంధించి, గత ఏడాది కాలంగా, హెచ్‌ఎండీఏ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖకు ఎలాంటి అభ్యర్థనను పంపలేదని, గ్రామ పంచాయతీల్లో అనధికారిక లేఅవుట్‌ల ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసింది.

Blog Image

హైదరాబాద్‌లో పెరిగిన వాయు కాలుష్యం

హైదరాబాద్‌లో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తుంది. గత 72 గంటల్లో సిటీలో గాలి నాణ్యత క్షీణించింది. టపాసులు భారీగా కాల్చడంతో కాలుష్యం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10శాతం కాలుష్యం ఎక్కువైందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో 171గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదు అయిందన్నారు. కాప్రా, బొల్లారం, పటాన్‌చెరు, సోమాజిగూడ, సనత్‌నగర్‌లో అధికంగా వాయు కాలుష్యం పెరిగిందని చెప్పారు.

Blog Image

రికార్డు స్థాయి కాలుష్యం.. స్కూళ్లు మూత!

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా కొనసాగుతున్న పాకిస్థాన్‌లోని లాహోర్‌లో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. తాజాగా అక్కడ కాలుష్య తీవ్రత రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీంతో చర్యలకు ఉపక్రమించిన అధికారులు.. ప్రాథమిక పాఠశాలలను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కార్యాలయాలకూ వర్క్‌-ఫ్రమ్‌-హోమ్‌ తప్పనిసరి చేశారు.

Blog Image

ఈసారి నన్ను సంతోషపెట్టండి: డిప్యూటీ సీఎం అజిత్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్బంగా అజిత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో బారామతి నుంచి సుప్రియా సూలేను గెలిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఓటు వేయండి. ఎంపీగా సుప్రియాను గెలిపించి.. శరద్ పవార్‌ను సంతోపరిచారు. ఇప్పుడు నాకు ఓటు వేసి నన్ను సంతోషపెట్టండి’’ అని చెప్పుకొచ్చారు.