shape

All News ChotaNews

క్యాన్సర్‌తో పోరాడుతున్న మాజీ క్రికెటర్.. బీసీసీఐ సాయం

క్యాన్సర్‌తో పోరాడుతున్న మాజీ క్రికెటర్.. బీసీసీఐ సాయం

భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. బ్లడ్ క్యాన్సర్ బారిన పడిన అతను లండన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ మాజీ క్రికెటర్ చికిత్స కోసం బీసీసీఐ గొప్ప మనసును చాటుకుంది. అతని చికిత్స కోసం వెంటనే కోటి రూపాయలను విడుదల చేయాలని బీసీసీఐ సెక్రటరీ జై షా ఆదివారం సంబంధిత అధికారులను ఆదేశించారు.

కాల్పుల విరమణ చర్చల నుంచి వైదొలగిన హమాస్‌

కాల్పుల విరమణ చర్చల నుంచి వైదొలగిన హమాస్‌

గాజాలో శాంతి యత్నాలకు తీవ్రవిఘాతం ఏర్పడింది. కాల్పుల విరమణ చర్చల నుంచి వైదొలగుతున్నట్లు హమాస్ చీఫ్ ఇస్మాయిలీ హనియా ప్రకటించారు. శాంతి చర్చలపై ఇజ్రాయెల్‌ ఆసక్తిగా లేకపోవడం, నిరాయుధ పౌరులపై ఐడీఎఫ్‌ దాడులు చేయడం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇస్మాయిలీ తెలిపారు.

తీవ్రవాదుల ఆకస్మిక దాడి.. సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి

తీవ్రవాదుల ఆకస్మిక దాడి.. సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి

మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. అనుమానిత తిరుగుబాటుదారుల దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్‌ మరణించాడు. జిరిబామ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అస్సాం సరిహద్దు జిల్లా ప్రాంతంలో పారామిలిటరీ సిబ్బంది, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా గస్తీ నిర్వహిస్తుండగా తీవ్రవాదులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ సంఘటనలో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మరణించగా, ఆ వాహనంలో ఉన్న ఇద్దరు పోలీస్‌ కమాండోలు గాయపడ్డారు.

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

శివాలయ ప్రదక్షిణానికీ నియమాలున్నాయ్..!

తెలంగాణ మరో పదేళ్లు కాంగ్రెస్‌దే: సీఎం రేవంత్

తెలంగాణ మరో పదేళ్లు కాంగ్రెస్‌దే: సీఎం రేవంత్

తెలంగాణలో మరో పదేళ్లపాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌కు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పని అయిపోయింది అన్నవాళ్లు.. ఇప్పుడు వాళ్ల వైపు ఎంతమంది ఉన్నారని లెక్కపెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీఆర్ఎస్ కోరుకుంటే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్‌ను నిలబెట్టడానికి వస్తున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్‌పై సీఎం రేవంత్ విమర్శలు

కేసీఆర్‌పై సీఎం రేవంత్ విమర్శలు

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఓడిపోయి ఫామ్‌హౌస్‌లో ఉన్నోళ్లను నేను అడుగుతున్నా.. ఔటర్ రింగ్ రోడ్, ఫార్మా ఇండస్ట్రీ, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ తెచ్చింది కాంగ్రెస్ కాదా?. మీరేం తెచ్చారు… డ్రగ్స్, గంజాయి తప్ప. గత పదేళ్లకు తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు’’ అని పేర్కొన్నారు.

గౌడన్నల ఎక్స్‌గ్రేషియాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

గౌడన్నల ఎక్స్‌గ్రేషియాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

TG: గౌడన్నల ఎక్స్‌గ్రేషియాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పలువురు గీత కార్మికులకు ‘కాటమయ్య రక్ష కిట్ల’ను పంపిణీ చేశారు. అలాగే మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.7 కోట్ల 90 లక్షల గౌడన్నల ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

రూట్ మార్చిన జగన్‌.. రేప‌ట్నుంచి ప్ర‌జా ద‌ర్బార్‌..?

రూట్ మార్చిన జగన్‌.. రేప‌ట్నుంచి ప్ర‌జా ద‌ర్బార్‌..?

వైసీపీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్‌ ప్రజలతో మమేకమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశమైన ఆయన పార్టీ ఓటమి సంబంధించి నేతలకు భరోసాను కల్పించే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో రేప‌టి నుంచి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం జోరుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

హయత్‌నగర్‌ వరకు త్వరలోనే మెట్రో రైలు: రేవంత్‌రెడ్డి

హయత్‌నగర్‌ వరకు త్వరలోనే మెట్రో రైలు: రేవంత్‌రెడ్డి

గీత కార్మికులకు ‘కాటమయ్య రక్షణ’ కిట్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పేదలకు కూడా కార్పొరేట్‌ విద్య, వైద్యం అందాలని కాంగ్రెస్‌ ఆలోచించింది. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాలు తెచ్చాం. కాంగ్రెస్‌ చేపట్టిన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్‌ వల్ల రంగారెడ్డి జిల్లా భూముల విలువ పెరిగింది. హయత్‌నగర్‌ వరకు త్వరలోనే మెట్రోరైలు కూడా వస్తుంది’’అని తెలిపారు.

బీజేపీలో చేరిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి

బీజేపీలో చేరిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి

మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్య బీజేపీలో చేరారు. పదవీ విరమణ చేసిన మూడు నెలల తర్వాత ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. శనివారం భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాఘవేంద్ర శర్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. 2013 సెప్టెంబరు 12న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రోహిత్ ఆర్య నియమితులయ్యారు.

గీత కార్మికులకు సీఎం రేవంత్ కీలక హామీ

గీత కార్మికులకు సీఎం రేవంత్ కీలక హామీ

TG: గీత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో, పట్టణంలో ఉన్న ప్రభుత్వ భూమిలో తాటిచెట్లు, ఈతచెట్లను పెంచేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో చెట్లపెంపకానికి సంబంధించి ప్రభుత్వం చేపట్టనున్న అన్ని కార్యక్రమాల్లో తాటిచెట్లు, ఈతచెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తామన్నారు. దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని అధికారులకు సూచించారు.

‘కాటమయ్య రక్ష కిట్ల’ పంపిణీ పథకాన్ని ప్రారంభించిన సీఎం

‘కాటమయ్య రక్ష కిట్ల’ పంపిణీ పథకాన్ని ప్రారంభించిన సీఎం

గీత కార్మికులకు ‘కాటమయ్య రక్ష కిట్ల’ పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం లష్కర్‌గూడలో ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన సేఫ్టీ కిట్లను(కాటమయ్య రక్ష కిట్లు) లబ్ధిదారులకు అందజేశారు. హైదరాబాద్‌ ఐఐటీ తయారు చేసిన వీటిని బీసీ కార్పొరేషన్‌ ద్వారా అందించారు. చెట్లు ఎక్కుతుండగా ప్రమాదాల బారిన పడకుండా ఈ కిట్లు ఉపయోగపడనున్నాయి.

గౌడన్నలు పౌరుషానికి, పోరాటానికి మారుపేరు: సీఎం రేవంత్

గౌడన్నలు పౌరుషానికి, పోరాటానికి మారుపేరు: సీఎం రేవంత్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే కుల వృత్తులకు న్యాయం జరుగుతుందని గౌడన్నలు కాంగ్రెస్‌కు అండగా నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కాటమయ్య రక్ష’ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గౌడన్నలు పౌరుషానికి, పోరాటానికి మారుపేరు అని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధిలో గౌడన్నల పాత్ర మరువలేనిదని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌడు సామాజికవర్గానికి ప్రత్యేక స్థానం కల్పించామన్నారు.

మా ప్రభుత్వ ధ్యేయం అదే: శ్రీధర్ బాబు

మా ప్రభుత్వ ధ్యేయం అదే: శ్రీధర్ బాబు

TG: గీత కార్మికుల సమస్యల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపించారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నీరా ఏర్పాటు కోసం గీత కార్మికులకు ఆర్థిక సహాయం చేస్తాం. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే మా ప్రభుత్వం లక్ష్యం. ప్రతిగ్రామానికి గీత కార్మికులే మూలాలు’’ అని పేర్కొన్నారు.

ట్రంప్‌పై కాల్పులు.. భారీగా పెరిగిన విజయావకాశాలు..!

ట్రంప్‌పై కాల్పులు.. భారీగా పెరిగిన విజయావకాశాలు..!

పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఓ దుండగుడు కాల్పులు జరిపిన ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన తర్వాత ట్రంప్‌ విజయావకాశాలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. పోల్‌స్టర్‌ తాజా నివేదికలో వెల్లడించింది. ఈ దాడి అనంతరం ట్రంప్‌కు ప్రజల్లో మద్దతు ఒక్కసారిగా 8 శాతం పెరిగినట్లు పేర్కొంది.

గీత కార్మికులకు అండగా కాంగ్రెస్: పొన్నం

గీత కార్మికులకు అండగా కాంగ్రెస్: పొన్నం

TG: కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికులకు అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘కాటమయ్య రక్ష’ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘గౌడ బిడ్డగా మన హక్కులను కాపాడుకుందాం. అన్ని కులాల సంక్షేమ కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుంది. తాటి వనంలో తాటి చెట్లు, ఈత చెట్లు పెంచేందుకు పర్మిషన్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం’’అని పేర్కొన్నారు.

పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలి: AIFTP

పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలి: AIFTP

రాబోయే కేంద్ర బడ్జెట్‌లో పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ కేంద్రాన్ని కోరింది. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఆదాయంపై 10%, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఆదాయంపై 20%, రూ.20 లక్షలకు పైబడిన ఆదాయంపై 25% పన్ను విధించాలని సంఘం అధ్యక్షుడు నారాయణ్ జైన్ పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: చామల

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: చామల

TG: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ ముందుకు సాగుతోందని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. లష్కర్‌గూడలో ‘కాటమయ్య రక్ష’ కవచాల పంపిణీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు, నిరుద్యోగులకు, అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గత పదేళ్లలో వెనుకబడిన తెలంగాణను.. రాబోయే ఐదేళ్లలో బంగారు తెలంగాణ చేయాలన్న పట్టుదలతో సీఎం ఉన్నారని చామల చెప్పారు.

పూరీ రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ ప్రారంభం

పూరీ రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ ప్రారంభం

ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం ఇందుకు సంబంధించి కార్యాచరణ మొదలుపెట్టారు. 1978లో చివరిసారిగా దీన్ని తెరిచారు. 46 ఏళ్ల తర్వాత నేడు మళ్లీ ఈ రత్న భాండాగారం తెరుచుకుంటోంది. శ్రీక్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటికి అంతరాయం కలగకుండా భాండాగారం తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ప్రాణాలు నిలిపేది కాటమయ్య రక్ష కవచం: రంగారెడ్డి

ప్రాణాలు నిలిపేది కాటమయ్య రక్ష కవచం: రంగారెడ్డి

TG: తాటి చెట్లపై గీత కార్మికులకు ప్రాణాపాయం తప్పించే పరికరమే కాటమయ్య రక్ష కవచమని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. లష్కర్‌గూడలో ఆయన మాట్లాడుతూ.. ‘‘గీత కార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుంది. గ్రామాల్లో ఈత, తాటి వనాల పెంపకానికి స్థలాన్ని కేటాయించేందుకు ప్రయత్నిస్తాం. గత ప్రభుత్వం గౌడ సొసైటీలకు ఇచ్చిన భూములను అమ్ముకుంది’’ అని తెలిపారు.

‘కన్నప్ప’ నుంచి శరత్‌కుమార్ లుక్ రివీల్

‘కన్నప్ప’ నుంచి శరత్‌కుమార్ లుక్ రివీల్

మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. నేడు శరత్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన లుక్‌ను రివీల్ చేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆయన ‘నాథనాథుడు’ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. కాగా ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, కాజల్, ప్రీతి ముకుందన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు.